ఫోకస్

హంతకులను సమర్థిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతన హిందూ ధర్మంలో గోవు పవిత్రతను గురించి ఎంతో విపులంగా వివరించారు. అలనాడు గో సంపదవల్లనే రాజ్యాలు సుభిక్షంగా ఉన్నాయని ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పవిత్రత గల గోవులను హత్య చేస్తున్నా ప్రభుత్వాలు మిన్నకుండటం శోచనీయం. ఓటు రాజకీయాలకోసం గో హంతకులను సమర్థించడం తగదు. దేశమంతటా ఒకే పన్ను విధానం కోసం జిఎస్‌టి ఏ విధంగా తీసుకువచ్చారో అదే విధంగా దేశమంతటా గోరక్షణకోసం ఓ చట్టం తేవాలి. గోరక్షకులకు ప్రభుత్వం భద్రత కల్పించడంతోపాటు గోవులను కాపాడుకోడానికి తగిన వౌలిక సౌకర్యాలు కల్పించాలి. అలాంటపుడే గోవులను రక్షించుకోగలము. నేడు బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ గోరక్షణ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దేశంలో సగం రాష్ట్రాలు బిజెపి పాలిత ప్రాంతాలు, పొత్తుతో నడుస్తున్నవి ఉన్నప్పుడే ధైర్యం చేయలేకపోతే ఎందుకు? ప్రభుత్వం పకడ్భందీగా చట్టాన్ని అమలు చేస్తేనే గో హత్యలు జరగకుండా అడ్డుకట్ట వేయడానికి వీలు కలుగుతుంది. అయితే ఓటు రాజకీయాలకోసం నేతలు మిన్నకుండటం సరికాదు. నేడు ఏ ప్రభుత్వమైనా ఆదాయంకోసం పరుగులు తీస్తున్నాయే తప్ప ప్రజా సేవ కోసం ప్రభుత్వాలు పనిచేయడం లేదన్నదీ పలు సందర్భాల్లో రుజువైంది. ఏదో ఒక వర్గాన్ని సంతృప్తి చేయడానికి ప్రభుత్వం మిన్నకుండటం సరికాదు. చట్టాలు ఉన్నప్పటికీ వాటిని పకడ్బందీగా అమలు చేయగల ధైర్యం ప్రభుత్వాలకు ఉండాలి. ఏ చిన్న చట్టమైన అమలు చేసే ధైర్యం ప్రభుత్వాలకు లేకపోతే ప్రయోజనం ఏమిటి? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించడంవల్లనే ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. ఇకనైనా గోరక్షకులకు సరైన భద్రత కల్పించాలి. గోహంతకులపై చట్టపరమైన చర్యలు తీసుకొని గోవులు కబేళాలకు తరలిపోకుండా అడ్డుకట్ట వేయగలగాలి.

- పి.రామారావు, రాష్ట్ర అర్చక పురోహిత్ ప్రముఖ్, విజయనగరం.