ఫోకస్

గోభక్తి దారితప్పుతోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతిని ఆరాధించే వారిలో జంతుజాలాన్ని ప్రేమించే వారిలో భారతీయులు అగ్రస్థానంలోనే ఉంటారు. చీమలకు, వీధి కుక్కలకు, చేపలకు ఆహారం వేసే గొప్ప సంస్కృతి ఉన్న దేశం మనది. చివరికి పాముకు సైతం పూజలు చేసి కొలిచే సంప్రదాయం భారతీయులదే. వ్యవసాయం, ప్రకృతి, అరణ్యాలను, జంతుజాలాన్ని, వన్యమృగాలను సైతం పరిరక్షించడంలో ముందుంటాం. ఆ క్రమంలోనే భారతీయుల జీవనవిధానంతో ముడిపడిన గోరక్ష కూడా అలవాటు పడింది. గోరక్ష, గోపూజ ఈనాటిది కాదు, పురాణ, ఇతిహాసాల కాలంనుండి వింటున్నదే. గోరక్ష, గోపూజలో మహాత్మాగాంధీ, ఆయన అనుచరుడు వినోబా భావేను మించినవారు లేరు. గోరక్ష ఎలా చేయాలో వారే మనకు నేర్పించారు. దేశం అంతా వీరి మార్గానే్న అనుసరించింది. భారత రాజ్యాంగం సైతం గోరక్ష గురించి చెబుతోంది. అయితే దీనిని అడ్డం పెట్టుకుని ఒక వ్యక్తిని చంపే హక్కు ఉందా? ఇదేనా గోభక్తి అంటే... ఇదేనా గోరక్ష అంటే... గోభక్తి పేరుతో మనుషులను చంపడం ఎంతవరకూ ఆమోదయోగ్యం? గాంధీ కలలు కన్న భారతాన్ని నిర్మించేందుకు అందరూ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. మన స్వాతంత్య్ర సమర యోధులు సైతం గర్వపడేలా భారతదేశాన్ని మార్చుకోవలసి ఉంది. అయితే వినోబాభావే చేసిన ఒక సూచనపై కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. గో రక్ష విషయంలో చావడానికైనా సిద్ధంకావాలని ఆయన అన్నారు. వాస్తవానికి ఇటీవలి కాలంలో దేశంలో జరుగుతున్న గోరక్షణ దాడులపై అంతా తీవ్రంగా స్పందిస్తున్నారు. గోరక్షణ, మూక దాడుల పేరుతో జరిగే హత్యలను ఆమోదించే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని ఆయన హెచ్చరించారు. గోభక్తి పేరుతో హింస ప్రేరేపించడం మహాత్మాగాంధీ ఆలోచనలకు పూర్తిగా వ్యతిరేకం. మంచి పేరుతో చెడు చేయడం కూడా సమర్థనీయం కాదు. ముఖ్యంగా ఉత్తరాదిలో గోరక్షకుల ఆగడాలు పెరిగిపోయాయి. మొన్నటికి మొన్న రాజస్థాన్‌లో గోరక్షకుల దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆరు బిజెపి పాలిత రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. నాటి గోరక్షకులకు వాస్తవానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. నేటి గోరక్షకులకు ఎలాంటి చరిత్ర లేదు. పశుసంపదను రక్షించడానికి ప్రాణత్యాగాలు చేసి గోరక్షకులు చరిత్రలో నిలిచిపోయారు. నాడు గోరక్షకులను దేవులీలు, పల్లవులు అని ప్రాంతాల బట్టి పిలిచేవారు. మధ్యయుగాల నాడు పశుసంపదే దేశానికి బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉండేది. పశ్చిమ, ఉత్తర భారతదేశంలో అధిక పశుసంపద కలిగిన వారిని ధన్‌గర్, మాల్‌ధారి అని కూడా పిలిచేవారు. పశుసంపదను సొంతం చేసుకోవడానికి ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి. దొంగతనాలు జరిగేవి. వెయ్యేళ్ల క్రితం దేశంలో పశువుల పెంపకం, వాటి పోషణ బాగా లాభసాటి వ్యాపారం కావడంతో రాజ్‌పుత్‌లు, జాట్‌లు పెద్ద సంఖ్యలో పశువులను పెంచేవారు. వాటిని దొంగల బారినుండి శత్రువుల బారి నుండి రక్షించుకునేందుకు దేవులీలు, పల్లవులని పిలిచే గోరక్షకులను నియమించేవారు. వారిని గ్రామం మొత్తం చాలా గౌరవంగా చూసేవారు. పాబూజీ, తేజాజీ, గోగాపిర్, రామ్‌దేవ్‌లు అలా పూజలు అందుకుని చరిత్రలో నిలిచిపోయారు. పశుసంపదపై ఆధారపడి వ్యవసాయం, పాడి, ఊలు, తోలు, మాంసం పరిశ్రమలు కూడా ఉండేవి. తర్వాత 2012లో భారతీయ గోరక్షాదళ్‌ను పవన్ పండిట్ ఏర్పాటు చేశారు. తర్వాత్తర్వాత గోరక్షకుల సంఖ్య పెరిగింది. అయితే ఇటీవలి కాలంలో జరుగుతున్న పరస్పర దాడులపై నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.