కడప

ఊసేలేని రుణాలు.!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 17: బిసి కులవృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం అందించిన రుణాలు లబ్ధిదారులకు అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యూనిట్ల కింద నిధులు మంజూరుచేసినా ఇంతవరకు బ్యాంకర్లు కరుణించక బ్యాంకుల చుట్టూ బిసి లబ్ధిదారులు దాదాపు ఏడాదిగా కాళ్లరిగేవరకు తిరుగుతున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.17.23కోట్లు మంజూరు చేయగా ఈ ఏడాది కూడా రూ.17కోట్లు పైబడి రుణాలు మంజూరు చేయనుంది. రాష్ట్ర బిసి కార్పొరేషన్ వ్యక్తిగత యూనిట్లు ఏర్పాటు చేసుకుని కులవృత్తులపై ఆధారపడి జీవించేవారికి వృత్తిలో నైపుణ్యత నిమిత్తం రుణం కూడా ఒక్కొక్కరికి రూ.2లక్షలు చొప్పున మంజూరు చేసి లక్షరూపాయలు సబ్సిడీ కింద, లక్షరూపాయలు తిరిగి చెల్లించాల్సివుంటుంది. 10 నుంచి 15మంది వరకు ఒక యూనిట్‌గా, గ్రూప్‌గా ఏర్పాటై వారికి రుణం కోసం ఏడాది క్రితమే దరఖాస్తులు చేసుకున్నారు. 2016-17లో 1700 మంది పైబడి రుణాలకు దరఖాస్తులు చేసుకున్నారు. వ్యక్తిగత రుణాల కింద 19వేల మంది పైబడి దరఖాస్తులు చేసుకున్నారు. 1720మందికి పైబడి ఒక్కొక్కరికి లక్షరూపాయలు రుణం ఇవ్వాల్సివుండగా, రూ.50వేలు సబ్సిడీతో మరో రూ.50వేలు బ్యాంకు అప్పుగా ఇవ్వాల్సివుంది. వ్యిక్తిగత రుణాలు లక్షరూపాయలు కాగా యూనిట్లు నడుపుకునే వారికి రూ.2లక్షల వరకు కులవృత్తుల వారికి ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే జిల్లాలో బిసిలు అధికంగా ఉండటంతో లక్షరూపాయలు చొప్పున సర్దుబాటుచేసి అందరికీ రుణాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిర్ణయించింది. తిరిగి లక్షరూపాయల యూనిట్‌ను రూ.2లక్షలకు పెంచారు. 1100 యూనిట్లు ప్రభుత్వం బిసి కార్పొరేషన్ ద్వారా 19వేల మంది పైబడి వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు చేసుకోగా వారికి జిల్లా బిసి కార్పొరేషన్ 2వేల మందికిపైబడి రుణాలు అందజేసేందుకు సంబంధిత బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం కూడా జరిగింది. అయితే 19వేల మంది పైబడి దరఖాస్తుదారులకు 1723 యూనిట్లు రెండవ పర్యాయం కొత్తగా మంజూరు చేసింది. వీరందర్నీ మండల స్థాయిలో మండలాభివృద్ధి కమిటీ పురపాలక సంఘాల్లో కమిషనర్ల కమిటీ, బ్యాంకర్ల సమావేశాలు, ఇంటర్వ్యూలు నిర్వహించి రుణాలకోసం లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే కొంతమంది బ్యాంకర్లు పరపతి కలిగిన వారికి ఎటువంటి సూరిటీలు లేకుండా రుణాలు ఇవ్వడం, పరపతి లేని వారికి సూరిటీ లేకుంటే రుణాలు ఇవ్వమని తెగేసి చెబుతున్నారు. ప్రతి బ్యాంకు తమ బ్యాంకు ద్వారా లబ్ధిదారులకు అనేక సేవలు అందిస్తున్నామని రుణాలు ఇవ్వడంలో తమ బ్యాంకు అగ్రగామిగా ఉందని కాకి లెక్కలు చూపడం, ప్రభుత్వం నుంచి విడుదలయ్యే కోట్లాదిరూపాయలు తమ బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడం తప్ప ప్రభుత్వాధికారులు సిఫార్సుచేసిన వారికి రుణాలు ఇవ్వడంలో ఘోరంగా బ్యాంకర్లు విఫలమయ్యారనేది జగమెరిగిన సత్యం. ఈ రుణాలకోసం బిసి లబ్ధిదారులు నాయకుల చుట్టు ప్రదక్షిణలు చేయడం, బ్యాంకర్ల చుట్టు ప్రదక్షిణలు చేయడం, తీరా బ్యాంకు మేనేజర్ సమ్మతించి ఏదైనా పొలాలు కానీ, సొంత ఇల్లుకానీ షూరిటీ పెట్టాలని, లేనిచో ప్రభుత్వ ఉద్యోగులు షూరిటీ ఇవ్వాలని తెగేసి చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులకు ఏమీ తోచక ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిపోయినా ఇంతవరకు రుణాలు అందకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. చాలా మంది లబ్ధిదారులు రుణాలపై ఆశలు పెట్టుకుని రుణాలద్వారా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చునని గంపెడు ఆశలు పెట్టుకుని గత ఆరుమాసాలుగా పనులు వదులుకుని, నేతలు, బ్యాంకులు, సంబంధిత అధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవతీసుకుని లబ్ధిదారులకు రుణాలు ఇప్పించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.