కడప

మంత్రి ఆది రాజకీయ భవితవ్యంపై నీలినీడలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 20:జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైసిపి తరపున గెలుపొందిన సి.ఆదినారాయణరెడ్డికి నాలుగువారాల్లో పార్టీ ఫిరాయింపుపై హైకోర్టుకు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన దరిమిలా తెలుగుదేశం పార్టీ అధిష్టానంతోపాటు జిల్లా తెలుగుతమ్ముళ్లు సమాలోచనలో పడ్డారు. హైకోర్టు నోటీసుల ద్వారా ఫిరాయింపు చట్టం అమలైతే ఆదినారాయణరెడ్డి రాజకీయ భవిష్యత్ ఏమిటని జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆయన అనుచరులు సైతం మదనపడుతున్నారు. ఒకవేళ కుడి ఎడమైతే 2019 ఎన్నికల పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ఎవరికీ అంతుపట్టడంలేదు. తెలుగుదేశం అధిష్టానం మాత్రం ఆది పదవికి ఎలాంటి ఢోకా ఉండదని ఎవరు ఆందోళనపడవద్దన్న సంకేతాలు ఇచ్చింది. ఒకవేళ జరగరానిది జరిగితే ఆదినారాయణరెడ్డికి కేబినెట్ హోదా కలిగిన పదవి ప్రభుత్వం అప్పగించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఇదిలా ఉండగా వైసిపి నుంచి గెలుపొందిన మరో బద్వేలు ఎమ్మెల్యే టి.జయరాములుపై కూడా వేటువేసేందుకు వైసిపి అధిష్టానం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అధిష్టానం సైతం ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో పార్టీని పదిలం చేసుకోవడంతోపాటు సొంత జిల్లాలో ఉనికి కాపాడుకునేందుకు తనదైన మార్క్ వేసుకునేందుకు సర్వశక్తులు వడ్డుతున్నారు. అయితే టిడిపి జిల్లాలో పూర్వవైభవం తెచ్చేందుకు అన్ని మార్గాలు వెతుకులాటతో 2019 ఎన్నికల నాటికి పార్టీకి బలం కలిసొచ్చేవిధంగానే అడుగులు వేస్తోం ది. జగన్ మాత్రం తన తండ్రి పం ధాలో శతృత్వాన్ని మిత్రుత్వం చేసుకునేందుకు టిడిపి నేతల్లో బలమైన నాయకులకు గాళం వేసి వారికి రాజకీయ భవిష్యత్ కల్పించేందుకు ఒక పక్క చర్చలు కూడా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కోవలోనే పులివెందుల, జమ్మలమడుగు, కడప నియోజకవర్గాలపై పట్టు బిగించేందుకు జగన్ టిడిపి నేతలతో లోలోపల టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం హైకోర్టు జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డికి నోటీసులు ఇచ్చిన దరిమిలా న్యాయస్థానం చివరకు ఏమి తీర్పు ఇస్తుందో తెలియదుకానీ పనిలో పనిగా వైసిపి జిల్లాలో పార్టీని పటిష్టం చేసుకునేందుకు వ్యూహరచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టిడిపి అధిష్టానం కూడా ముందస్తుగా పసిగట్టి నియోజకవర్గాల వారీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. ఏది ఏమైనా జిల్లాలో ఆది రాజకీయ భవితవ్యంపై ఆదికి ప్రత్యామ్నాయ నేతపై వాడి వేడిగా చర్చలు ఉన్నాయి. అయితే జిల్లా టిడిపి నేతలు మాత్రం ఆదిపదవికి ఢోకా ఉండదని గట్ట్ధిమాతో ఉన్నారు.