కడప

రూ.200కోట్లతో పాఠశాలల్లో ఆటస్థలాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 20:ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆటస్థలాల అభివృద్ధికి జిల్లాకు రూ.200కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఈమేరకు జిల్లాలో ఒక్కొక్క క్రీడా ప్రాంగణానికి రూ.5లక్షలు వెచ్చించేందుకు జిల్లా అధికారులను ప్రతిపాదనలు అడిగింది. ఈమేరకు 200 పాఠశాలల క్రీడా ప్రాంగణాలకు సౌకర్యాలు మెరుగుకానున్నాయి. క్రీడాపాఠశాలల్లో వివిధ రకాల కోర్టులు ఏర్పాటుచేసి తద్వారా క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, ఖో-ఖో, కబడ్డీ, రన్నింగ్ రేస్ నిమిత్తం 100 నుంచి 500మీటర్ల పొడవునా కోర్టులను తయారుచేయనున్నారు. ఈనేపధ్యంలో జిల్లా క్రీడల అధికారి, వివిధ క్రీడలకు సంబంధించిన కార్యదర్శులు, కోచ్‌లు సర్వం సిద్దం చేసి రాష్టస్థ్రాయి అన్ని రకాల పోటీలను, జాతీయ స్థాయిలో కనీసం రెండుమూడు పోటీలు నిర్వహించేందుకు ఆట స్థలాల తయారీకి సమాయత్తం అవుతున్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ స్టేడియం, రిమ్స్ సమీపంలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలకు మహర్ధశ రానుంది. ఆట స్థలాలు లేని జడ్పీ, పురపాలక, ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యామ్నాయంగా ఆటస్థలాలు అనే్వషణలో అధికారులున్నారు. క్రీడలతోపాటు యోగాను కూడా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రత్యేకించి క్రీడాపాఠశాల ఉన్నా ఆ పాఠశాలను కూడా సౌకర్యాలు మెరుగుపరచి అనేక రకాల పోటీలకు తర్ఫీదు నిమిత్తం ముస్తాబు చేయక తప్పదు. అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రీడాపాఠశాలలో మరోమారు అవినీతి అక్రమాలుచోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు అధికారులు తీసుకుంటున్నారు. ఇకపోతే క్రీడల ద్వారా రాణిస్తున్న విద్యార్థులకు క్రీడల కోటా కింద విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ అవకాశాలు మెండుగా ఉండటంతో ప్రతి ఒక్క విద్యార్థి తండ్రి సైతం క్రీడలపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులే క్రీడీలపట్ల ఆసక్తి కనబరుస్తుండగా ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల చదువుతున్న విద్యార్థులు సైతం క్రీడాపోటీలకు ఉత్సాహం చూపుతున్నారు. ఇందుకు ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా క్రీడలను ప్రోత్సహించేందుకు ఫిజికల్ డైరెక్టర్లను నియామకం చేసుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ప్రత్యేకించి జిల్లా కేంద్రంలో ప్రాంతీయ వ్యాయామ అధికారి ఉండటంతో పాఠశాల విద్య ఆర్జెడి, నాలుగు జిల్లాలకు సంబంధించిన డిఇఓలు పాఠశాలల క్రీడల అభివృద్ధికి వారు సైతం ఇక బిజీగా క్రీడాప్రాంగణాలు తనిఖీ చేయడంతోపాటు క్రీడలను ప్రోత్సహించాల్సి ఉంది. కలెక్టర్ బాబూరావునాయుడు అధ్యక్షతన జిల్లాలోని క్రీడాప్రాంగణాలన్నింటినీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దితే తప్ప ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు విడుదలవుతుంది. ఈనేపథ్యంలో క్రీడాప్రాంగణాల అభివృద్ధికి సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ముందస్తుగా ప్రణాళికలు సిద్దంచేసుకుంటున్నట్లు తెలుస్తుంది.