కడప

ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరచిన ఏపి కేబినెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప(కల్చరల్), జూలై 20:రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా ఎన్నో డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయని కానీ గురువారం ఏపి కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరిచినందుకు నిరసనగా గురువారం స్థానిక ఇరిగేషన్ కార్యాలయం ఆవరణంలో ఉద్యోగులు భోజన విరామసమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఏపిటిఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదర్శన్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఏపి కేబినెట్ స్పందించకపోవడం అన్యాయమన్నారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను ఆమోదించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు జయరామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా చేరిన ఏపిటిఓలు సభ్యత్వం నమోదుచేసుకోవాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.అఫ్సర్ మాట్లాడుతూ ఏపి కేబినెట్‌లో డిఏ, పిఆర్‌సి , అరియర్స్‌పై చర్చ వస్తుందని దానికివెంటనే కేబినెట్ ఆమోదిస్తుందని ఎంతో ఆశతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. అలాగే ప్రభుత్వం పట్ల ఉద్యోగులు ఆవేదనతో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చించి వెంటనే ఆమోదం తెలిపే జివోను విడుదల చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాలనారాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు.