కడప

ఈ ఏడాదిలోగా 50లక్షల మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 20:జిల్లాలో వనం- మనం కార్యక్రమం కింద ఈ ఏడాది 50 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించామని లక్ష్యసాధనకు వివిధ శాఖాధికారులు కృషి చేయాల్సిందిగా కలెక్టర్ టి.బాబూరావునాయుడు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వివిధ శాఖాధికారులతో సమావేశమై మాట్లాడుతూ ప్రస్తుతం చెట్లు పెంచేందుకు వాతావరణం అనువుగా ఉందని, శాఖాధికారులు వారికి కేటాయించిన లక్ష్యాల మేరకు చెట్లను నాటించాలన్నారు. అటవీశాఖకు 10లక్షల మొక్కలు, జిల్లా నీటి యాజమాన్య సంస్థకు 10లక్షల మొక్కలు, డిఆర్‌డిఏకు 5లక్షల మొక్కలు, గృహనిర్మాణ సంస్థకు 2లక్షల మొక్కలు, సాంఘిక సంక్షేమశాఖకు 2లక్షల మొక్కలు, విద్యాశాఖకు 4లక్షల మొక్కలు, ఉద్యానశాఖకు లక్ష మొక్కలు, వ్యవసాయశాఖకు లక్ష మొక్కలు, పశుసంవర్థకశాఖకు లక్ష మొక్కలు, 8 మున్సిపాలిటీలకు 10లక్షల మొక్కలు, పోలీసుశాఖకు 2లక్షల మొక్కలు, పరిశ్రమలశాఖకు 2లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాటించే మొక్కలలో జామ, అల్లనేరేడు లాంటి పండ్లకు సంబంధించిన మొక్కలను కూడా నాటాలన్నారు. ఈ మొక్కలను కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో, జిల్లాపరిషత్, ఎంపిడిఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో , విద్యాసంస్థలు, స్ర్తిశక్తి భవనాలు, మసీదులు, చర్చీలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఆవరణంలో నాటించాలన్నారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ, జెసి-2 శివారెడ్డి, డిఆర్వో నరసింహరావు, సిపివో తిప్పేస్వామి, టూరిజం ఆర్‌జెడి గోపాల్, పరిశ్రమలశాఖ జిఎం చాంద్‌బాషా, డ్వామా పిడి విజయకుమార్, వ్యవసాయశాఖ జెడి ఠాగూర్‌నాయక్, ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ ఎస్‌ఇ సంజీవరావు, అటవీశాఖ సామాజిక వనవిభాగపు అధికారి సోమశేఖర్, డివిజన్ అటవీ అధికారి వెంకటేష్, విద్యాశాఖాధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు.