కడప

జమ్మలమడుగు ఆర్డీఓను ప్రభుత్వానికి సరెండర్ చేసిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 23: జమ్మలమడుగు ఆర్డీశ వినాయకంపై అవినీతి, అక్రమాలు నిర్థారణ అయన నేపధ్యంలో ఆయనను ఆదివారం రాత్రి ప్రభుత్వానికి సరెండర్ చేస్తు నివేదికను కలెక్టర్ బాబూరావు సిసిఎల్‌ఎ,. సిఎస్‌లకు పంపారు. గండికోట ప్రాజెక్టు భూ సేకరణ నష్ట పరిహారం చెల్లింపులు, వివిధ రకాల సర్వేల్లో అవకతవకలు జరిగినట్లు ఆర్డీఓపై వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ ఈ నెల 15న జెసి -2 శివారెడ్డి ని నియమించి విచారణ జరిపించారు. జెసి విచారణ అనంతరం ఆదివారం సాయంత్రం కలెక్టర్‌కు సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి ఆర్డీఓను సరెండర్ చేశారు. ఇది ఇలా ఉండగా ఆదివారం జిల్లా పరిషత్ సమావేశంలో జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ఆర్డీఓ అవినీతిపై సాక్ష్యదారాలతో మంత్రులు సోమిరెడ్డి, ఆదికి అందించారు. దీనిపై మంత్రి సోమిరెడ్డి స్పందిస్తు ఆర్డీఓపై సమ్రగ విచారణ చేయాలని ఆదేశించారు. జెసి 2 శివారెడ్డి కూడా ఆర్డీఓ వినాయకం అవినితికి పాల్పడినట్లు నిర్ధారించారు. దీంతో ప్రభుత్వానికి సరెండర్ చేశారు.

గుడ్‌హార్ట్ ఫౌండేషన్‌లో పసిబిడ్డ!

కడప,జూలై 23: అనాథ గుర్తుతెలియని పసిబిడ్డలను పర్యవేక్షించాల్సిన స్ర్తి శిశుసంక్షేమశాఖ ఉన్నా ఆ శాఖకు తెలియకుండా ఒక గుర్తుతెలియని పసిబిడ్డ గుడ్‌హార్ట్ ఫౌండేషన్‌లోని ఎవరు తెచ్చారని అనుమానుస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అటువంటి శిశువులను ప్రభుత్వ నిర్వహణలోనే స్ర్తి శిశుసంక్షేమశాఖనే గుర్తుతెలియని అనాథ పసి చిన్నారులను సంరక్షించాల్సివుంది. ప్రస్తుతం గుడ్‌హార్ట్ ఫౌండేషన్‌లో ఉన్న శిశువును ఇటీవల స్ర్తిశిశుసంక్షేమశాఖ అధికారులు తీసుకెళ్లి తిరిగి గుడ్‌హార్ట్ ఫౌండేషన్ సంస్థకు తీసుకొచ్చి అప్పగించారు. ఈ స్వచ్ఛంధ సంస్థ, స్ర్తిశిశుసంక్షేమశాఖ మద్య ఈశిశువుకోసం వారి మద్య వార్ కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వృద్ధులకు, వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తామని, నైట్‌హాల్ట్ కేంద్రంగా నిర్వహిస్తున్న గుడ్‌హార్ట్ ఫౌండేషన్ సంస్థ పై వస్తున్న ఆరోపణలు, అక్రమాలు, నిర్లక్ష్యంకు అందరూ బాధ్యులేనని చెప్పవచ్చు. ఆ సంస్థ స్వచ్చంధ, ప్రైవేట్ సంస్థ అని తెలిసికూడా ప్రభుత్వ అధికారులు ఏకంగా ప్రభుత్వ కార్యాలయాలు గతంలో నెలకొల్పిన ప్రభుత్వ భవనాలు పాత రిమ్స్‌లో ఉండగా పాతరిమ్స్‌లోనే దర్జాగా గుడ్‌హార్ట్ ఫౌండేషన్‌కు భవన సౌకర్యం కల్పించింది ఎవరు అనే ప్రశ్నలొస్తున్నాయి. గుడ్‌హార్ట్ ఫౌండేషన్ భవనంలోనే ఒక పక్క జాతీయ ఉపాధిహామీ పథకం నిర్వహణలో పట్టణ నిరాశ్రయులకు సెంటర్, మరోపక్క మెప్మాసెంటర్ నెల కొల్పారు. ఒక స్వచ్చంధ సంస్థ నెలకొల్పిన భవనంలో రెండు ప్రభుత్వశాఖల మధ్యన నిరాశ్రయులకు ఏ విధంగా ఆశ్రమం నెలకొల్పారో ఎవరికీ అంతుపట్టడం లేదు... ఇదిలా ఉండగా ఇక అనాథ వృద్ధులు, నిరాశ్రయానికి గురైన వృద్ధులు, ఆలనాపాలనా తాము చూస్తామని స్వచ్ఛంధ సంస్థలు రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల నుంచి లక్షలాది రూపాయలు నిధులు తెప్పించుకుని భోం చేస్తున్నారు తప్ప ఆ వృద్ధులు పస్తులతో అలమటిస్తూ నిర్వాహకులు వారిని శారీరకంగా మానసికంగా హింసిస్తుంటే నగరంలో నడిబొడ్డున ఉన్న ఈ అనాథ వృద్ధుల గురించి పట్టించుకునే నాధుడు కరవయ్యారా అన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఆదాయవనరులున్న ప్రాంతాలకే అధికారులు పరిమితం అవుతున్నారు తప్ప మానవత్వంతో, దాతృత్వంతో ఎంతమంది అధికారులు పనిచేస్తున్నారనేది గుడ్‌హార్ట్ ఫౌండేషన్‌లోని వృద్ధులు వారి ఆకలి కేకలు, ఆర్తనాదాలు అధికారుల పనితీరుకు అర్థం పడుతోంది. ఇకపోతే సంబంధిత అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదులు అందినా బుట్టదాఖలు చేయడంతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చివరి ప్రయత్నంలో భాగంగా జిల్లా జడ్జికి ఫోన్ చేశారు. నిత్యం వివిధ కేసులతో జిల్లా వ్యాప్తంగా బిజీగా ఉంటున్న జి.శ్రీనివాస్ ఫోన్‌కాల్‌కు ఛలించి అధికారులను వెంటపెట్టుకుని తనిఖీ చేయగా అధికారులంతా ఏమీ తెలియనట్లుగా వ్యవహరించడం, జడ్జి అన్ని తానై వారికి భోజనం కల్పించి, వారిని స్వయంగా మోసుకొచ్చి ఆసుపత్రికి పంపారు. పలువురు వృద్ధులకు జడ్జి అన్నం తిన్పించి మాతృత్వానికి మార్గదర్శిగా జిల్లా జడ్జి నిలవడంపై ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. అధికారులు, వారి పనితీరుపై యావత్ జిల్లా ప్రజలు ఛీదరించుకుంటున్నారు. కలెక్టర్ బాబూరావునాయుడు ఇటీవల చార్జ్ తీసుకుని అధికారులందర్నీ విధి నిర్వహణలో పరుగులు తీయిస్తున్నా ఆ పరుగులలో గుడ్‌హార్ట్ ఫౌండేషన్ సంస్థ కన్పించలేదా అని ప్రశ్నలు ఎదురౌతున్నాయి. మెప్మా, డ్వామా, స్ర్తిశిశుసంక్షేమశాఖలకు చెందిన భవనాలలో ఈ గుడ్‌హార్ట్ ఫౌండేషన్ ఉండగా ఈ మూడు శాఖల అధికారులు కూడా నిద్రమత్తులో ఉన్నట్లేనా. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మొద్దునిద్ర నుంచి మేలుకుని ఈ తరహాలోని అనాథలను ఆదుకుని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

జడ్పి నిధులు లేక ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాం

కడప,జూలై 23: జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు ఎటువంటి నిధులు రావడం లేదని 13వ, 14వ ఫైనాన్స్ నిధులు కేటాయించినా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదని మూడేళ్లుగా జడ్పిటిసిలు, ఎంపిటిసిలు సంబంధిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులపై మాట్లాడాలన్న అవకాశాలు లేకుండా తాము ఉత్సవ విగ్రహాలుగా ఉన్నామని జడ్పి చైర్మన్ గూడూరు రవి, జడ్పిటిసిలు ఏకరవుపెట్టారు. ఆదివారం జడ్పి సమావేశ మందిరంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన జడ్పి చైర్మన్, సమావేశానికి హాజరైన జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి సోమిరెడ్డి జోక్యం చేసుకుని నిధుల విడుదలకు సహకరిస్తామని సభ్యులు కోరినమేరకు ఉపాధిహామీ నిధులు, నీరు-మీరు చెట్టు నిధులు కూడా విడుదలకు ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మరుగుదొడ్ల విషయంలో వైసిపి ఎమ్మెల్యేలు జి.శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తదితరులు మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అధికారులు చెబుతుంటే లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మించుకున్నా ఇంతవరకు బిల్లులు చెల్లించడం లేదని లబ్ధిదారులను కార్యాలయాల చుట్టు అధికారులు తిప్పుకుంటున్నారని అధికారులు ఏమో నిధులు కొరతలేదని స్వచ్ఛ భారత్ కింద కావాల్సినన్ని నిధులు ఉన్నాయని ప్రకటనలకే పరిమితవౌతున్నారని వారు ఆరోపించారు. జెసి శే్వత స్పందిస్తూ నాలుగురోజుల్లో సర్వే నిర్వహించి మరుగుదొడ్లు లేని ఇండ్లను గుర్తించి, అదేవిధంగా మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి బిల్లులు చెల్లించే ఏర్పాటు చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. జడ్పిటిసిలకు 60నిమిషాలు, ఎమ్మెల్యేలకు 30 నుంచి 40నిమిషాలు సమావేశంలో మాట్లాడేందుకు సమయం కేటాయించాలని తమ ప్రాంతాల్లో సమస్యలపై చర్చించుకునేందుకు అనువుగా ఉంటుందని, జవాబుదారిగా ఉంటుందని ఎమ్మెల్యేలు, జెడ్పిటిసిలు డిమాండ్ చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి జోక్యం చేసుకుని ఇక నుంచి ప్రతి రెండునెలలకు ఒక పర్యాయం పని దినాల్లో సమావేశాలు నిర్వహించాలని అందరికీ సమయం కేటాయిస్తామని, తాను జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డిలు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ వ్యవసాయరంగంలో భాగంగా మైక్రో ఇరిగేషన్, బిందు,తుంపర సేద్యం, మైకనైజేషన్‌కు అధిక నిధులు కేటాయించి రైతులకు ఎక్కువ అభివృద్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇక ఇన్‌ఫుట్ సబ్సిడీ, క్రాఫ్ట్ ఇన్సురెన్స్ వ్యవసాయవాఖ జెడి ఠాగూర్ నాయక్ సమాధానం ఇవ్వాలని మంత్రి సోమిరెడ్డి కోరగా జిల్లాకు రూ.43కోట్లు ఇన్సురెన్స్ వచ్చిందని, రూ.33కోట్లు రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. అజెండా మేరకు డ్వామా, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్టీసీ శాఖలతో సంబంధిత పథకాలు సమీక్షించారు. వైద్యశాఖలో 19మంది వైద్యాధికారుల పోస్టులు భర్తీ చేస్తామని సోమిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా మంత్రి సి.ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేదని జిల్లా అభివృద్ధిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొస్తామన్నారు. ఎమ్మెల్యే కత్తినరసింహారెడ్డి మాట్లాడుతూ 2015-16, 2016-17 పిఎఫ్ ఖాతాల్లో జడ్పి ఉద్యోగులు, ఉపాధ్యాయుల అకౌంట్ షిప్‌లు కానీ లోన్లుకానీ ఇవ్వడంలేదని ప్రశ్నించారు. జడ్పి సిఇఓ ఖాదర్‌బాషా జోక్యం చేసుకుని వెంటనే ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో కలెక్టర్ టి.బాబూరావు, విప్ మేడా మల్లికార్జునరెడ్డి, రాష్టప్రౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రమణారెడ్డి, ఎమ్మెల్యేలు జయరాములు, ఎస్.రఘురామిరెడ్డి, కె.శ్రీనివాసులు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.

ఆధునీకరణ పనుల్లో ముందడుగు పడేనా.!

మైలవరం, జూలై 23: మైలవరం జలాశయ కాలువల ఆధునీకరణ పనులు ముందడుగు పడేందులకు అధికారులు చర్యలకు ఉపక్రిమించారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలన్న ఆశయంతో 2006లో అప్పటి వైయస్‌ఆర్ ప్రభుత్వం దాదాపు రూ.155 కోట్లతో కాలువల ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. 2006 మే 18న చేపట్టిన పనులను 2018 మే 18నాటికి పూర్తిచేసేందుకు గుత్తేదారులతో ఒప్పందం జరిగింది. పనుల్లో భాగంగా 90, 91వ ప్యాకేజిల క్రింద ఉత్తర కాలువ, దాని ఉప కాలువలు, దక్షిణ కాలువ, దాని ఉపకాలువలను, జలాశయం వద్ద కొన్ని పనులను చేపట్టారు. ఉత్తర కాలువలో 98శాతం పనులు పూర్తి చేయగా అప్పటి జిల్లా కలెక్టర్ క్రిష్ణబాబు పనుల్లో నాణ్యత లేకపోవడంతో 30 వేల స్కేర్ మీటర్లు తొలగించి తిరిగి వేయాలని ఆదేశించారు. వీటిలో ఇప్పటికీ కేవలం 2700 స్క్వేర్ మీటర్లు మాత్రమే పనులు చేసి వదిలేశారు. అలాగే దక్షిణ కాలువ పనుల్లో ఇప్పటికీ 65 శాతం పనులు మాత్రమే పూర్తి చేసి వదిలేశారు. దీనికై రూ.47కోట్లు గుత్తేదారుకు వెచ్చించారు. గుత్తేదారుల స్వార్థం, అధికార యంత్రాంగం ఉదాశీనత వెరసి ఆధునీకరణ పనుల పాలిటి అశనిపాతంలా మారింది. పనులు చేపట్టి 11 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో మైలవరం జలాశయ అధికారులు ఆధునీకరణ పనుల విషయంపై చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి మాసంలో గుత్తేదారులపై చర్యలకు, తదుపరి పనులకై ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపారు.
* పనుల పూర్తికై చర్యలు
- సుధాకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు
ఆధునీకరణ పనుల్లో ఉత్తర కాలువ గుత్తేదారు బ్యాంకు గ్యారెంటీలను రూ.3.40కోట్లు ప్రభుత్వ ఖజానా జమ చేసుకోవడం జరిగింది. మిగిలిన 2శాతం పనులు, తొలగించిన ప్యానెల్ల పనులను చేయడానికి నివేదికలు పంపాము. అలాగే దక్షిణ కాలువ క్రింద పనులు నిలిపివేసిన వైనంపై గుత్తేదారు ఒప్పందంను రద్దుకు సిఫారసు చేస్తూ, మిగిలిన 35 శాతం పనులను చేయడానికి నివేదికలను ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతాము.

ముఖ్యమంత్రిని కలిసిన టిడిపి నేతలు

కడప,జూలై 23: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆదివారం నంద్యాల నుంచి కడప విమానాశ్రయానికి చేరుకోగా మధ్యాహ్నం జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా మంత్రి సి.ఆదినారాయణరెడ్డి, విప్ మేడా మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర పౌరసంబంధాలశాఖ చైర్మన్ ఎం.లింగారెడ్డి, వాసు తదితర నేతలు కలిసిశారు. ఈ సందర్భంగా సిఎంను కలిసిన కలెక్టర్ టి.బాబూరావునాయుడు, ఎస్పీ అట్టాడ బాబూజీలు కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు, నేతలతో ముచ్చటించి జిల్లా పరిస్థితులపై తెలుసుకున్నారు. అలాగే పార్టీని బలోపేతం చేయడంతోపాటు సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు అందేలా చూడాలని ఆదేశించారు. ఖరీఫ్ పంట సాగు, వర్షాలు ఇతర అభివృద్ధి పథకాలపై మంత్రులు ఇరువురు పర్యవేక్షించి రైతులను అన్నివిధాల ఆదుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్లారు. నంద్యాలపర్యటన ముగించుకుని కడపకుచేరుకుని వెళ్లారు.

హ్యాపీ సండేకి ప్రజాదరణ

కడప,జూలై 23: రాష్ట్రప్రభుత్వం ఇటీవల అధికారులు, ప్రజలకు వారంరోజులు పనిభారం, వత్తిళ్లు ఉన్న వారికి ఉల్లాసం, సంతోషం కలిగించేందుకు ప్రవేశపెట్టిన హ్యాడీ సండే కార్యక్రమం కలెక్టర్ టి.బాబూరావునాయుడు నేతృత్వంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలు ఆకర్షణకు గురౌతున్నారు. ఆదివారం విడిదితో కలెక్టర్ బాబూరావునాయుడు, జెసి శే్వత, జిల్లా అధికారులు రాజీవ్ పార్కుకు చేరుకుని ఆటలపాటలతో అలరింపచేస్తున్నారు. ఉదయం వివిధశాఖల అధికారులతో కలెక్టర్, జెసి రాజీవ్‌పార్కుకు చేరడంతో ప్రముఖులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున నగరంలోని రాజీవ్ పార్కుకు క్యూ కట్టారు. పురుషులతో అధికారులు కలెక్టర్ నృత్యాలు చేయడంతోపాటు వివిధ ఆటల పోటీల్లో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ మహిళా అధికారులతో కలిసి నృత్యాలు చేస్తుండగా మహిళా అధికారులు, విద్యార్థినీలు, మహిళలు కలిసి నృత్యాల్లో భాగస్వాములయ్యారు. కడప నగరంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్న రాజీవ్‌పార్కుకు నిత్యం ఉదయం, సాయంత్రం వందలాది మంది వాకింగ్‌కు, వ్యాయామానికి వివిధ ఆటలకు రాకపోకలు కొనసాగిస్తుంటారు. కలెక్టర్ ఈమార్గానే్న ఎంచుకుని హ్యాపీ సండే కార్యక్రమం మొదలుపెట్టడంతో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు, అనధికారులు, ముఖ్యంగా విద్యాసంస్థల విద్యార్థులు తరలివస్తున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి ప్రత్యేకించి రాజీవ్‌పార్క్‌ను అత్యంత సుందరీకరణగా తీర్చిదిద్దారు. అంతేగాకుండా నగరంలోని పార్కులన్నింటినీ ఇప్పుడిప్పుడే అభివృద్ధిచేస్తున్నారు. గతంలో స్పోర్ట్స్ అధికారిగా పనిచేసిన రామచంద్రారెడ్డి కూడా ఆటలకు సంబంధించిన ఏర్పాట్లుకూడా చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం బిసి కార్పొరేషన్ ఇడిగా పనిచేస్తున్నారు. జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు , సిబ్బంది ఈకార్యక్రమానికి తరలిరావడం విజయవంతం కావడం, వృద్ధులు, మహిళలు కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.

బెల్టుషాపు నిర్వాహకుడి అరెస్టు
రాయచోటి, జూలై 23: పట్టణంలోని గాలివీడు మార్గంలోని పొదలపల్లె వద్ద బెల్టుషాపు నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జి.రామమోహన్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పాతరాయచోటికి చెందిన చింతకాయల సుబ్బారెడ్డి బెల్టుషాపు నిర్వహిస్తున్నాడని సమాచారం అందిందని, తమ సిబ్బందితో కలిసి పొదలపల్లె వద్ద దాడులు నిర్వహించగా అతని వద్ద ఏడు హెచ్‌డీ విస్కీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండుకు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
ముఖం చాటేసిన వరణుడు!

సుండుపల్లె, జూలై 23: 2017 ఖరీఫ్ సీజన్‌లో వరణుడు కరుణిచకపోవడంతో మళ్లీ మండలంలో కరవుఛాయలు కనిపిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో కరవు కొనసాగనుందా అని సుండుపల్లె మండల రైతులు ఆందోళనలో పడ్డారు. గతంలో వరుణుడు ముఖం చాటేయడంతో భారీగా రైతులు నష్టపోవడం జరిగింది. అయితే ఈ యేడాది కోటి ఆశలతో ఖరీఫ్‌కు సిద్ధమైన అన్నదాతలు వర్షాలు లేక లబోదిబోమంటున్నారు. చల్లని వాతావరణం మేఘావృతమైన ఆకాశంవైపు ఎదురుచూపులు మానలేదు. అంతలోనే భగ్గుమంటున్న ఎండలు, నేలకు చేరని చినుకుల వేదన రైతులకు మదనపెడుతోంది. కొంత మంది వేసిన వేరుశెనగ, వరి ఎండిపోనుందా అని సందిగ్ధంలో జీవనం సాగిస్తున్నారు. రైతులు దేశానికి వెనె్నముకలు అంటారు. అయితే వైపరీత్యాల వలన రైతులు రోజు రోజుకూ నిరాశ, నిస్పృహలతో ఉన్నారనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ యేడాది ఖరీఫ్ సాగు అనవచ్చును. సంవత్సరంలో వర్షాలు లేకపోవడంతో కొంత మంది వలసల బాట పడుతున్నట్లు సమాచారం. మండలంలో కుంటలు, చెరువులలో చుక్కనీరు కానరాదు. నీటివసతి(బోరు ఆధారం) ఉన్న చోట 51 హెక్టార్ల వరిని మండలంలో సాగు చేశారు. వర్షాన్ని నమ్ముకని పలువురు రైతులు వేరుశెనగ సాగు చేశారు. గత నాలుగు రోజుల నుండి వర్షం ఛాయలు కానరావడం లేదు. అడపా, దడపా వర్షాలు పడినా భారీ వర్షాల జాడ లేదు. ఈ వైపరీత్యాలతో సందిగ్ధంలో పడిన రైతులను ప్రభుత్వం భరోసా కల్పించాలని మండల రైతులు కోరుకుంటున్నారు.

ఆనందోత్సాహాలు వెల్లివెరిసే మాసం...శ్రావణ మాసం

కడప,(కల్చరల్)జూలై 23: శుభ కార్యక్రమాల మాసంగా భావించే శ్రావణ మాసం ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. ఈమాసం సోమవారంతో ప్రారంభం అవుతోంది. అలాగే ఈమాసం వ్రతాలు, పండుగలకు పేరెన్నికగన్న మాసం అని చెప్పవచ్చు. ఈ మాసంలో మహిళ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో దేవాలయాలు, గృహాలు కళకళలాడుతాయి. ఈ మాసంలోని నాలుగు శనివారాలు అత్యంత పవిత్రమైనవిగా భావించి భక్తులు విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది శ్రావణమాసం 24న ప్రారంభమై ఆగస్టు 19వ చివరివారంతో ముగుస్తుంది. అలాగే ఈమాసంలో నాలుగు శనివారాలు రాగా నాలుగు శుక్రవారాలు వచ్చాయి. వీటిలో శుక్రవారాల్లో వ్రతాలు చేసుకుంటారు. ప్రధానంగా ఆగస్టు 4వ తేదీన ‘శ్రీవరలక్ష్మీవ్రతం’ నిర్వహిస్తారు. ఈవ్రతాన్ని మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ రోజు వ్రతం చేస్తే శుభప్రదమని, తమ కుటుంబమంతా ఆయురారోగ్యాలు, సకల సంపదలతో విలసిల్లుతుందని భక్తుల విశ్వాసం. ఈ మాసంలోని ఏ శుక్రవారమైనా వ్రతాలు చేసుకోవచ్చునని పండితులు చెబుతున్నారు. అలాగే శ్రావణమాసం కేవలం వైష్ణవులకు మాత్రమే పరిమితమని అనుకుంటారు. నిజానికి ఈమాసంలో నాలుగు సోమవారాలు కూడా విశిష్టమైనవిగా భావించి శివాలయాల్లో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇది శివకేశవుల అభేదాన్ని తెలుపుతోంది. ఈ మాసం ఏదైనా మంగళవారంలో శ్రీపార్వతీమాతను శ్రీగౌరిగా అలంకరించి ‘మంగళగౌరి’ వ్రతం నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రావణపౌర్ణమి నాడు శ్రీగాయత్రిదేవికి వ్రతం చేసి ఆరాధిస్తారు. మంగళగౌరి వ్రతం సందర్భంగా నోములు నోచుకుంటారు. అలాగే శ్రావణ సోమవారాల్లో కూడా నోములు నిర్వహిస్తారు.