ఫోకస్

అందుబాటులో ఉండాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజల ప్రాథమిక సమాచారం విషయంలో గోప్యత అవసరం లేదు. దేశ భద్రత దృష్ట్యా ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉన్నప్పుడే మనం ఏ నేరాన్నైనా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగ పరంగా వ్యక్తిగత సమాచారం బయటపెట్టకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పిస్తూనే ప్రాథమిక సమాచారం ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలి. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకాలు అమలు చేస్తున్నా అవి ఆధార్ ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నారు. అలాగాకుండా ఏ ఆధారం, ఏ సమాచారం తెలియకపోతే ఎలా నిర్ధారించగలం? అంతేగాకుండా కేంద్రం నల్లధనాన్ని అరికట్టేందుకు ఆధార్‌ను బ్యాంకు ఖాతాలకు లింక్ చేసింది. దీనివల్ల ఎవరైనా పన్నులు ఎగగొట్టడానికి ఆస్కారం లేకుండా పకడ్బందీగా వ్యవహరిస్తోంది. అయితే ఆధార్ లింక్ చేయడంవల్ల కేవలం ప్రాథమిక సమాచారంతోపాటు వారి వ్యక్తిగత సమాచారం కూడా బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం ప్రాథమిక సమాచారం వరకు మాత్రమే సేకరించి వారి వ్యక్తిగత పరువు, ప్రతిష్టలకు సంబంధించిన సమాచారానికి భంగం వాటిల్లకుండా తగు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇటీవల కొన్ని వెబ్‌సైట్లలో వ్యక్తిగత సమాచారం అందుబాటులోకి రావడం ఆందోళన కలిగించే అంశమే. ప్రజాభద్రతకు, వారి వ్యక్తిగత పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా ఉండేలా ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తిగత సమాచారం విషయంలో గోప్యత అవసరం. అంతేగాని ప్రజలందరి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయరాదు. కాల్‌డేటా వంటివి కూడా కొన్నిసార్లు బహిర్గతం కావడంవల్ల అనేక మంది ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ప్రధానంగా దేశ భద్రత, సామాజిక భద్రతను దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో కొందరు టెక్నాలజీ అందుబాటులో ఉందని అన్ని రకాల సమాచారాలు గోప్యత లేకుండా బహిర్గతం చేస్తే దానివల్ల అనేక అనర్థాలు కలిగే ప్రమాదం ఉంది.

- మీసాల గీత శాసనసభా కమిటీ చైర్మన్ ఉమెన్ అండ్ చైల్డ్ డిజేబుల్డ్ వెల్ఫేర్