చిత్తూరు

జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. గురువారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మంత్రి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈసందర్భంగా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రాజెక్టు పనుల్లో అలస్యం జరిగితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. హంద్రీ -నీవాతో పాటు ఆడవిపల్లి రిజర్వాయర్ పనులు మరింత వేగవంతం కావాలని, తరుచూ అధికారులు కాంట్రాక్టర్లు సమావేశమై ఈపనులు వేగవంతానికి కృషి చేయాలని చెప్పారు. పనులు మంజూరు ముఖ్యం కాదని అవి త్వరగా పూర్తి కావడమే ముఖ్యమన్నారు, అడివిపల్లి రిజర్వాయర్ రివిట్‌మెంట్ పనుల వచ్చే నెల 15 నాటికి పూర్తికావాలని అదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువయ్యే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. నేడు ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తూన్నా అవి సక్రమంగా ప్రజల్లోకి వెల్లడం లేదని, దీని వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. కావున అధికారుల ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సక్రమంగా అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇరిగేషన్ పనుల విషయంగా జన్మభూమి కమిటీలు అలస్యం చేస్తే అక్కడ గ్రూప్ టెంటర్లు పిలిచి పనుల చేపట్టాలని తెలిపారు. చెక్ డ్యామ్‌లు పనుల త్వరగా పూర్తి అయితే ఈ వర్షా కాలంలో కొంత ప్రయోజనం ఉంటుందన్నారు. నీరు- ప్రగతి పనుల్లో ఏమైనా సమస్యలుంటు తన దృష్టికి తీసుకు రావాలని , పంట సంజీవిని కింద నియోజక వర్గాల వారిగా ప్రగతి నివేదికలను తనకు ఇవ్వాలని డ్వామా పిడిని అదేశించారు. ముఖ్యమంత్రి హామీలకు సంబంధించి జాబితాను అందజేస్తే ఆ పనులు పరిష్కారానికి చొరవ తీసుకోవడం జరుగుతుందన్నారు. ఓడిఎఫ్ బిల్లులను పెండింగ్‌లో పెట్టుకోకుండా వెంటనే మంజూరు చేయాలన్నారు. జిల్లా మంత్రి అమరనాథ రెడ్డి మాట్లాడుతూ నీరు- ప్రగతి పనుల పెండింగ్ బిల్లులుంటే త్వరితగతిన చెల్లించాలన్నారు. సి సి రోడ్ల పనులకు చెందిన బిల్లు చెల్లింపులో ఆలస్యం అవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వెంటనే ఈ బిల్లులు చెల్లించే విధంగా అధికారులు చర్యలుతీసుకోవాలని చెప్పారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం లక్ష్యాలకు మించి పని చేస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం పంటసంజీవిని 50 వేలు లక్ష్యంగా నిర్ణయించిందన్నారు. సిసిరోడ్లు 350 కిలో మీటర్లుకు గాను వెయ్యి కిలో మీటర్ల నిర్దేశించిన పనులు చేస్తున్నట్లు మంత్రులకు వివరించారు. వచ్చె నెల 15 నాటికి అడివిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈసందర్భంగా జిల్లా ఇన్ చార్జి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పంట సంజీవిని పనలు వేగవంతం చేయాలని , సిసి రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం 660 కోట్లను మంజూరు చేసిందని, కావున ఈపనుల వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. పనులుపరంగా బకాయలుంటే వాటి వివరాలను ప్రభుత్వానికి పంపితే వాటిని క్లియర్ చేయడం జరుగుతుందన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ చిత్తూరులో చెరువుల అసుసంధానం పనులను చేపట్టాలని, నీవానది ఆక్రమణలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మంత్రి వెంటనే ఈ పనులు చేపట్టాలని ఆదేశించారు. చిత్తూరు రోడ్ల వెడల్పు అభివృద్ధికి చెందిన మాస్టర్ ప్లాన్ పనులపై కలెక్టర్ స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి ప్రతిపాదనలు తక్షణమే పంపాలని కమిషనర్‌ను సూచించారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో హెచ్ ఎస్ ఎస్ ఎస్ పనులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని , ఈపనులు ఆలస్యం కావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తున్నదన్నారు. ఎమ్మెల్సీ రాజసింహులు మాట్లాడుతూ పూతలపట్టు మండలం పంటపల్లిలో ప్రాథమిక పాఠశాలలో 13 మంది విద్యార్థులున్నారని ఆ పాఠశాల మూతపడకుంగా చూడాలని మంత్రులు దృష్టికి తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితిలో ఆపాఠశాల మూత పడదని మంత్రి హామీ ఇచ్చారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఆసుపత్రి వద్ద ఉన్న మార్కెట్ ను వెంటనే మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాంతం రద్దీగా ఉంటున్న నేపథ్యంలో అంబులెన్స్ వాహనాలు వెల్లడం కూడా చాల కష్టంగా ఉందన్నారు. దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. తుడా చైర్మన్ నరసింహ యాదవ్ బిసి భవన్ నిర్మాణానికి నిథులు కేటాయించలని మంత్రులకు విన్నవించారు. ఈ సమావేశంలో జడ్పి చైర్ పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ , చిత్తూరు ఎంపి శివప్రసాద్, ఎమ్మెల్యే శంకర్ , సుగుణమ్మ జెసి గిరిషా ఇతర అధికారులు పాల్గొన్నారు.