ఫోకస్

ఎందుకీ (డి)టెన్షన్..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో ప్రమాణాలు లేని చదువులతో నిరుద్యోగులను తయారుచేస్తున్నారనేది ప్రపంచ బ్యాంకు నివేదిక. పలు సర్వేల్లో భారతీయ విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారుకావడం లేదని, వారిలో నైపుణ్యం సరిపడా ఉండటం లేదని తేటతెల్లం చేశాయి. కేవలం 4 నుండి 6 శాతం మంది మాత్రమే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు నేరుగా ఉద్యోగాలకు అర్హులవుతున్నారనే అంశం మరింత దిగ్భ్రాంతికరం. ఈ పరిస్థితుల్లో చదువుల ప్రమాణాలను పెంచాలా? వద్దా ఇందుకు ఎలాంటి మార్గాలను అనే్వషించాలనే చర్చ విస్తృతంగా జరిగినపుడు పాఠ్య ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలతోపాటు సెమిస్టర్ విధానం అమలులోకి వచ్చింది. మరోపక్క ప్రాథమిక స్థాయిలోనే సరైన పునాదులు పడాలనే డిటెన్షన్ విధానంపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ దృష్టి సారించింది. అయితే కేంద్రం నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇటు ఉపాధ్యాయ, బాలల హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలతోపాటు తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నాయి. రాష్ట్రాలు నిరాకరిస్తున్నా, కేంద్రం ఒప్పుకుంటుందా? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పాటు అన్ని సంఘాలు తమకు డిటెన్షన్ విధానం వద్దు అంటూ పొరుబాట పడుతున్నాయి. ఈ విధానం వల్ల నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందన్న గ్యారంటీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. డిటెన్షన్ విధానంతో అక్షరాస్యతా శాతం గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి దేశంలో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం విద్యా హక్కు చట్టం-2009ను సెక్షన్ -16ను సవరించడానికి అన్ని రాష్ట్రాలూ అంగీకరించాయి. ప్రస్తుత విద్యాహక్కు చట్టం ప్రకారం 1వ తరగతి నుండి 10వ తరగతి వరకూ విద్యార్థులు ఉత్తీర్ణులు కాకపోయినా వారిని పైతరగతులకు పంపించాల్సి ఉంటుంది. డిటెన్షన్ విధానం అమలులోకి వస్తే 5వ తరగతిలో ఒక సారి, 8వ తరగతిలో మరోమారు పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు ఫెయిల్ అయితే వారు అదే తరగతిలో కొనసాగాల్సి ఉంటుంది. డిటెన్షన్ లేకపోవడం వల్ల విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతోంది. తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలనే నిబంధన లేకపోవడం వల్ల విద్యార్థుల్లో అభ్యసనా నైపుణ్యం, వికాసం, అభివృద్ధి తగ్గిపోతోందని పార్లమెంటు స్థాయా సంఘం చెబుతోంది. ఇప్పటికే డిటెన్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ జరిపింది. విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను సవరించాల్సిందే తప్ప, ఆ పేరుతో డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి వ్యవస్థ వైఫల్యాలను పిల్లల వైఫల్యంగా చిత్రీకరించడం సరికాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. డిటెన్షన్ విధానాన్ని బలవంతంగా అమలుచేయడం అంటే రాజ్యాంగ మూలసూత్రాలైన బహుళత్వం, సమన్యాయం, సమానత్వానికి తూట్లు పొడవడమేననేది సుస్పష్టం. విద్యార్ధులు అదే తరగతిలో కొనసాగించడం ద్వారా విద్యా ప్రమాణాలు పెరిగినట్టు ఏ సర్వే చెప్పలేదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం నాన్ డిటెన్షన్ విధానం అమలు చేయడం ద్వారానే విద్యా ప్రమాణాలను, సంపూర్ణ అక్షరాస్యతను సాధించుకుంటున్నాయి. ఈ క్రమంలో డిటెన్షన్ విధానంపై ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.