చిత్తూరు

చిత్తూరులో భారీ అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చిత్తూరు నగరంలోని చర్చి వీధిలోఉన్న అపూర్వ టెక్స్‌టైల్స్‌లో గురువారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంతో నగర వాసులు తీవ్ర భయాందోళనకు లోనైయ్యారు.అగ్నిమాపక సిబ్బంది శతవిధాలా ప్రయత్నించినా మంటలు అదుపుకాకాలేదు. ఈ మంటలు ఎటు వ్యాపిస్తాయోనని చర్చివీధిలోని వ్యాపారస్తులు, గృహస్థులు తీవ్ర భయాందోళను లోనైయ్యారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం 1గంట వరకు మూడు ఫైరింజన్‌లతో నిరంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను నియంత్రిస్తూనే ఉన్నారు. ఎంతకీ మంటలు అదుపుకాలేదు. ఈప్రధాన వీధి ఇరుకుగా ఉండడంతోపాటు అగ్నిప్రమాదం చోటుచేసుకున్న వస్తద్రుకాణం చుట్టూ ఇండ్లు, దుకాణాలు నెలకొన్నాయి. అందువల్ల మంటలు అదుపుచేయడం కష్టసాధ్యమైంది. దీనితో నగరంలో విద్యుత్ సరఫరాను నిలిపి వేయడంతోపాటు కార్పొరేషన్ అధికార యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వస్త్ర దుకాణంలో సిల్క్ దుస్తులతోపాటు పాలీథిన్ కవర్లు ఎక్కువుగా ఉండడంతో మంటలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. మూడు ఫైరింజన్లతో శ్రమిస్తే శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు కొంత వరకు మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే చుట్టుపక్కల దుకాణాలకు, ఇండ్లకు మంటలు వ్యాపించకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టడంతో కొంత వరకు నష్టాన్ని నివారించారు. అయితే నిరంతరం జనం రద్దీతో, కొనుగోలు దారులతో నిత్యం కిటకిటలాడే ఈ వస్తద్రుకాణంలో భారీ అగ్నిప్రమాదం రాత్రి వేళ చోటుచేసుకోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు చర్చి వీధిలో పొగలు వ్యాపిస్తునే ఉన్నాయి. ఈ ఘటనలో ఈ షాపు భవనాలు పూర్తిగా దెబ్బతినడంతో ముందస్తు చర్యగా కార్పొరేషన్ అధికారులు కూల్చి వేశారు. ఈఘటనలో సుమారు ఐదు కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. ఈ ఘటనతో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేసి సహాయక చర్యలను కార్పొరేషన్ అధికారులు ముమ్మరం చేశారు. ఫైరింజన్లకు కార్పొరేషన్‌కు చెందిన నీటి ట్యాంకుల ద్వారా నిరంతరం నీటిని అందించారు. కార్పొరేషన్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, నగర మేయర్ హేమలత, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, జిల్లా టిడిపి అధ్యక్షుడు నాని, పలువురు నగర వాసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చర్చివీధిలోని అన్ని దుకాణాలను మూసి వేయించడంతోపాటు ట్రాఫిక్‌ను పూర్తిగా నియంత్రించారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఓ చిన్న దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తాజాగా ఈ భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఈ సంఘటనా స్థలాన్ని కలెక్టర్ ప్రద్యుమ్న, జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు పరిశీలించారు.
అగ్ని ప్రమాదంపై ఆరా తీసిన కలెక్టర్ : సహాయక చర్యలను పర్యవేక్షించిన ఎస్పీ
చిత్తూరు నగరంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో చోటు చేసుకొన్న అగ్నిప్రమాద సంఘటపై జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆరా తీసారు. స్థానిక చర్చి వీధిలోని అపూర్వ టెక్స్ టైల్స్ గురువారం అర్ధరాత్రి అగ్నికి ఆహుతి అయ్యిన సంగతి తెలిసిందే, ఈనేపథ్యంలో శుక్రవారం ఉదయం కలెక్టర్ ప్రద్యుమ్న సంఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక అధికారుల నుంచి వివరాలను ఆరా తీసారు. అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంను ఆదేశించారు. ఈసందర్భంగా పూల వ్యాపారస్తులు తమకు నష్టం వాటిల్లిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో దీన్ని పరిశీలిస్తామన్నారు. జిల్లా ఎస్పి రాజశేఖర్ బాబు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ సహాయ చర్యలను స్వయంగా పర్యక్షించారు.ట్రాఫిక్ నియంత్రించి, అదనపు బలగాలను రప్పించి సహాయ చర్యలను ముమ్మరం చేసారు. పలువురు డిఎస్పీలు సిఐలు సహాయక కార్యక్రమంలోపాలు పంచుకొన్నారు. నగర మేయర్ కఠారి హేమలత సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద విరాలను ఆరాతీసి, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక సిబ్బందికి సూచించారు. కార్పొరేషన్ సిబ్బంది మంటలను నియంత్రించే కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆదేశించారు.

పంద్రాగస్టు వేడుకలకు వరుణుడు కరుణించేనా?
* తిరుపతిలో భారీ వర్షం
* పట్టువదలని విక్రమార్కుడిలా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి: తిరుపతి పుణ్యక్షేత్రంలో పంద్రాగస్టు వేడుకలను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించిన విషయం పాఠకులకు విధితమే. గత రెండురోజులుగా తిరుపతిలో నెలకొన్న వర్షపు వాతవరణం చూస్తూంటే పంద్రాగస్టు వేడుకలకు వరుణుడు ఎక్కడ ఇబ్బందులు తీసుకొస్తాడోనన్న అనుమానాలు అధికారుల్లో పొడసూపుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటల వరకు ఆకాశం ప్రశాంతంగా ఉన్నప్పటికీ అటు తరువాత ఒక్కసారిగా మేఘావృతమైంది. తుంపర్లతో ప్రారంభమైన వర్షం క్షణాల్లో భారీగా కురిసింది. సుమారు 2 గంటల పాటు ఎడతెరపిలేకుండా కురిసిన వర్షంతో ఎస్వీయూ తారకరామా స్టేడియం తడిసి చెరువైంది. అప్పటి వరకు చేసిన ఏర్పాట్లన్నీ కూడా వర్షపునీటి మరుగున చేరాయి. మైదానం బురదమయమైంది. ఇక నగరంలో రోడ్లకు ఇరువైపులా, డివైడర్లకు వేసిన రంగులు వెలసిపోయాయి. ఇటు అధికారులుగానీ, అటు పనిచేస్తున్న కార్మికులు గానీ ఏ మాత్రం నిరుత్సాహానికి గురికాకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ఏర్పాట్లను యుద్దప్రాతిపదికన చేపడుతున్నారు. వాస్తవానికి శుక్రవారం నాటికి ఎస్వీయూ మైదానంలో పనులు పూర్తయిపోయి ఉండాల్సిన పరిస్థితి. వర్షం కారణంగా ఏర్పాట్లు పనులు మందగించాయి. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేస్తున్న జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఎస్వీయూలో ఏర్పాట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. రాత్రనక, పగలనక అధికారులను అడ్డుపెట్టుకొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం వర్షం పడుతున్న సమయంలో కూడా కలెక్టర్ ఎస్వీయూ స్టేడియంలోనే పనులను పర్యవేక్షిస్తున్నారు. వేడుకల సందర్భంగా కవాతులు నిర్వహించడానికి పోలీసులు ప్రాక్టీసు కూడా కొనసాగిస్తున్నారు. శనివారం నాటికి ఏర్పాట్లన్నీ పూర్తికావాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ అధికారులకు విస్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో నగర పాలక కమిషనర్ చేవూరి హరికిరణ్ నగరంలో సుడిగాలి పర్యటన చేస్తూ ఎక్కడ రంగులు వెలిసిపోయాయో ఆ ప్రాంతాన్ని గుర్తించి పనులు చేయిస్తున్నారు. పోలీసులు కవాతు చేసే ట్రాక్, కవాతును తిలకించడానికి సిఎం వాహనం వెళ్లే ట్రాక్ వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. శుక్రవారం వర్షం కాస్త తెరపివ్వగానే యుద్ద ప్రాతిపదికన ట్రాక్‌ను ఏర్పాటుచేశారు. అదృష్టవశాత్తూ శుక్రవారం వర్షం కురుస్తున్న సమయంలో ఈదురుగాలులు లేకపోవడంతో వేదిక నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. వేడుకలకు మరో 3రోజులు వ్యవధి ఉండటంతో వర్షం తీవ్రత పెరిగితే ఆహుతులు మైదానంలో కూర్చోవడం కూడా సాధ్యంకాని పరిస్థితిగా తయారయ్యే అవకాశాలు లేకపోలేదు. ఆగస్టు 15న కూడా వర్షం పడినప్పటికీ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను అధికారులు చేస్తున్నారు.

తిరుమలలో రద్దీ
* సర్వదర్శనానికి 14 గంటలు
* నేటి నుంచి మరింత పెరగనున్న భక్తుల రద్దీ
* హుండీ ఆదాయం రూ.2.38 కోట్లు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి: శ్రీవేంకటేశ్వరుని దర్శించుకోవడానికి శుక్రవారం వచ్చిన భక్తుల రద్దీతో తిరుమల కలకలలాడింది. ఈ సమయంలో స్వామివారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు స్లాట్‌లు ప్రకారం అధికారులు దర్శనం కల్పిస్తుండటంతో కొన్ని గంటల వ్యవధిలోనే దర్శించుకుంటున్నారు. భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు రూ. 2.38 కోట్లు టిటిడికి ఆదాయం లభించింది. ఉదయం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు 50817 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారాంతపు సెలవు దినాలు కలసిరానున్న నేపథ్యంలో మరో నాలుగు రోజుల పాటు తిరుమల భక్తులతో నిండిపోనుంది. రెండో శనివారం, ఆదివారం, సోమవారం గోకులాష్టమి, మంగళవారం పంద్రాగస్ట్ వరుస సెలవుదినాలు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. ఈ క్రమంలో అధికారులు కూడా తగిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. వరుస సెలవుదినాలు రావడంతో దూరప్రాంతాల్లోని విద్యార్థులు, ఉద్యోగులు, స్థానికంగా నివాసం ఉంటూ ఇతర ప్రాంతాల్లో ఉండే ఉద్యోగులు తిరుపతికి రావడానికి పోటెత్తుతున్నారు. ఈక్రమంలో రైళ్లల్లో బెర్తులు దొరకక, బస్సుల్లో సీట్లు దొరకక నానాతంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. శనివారం నుంచి ఆర్టీసీ బస్టాండ్‌లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏచిన్న అసౌకర్యం కలగకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

బసిరెడ్డిగారిపల్లెలో ఒకరు దారుణ హత్య
పీలేరు: మండల పరిధిలోని జాండ్ల గ్రామ పంచాయతీలోని బసిరెడ్డిగారిపల్లెలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పీలేరు అర్బన్ సిఐ నాగరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బసిరెడ్డిగారిపల్లి గ్రామానికి చెందిన రెడ్డినాయక్ (30) అదే గ్రామానికి చెందిన రెడ్డెమ్మను 2015వ సంవత్సరంలో హతమార్చాడు. అప్పట్లో స్థానిక పోలీసులు రెడ్డినాయక్‌ను అరెస్ట్‌చేసి జైలుకు పంపగా, బెయిలుపై విడుదలయ్యాడు. ఈ నేపధ్యంలో రెడ్డినాయక్‌ను రెడ్డెమ్మ బంధువులు రాజేంద్ర, బాలకృష్ణ, కిషోర్‌లు శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో అతి దారుణంగా హతమార్చడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన సిఐ నాగరాజు, ఎస్‌ఐ సుధాకర్ రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే హత్యకు గురైన రెడ్డినాయక్‌ను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

వర్షం వచ్చినా పంద్రాగస్ట్ వేడుకలు విజయవంతం చేస్తాం
* పాస్‌లు ఉంటేనే మైదానంలోకి అనుమతి
* 5500 మందినే అనుమతిస్తాం
* వేడుకల నిర్వహణకు 46 కమిటీలు ఏర్పాటు
* జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడి
తిరుపతి: వర్షం వచ్చినా పంద్రాగస్ట్ వేడుకలు ఎస్వీయూ తారకరామా క్రీడామైదానంలో ఎలాంటి ఆటంకం కలగకుండా విఐపిలు, సామాన్య ప్రజలు వర్షంలో తడవకుండా రెయన్ ప్రూఫ్ సిట్టింగ్ విధానం ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడించారు. అలాగే సాయుధ దళాలల మార్చ్ఫాస్ట్‌కు ఇబ్బంది ఎదురు కాకుండా తారు రోడ్డు కూడా వేయంచామన్నారు. శుక్రవారం ఆయన వేడుకల ఏర్పాట్లను తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 15న జరుగనున్న రాష్టస్థ్రాయి స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు పాస్‌లు ఉన్నవారినే అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. వేడుకల్లో పాల్గొనే వారికి డ్యూటీ పాస్‌లు, విద్యార్థులకు పాస్‌లకు ఇస్తున్నామని, అదే సమయంలో పాస్‌లు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతించడం జరుగుతుందన్నారు. గట్టి భద్రత మధ్య స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయని, స్టేడియంలో 5500 మంది మాత్రమే వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అదే సమయంలోప్రజలంతా ఈ వేడుకలను తిలకించడానికి వీలుగా నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ భవనాల వద్ద, కూడళ్లను ఈనెల 13 నుంచి 15 వరకు విద్యుత్ దీపాల వెలుగులతో ఉండాలని అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు, శకటాలకు వర్షం వల్ల ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వివిఐపిలు, విఐపిలకు ఈద్గామైదానంలో, యూనివర్శిటీ కాంపౌండ్‌లో కార్‌పార్కింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. పెరేడ్ గ్రౌండ్ వద్ద పారిశుద్ధ్యం, టాయ్‌లెట్స్ ఏర్పాటు బాధ్యతను మున్సిపాలిటికి అప్పగించామన్నారు. వివిధ కంపార్ట్‌మెంట్‌లలో పారామెడికల్ సిబ్బందిని, వాలంటీర్లను, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల ద్వారా సేవలు అందిస్తామన్నారు. ఇప్పటికే సివిల్ పనులు పూర్తయ్యాయని, శకటాలు తిరగడానికి వీలుగా బిటిరోడ్డు వేశామన్నారు. స్టేజ్ సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. వర్షం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా సామాన్యప్రజలు కూర్చున్న చోట రూఫ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో స్వాతంత్ర దినోత్సవ వేడకలు నిర్వహిస్తున్న సమయంలో వర్షం కురవడం శుభపరిణామమన్నారు. 14 శాఖల ఆధ్వర్యంలో వివిధ సంక్షేమ పథకాలపై శకటాలను ప్రదర్శిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇందుకోసం 46 కమిటీల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈకార్యక్రమంలో తిరుపతి సబ్ కలెక్టర్ నిషాంత్‌కుమార్, జాయింట్ కలెక్టర్ -2 చంద్రవౌళి, ట్రైనీ కలెక్టర్ కీర్తి, డిఆర్వో రజియాబేగం, డిఆర్‌డిఏ పిడి రవిప్రకాష్ రెడ్డి, డ్వామా పిడి కూర్మానంద, ఐసిడిఎస్ పిడి శ్రీలక్ష్మి, తుడా కార్యదర్శి మాధవీలత సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తులను పరిశీలించి ఓటరు నమోదు పూర్తి చేయండి
* పెండింగ్ అంశాలపై మూడు రోజుల్లోగా నివేదికలు పంపండి
* రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి: ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి కొత్త ఓటర్లను నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ జిల్లాకలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాదు నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఎన్నికల అజెండా అంశాలపై జరిగిన సమీక్షా సమావేశానికి తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మాట్లాడుతూ ఎన్నికల పటిష్ట నిర్వహణకై చేపట్టిన అజెండా అంశాలను భారత ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. ఈనెల 18, 19 తేదీల్లో న్యూఢిల్లీలో ఎన్నికల సిఇఓల సమీక్షా సమావేశం జరుగుతుందని తెలిపారు. అజెండాలోని 16 అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దీనిపై మూడు రోజుల్లోగా నివేదికలు పంపాలని స్పష్టం చేశారు. ప్రతి నియోజక వర్గంలో ఇఆర్‌ఓకు ఆధునిక సాంకేతిక హార్డ్‌వేర్ సిస్టమ్‌తోపాటు నైపుణ్యంగల సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులపై వేగవంతంగా చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎన్నికల అధికారులు, ఇఆర్‌ఓ, ఎఇఆర్వోలతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎపిక్‌కు, ఎలక్టరోల్ ఓటర్లజాబితా రిజిస్ట్రేషన్ సర్ట్ఫికేట్ తదితర ఎన్నికల నిర్వహణ ఖర్చుకు సంబంధించిన బిల్లులు సర్దుబాటు చేయాలన్నారు. చనిపోయినవారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలన్నారు. సైనిక ఉద్యోగుల సర్వీసు ఓటర్లపై సేకరించిన దరఖాస్తులను పరిశీలించి శనివారం మధ్యాహ్నం లోగా పూర్తిచేసి ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న స్పందిస్తూ తాము చేపట్టిన ఓటరు అవగాహన కార్యక్రమం ద్వారా అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయన్నారు. వాటి నమోదు కార్యక్రమం వేగంగా జరుగుతోందని తెలిపారు. జిల్లాలోని కళాశాలల్లో సెమినార్లు నిర్వహించి అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కీర్తి, డిఆర్వో రజియాబేగం, ఎస్.సుధాకర్, ఎస్.పద్మిణి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

అత్తను హతమార్చిన అల్లుడు
మదనపల్లె: కన్నబిడ్డను కళ్ళెదుటే అల్లుడు దారుణంగా దాడులతో చిత్రహింసలకు గురిచేస్తుండగా అడ్డుకోబోయిన అత్తను అతి దారుణంగా హతమార్చిన సంఘటన శుక్రవారం మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. మదనపల్లె రెండవ పట్టణ ఎస్‌ఐ నాగేశ్వర్‌రావుకథనం మేరకు మదనపల్లె పట్టణం పుంగనూరురోడ్డు ఈస్ట్‌కొత్తపేటకు చెందిన మునిరత్నం కుమారుడు లోకేష్, పట్టణంలోని మిషన్ కాంపౌండ్‌కు ఎదురుగా రామక్రిష్ణవీధిలో నివాసముంటున్న గోపాల్, సరోజమ్మల కుమార్తె గాయిత్రీని ఐదేళ్ళకితం ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. దంపతులిద్దరు ఈస్ట్‌కొత్తపేటలో వేరుగా కాపురం ఉంటున్నారు. లోకేష్ మినరల్‌వాటర్ క్యాన్ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. వీరికి రెండున్నరేళ్ళ కుమార్తె నిషిత సంతానం. దంపతులిద్దరి మధ్య చెలరేగిన వివాదంతో పలుమార్లు పంచాయతీ పెద్దల సమక్షంలో ఇరువురికి సర్ధిజెప్పారు. అయితే దంపతులిద్దరు రెండుమాసాల క్రితం రామక్రిష్ణవీధిలోకి కాపురం మార్చారు. భర్త తాగుడుకు బానిసై నిత్యం భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. శుక్రవారం ఉదయం భర్త లోకేష్ తన భార్య తలపట్టుకుని గోడకేసి కొడుతుండగా అదేవీధిలో ఉంటున్న సరోజమ్మ(60) అడ్డుపోయింది. దీంతో అల్లుడితో వాగ్వావాదం చేయడం, అంతలో అత్త తలపట్టుకుని నేలకేసి కొట్టి గొంతునులుపడంతో అత్త సరోజమ్మ సృహకోల్పోయి అపస్మారక స్థితిలో పడిపోయింది. దీంతో కుమార్తె హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరికి తరలించారు. గాయిత్రీ అన్న బాబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యకేసుగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

తిరుమల, తిరుపతిలో కుండపోత వర్షం
తిరుపతి: తిరుమల, తిరుపతిలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కుండపోత వర్షం కురిసింది. తిరుమలలో ఉదయం 9 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాదాపు రెండు గంటలపాటు ఎడతెరిపిలేకుండా వర్షం కురియడంతో భక్తుల అవస్థలు వర్ణనాతీతం. దీనికి తోడు చల్లటి గాలులు అందరినీ వణికించాయి, ఆలయం ముందు భాగం నీటితో కలకలలాడింది. శ్రీవారి దర్శనం చేసుకుని ఆలయం ముందుకు వచ్చిన భక్తులకు అక్కడి వాతావరణం ఆహ్లాదాన్నిపంచింది. తిరుపతిలో ఏకధాటిగా దాదాపు గంటన్నరపాటు కురిసిన వర్షానికి తిరుపతిలోని రోడ్లు జలమయమయ్యాయి. ఎటు చూసినా మురికి నీరు ప్రవహించడంతో భరించరాని దుర్గంధం వ్యాపించింది. దీంతో నగరపాలకసంస్థ అధికారులు పరుగులు తీశారు. 15న తిరుపతిలో రాష్టస్థ్రాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో తిరుపతికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపిలు పెద్ద ఎత్తున రానున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి ఆ రోజు ఏర్పడితే అనే విషయం తలుచుకుంటేనే అధికారులు అదిరిపడుతున్నారు. నగరంలోని పెద్ద మురినీటికాలువల్లో చెత్తను తొలగించే పనులను వేగవంతం చేశారు. ప్రధానంగా ప్రకాశం రోడ్డు, గాంధీరోడ్డు, మున్సిపల్ కార్యాలయం, బండ్ల వీధి, గాంధీ విగ్రహం, చేపల మార్కెట్, నంది సర్కిల్, పికే లే ఔట్ తదితర ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. రానున్న మరో రెండు మూడు రోజులు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా అధికారులు అంచనావేస్తుండటంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

రెండు ఆటోలు ఢీ.. ఇద్దరు దుర్మరణం
* ఐదుగురికి తీవ్ర గాయాలు
ములకలచెరువు: రెండు ఆటోలు ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు మండలంలోని సోంపల్లె పంచాయతీ, నగగుట్ట వద్ద తంబళ్ళపల్లె వైపువెళ్తున్న ఆటో, సంపల్లె వైపు వెళ్తున్న ఆటోలు శుక్రవారం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మండలంలోని సోంపల్లె పంచాయతీ, బత్తినవారిపల్లెకు చెందిన ఎ మల్లప్ప (38)లు, అదే పంచాయతీ, అడివినాయుని చెరువుపల్లెకు చెందిన చంద్ర కుమార్తె గౌతమి(18)లు దుర్మరణం చెందగా, ఆటోలో ప్రయాణీస్తున్న మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పవన్, రెడ్డిశేఖర్, విష్ణు, మహేంద్ర, మనోహర్ ఉన్నారు. వీరిని 108ద్వారా మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇసుక రవాణాలో అధిక చార్జీలు వసూలు చేస్తే కఠినచర్యలు
* జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరిక
తిరుపతి: ఉచిత ఇసుక రవాణాకు సంబంధించిన ప్రభుత్వం నిర్దేశించిన చార్జీలు కాకుండా ఎవరైనా వినియోగదారుల నుంచి అధిక రవాణా చార్జీలు వసూలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు. శుక్రవారం ఎస్వీయూ తారకరామా క్రీడామైదానంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించి అధికారులకు ప్రత్యేక ఆదేశాల జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఇసుక లోడింగ్ చార్జీలు మూడు క్యూబిక్ మీటర్లకు రూ. 350, రవాణా చార్జీలు 10 కిలోమీటర్ల వరకు ట్రాక్టర్‌కు రూ.600, 30 కిలోమీటర్ల వరకు రూ.900, 30కిలోమీటర్లు దాటితే ప్రతి కిలోమీటర్‌కు రూ. 30 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇసుక లోడింగ్, రవాణాచార్జీల అమలు, నియంత్రణ కోసం డివిజన్, మండల స్థాయిల్లోకమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మండల స్థాయి కమిటీల్లో తహశీల్దార్లు, ఎంపిడిఓలు, పోలీసు, రవాణాశాఖ, గనుల శాఖ, విజిలెన్స్ విభాగం అధికారులు అప్రమత్తమై వ్యవహరించాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.