సబ్ ఫీచర్

పండగలా ‘పతాక’ సన్నివేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందరో త్యాగధనుల పోరాటం ఫలితంగా మన దేశానికి విదీశీయుల పాలన నుంచి విముక్తి కలిగింది. దేశానికి స్వా తంత్య్రం సిద్ధించి ఇప్పటికి 70 వసంతాలు పూర్తయ్యాయి. నేడు జాతి యావత్తూ 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా- దేశానికి స్వాతంత్య్రం ఎలా వచ్చిందో మనం సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉం ది. 1947 ఫిబ్రవరి 20న నాటి బ్రిటిష్ ప్రధాని క్లెమెంటు అట్లీ, సమైక్య భారతదేశానికి లేదా చీలిపోదలుచుకుంటే భారత్,పాకిస్తాన్‌లకు సుమారు సంవత్సరం కాలం లోపుగా స్వాతంత్య్రాన్ని ఇవ్వదలచినట్టు బ్రిటిష్ కామన్స్ సభలో అధికారికంగా ప్రకటించాడు. ఆ సమయంలో భారతదేశానికి వైస్రాయ్‌గా వున్న లార్డ్ పావెల్ స్థానంలో ఎలిజిబెత్ రాణికి బంధువు, నెహ్రూకి స్నేహితుడు అయిన లార్డ్ లూరుూ వౌంట్‌బాటెన్‌ను నియమించారు. బ్రిటిష్ పాలకుల నిర్ణయం మేరకు నాలుగైదు నెలలలోనే భారత్‌కు స్వాతంత్య్రాన్ని ఇవ్వవచ్చని వౌంట్ బాటెన్ భావించాడు. సమైక్య దేశంగా వుండడానికి ముస్లిం లీగ్ నాయకులు ఒప్పుకోనందున, కాంగ్రెస్ నాయకులు దేశ విభజనకు బలవంతంగా అంగీకరించాల్సి వచ్చింది.
వౌంట్ బాటెన్ ఆగ్నేయాసియాలో మిత్రరాజ్యాల సర్వసేనానిగా వున్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యాలు 1945 ఆగస్టు 15న ఆయనకు లొంగిపోయాయి. కనుక ఆగస్టు 15, 1947 మరుపురాని రోజు అని బాటెన్ భావించాడు. అందువల్ల 1947 ఆగస్టు 15వ తేదీన భారత్, పాకిస్తాన్‌లకు స్వాతంత్య్రాన్ని ఇవ్వనున్నట్టు బాటెన్ ప్రకటించాడు. ఆరోజు మంచిరోజు కాదని, తేదీని మార్చాలని కొందరు జ్యోతిష శాస్తవ్రేత్తలు బాటెన్‌ను కోరారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్ మొదలైనవారు కూడా స్వాతంత్య్రం ఇచ్చే తేదీని మార్చాలని వాదించారట. హిందూ నాయకుల నమ్మకాల కోసం పాకిస్తాన్ నాయకులు తేదీని మార్చడానికి అంగీకరించలేదని అంటారు. మధ్యేమార్గంగా 1947 ఆగస్టు 14 తేదీ అర్ధరాత్రి రాజ్యాంగ పరిషత్తు ద్వారా ఇండియాకు అధికార ప్రదానం జరిగింది.
అదే సమయంలో వౌంట్ బాటెన్ పాకిస్తాన్‌కి స్వాతంత్య్రం ప్రదానం చేసి ఆగస్టు 15న ఉదయానికి తిరిగి వచ్చి భారత్ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అప్పటినుండి ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని జనగణమణను ఆలపిస్తాం. స్వాతంత్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినపుడు భక్త్భివంతో వందనం చేయడం ప్రతి భారతీయుడి కనీస కర్తవ్యం.

-కామిరెడ్డి సతీష్‌రెడ్డి