చిత్తూరు

బిసి బాలికల కళాశాల వసతిగృహంలో ఆకలికేకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె: కేజి నుంచి పిజి వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. మరోవైపు వెనుకబడిన బాలికల కాలేజి వసతిగృహంలో విద్యార్థినులు ఆదివారం పస్తులతో ఉండిపోయారు. వార్డెన్ అందుబాటులో లేకపోవడం, వంట మనుషుల ఇష్టారాజ్యంతో విద్యార్థినులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆదివారం ఉదయం ప్రతి విద్యార్థికి నాలుగు ఇడ్లీ, సాంబారు, చట్నీ మెనూగా ఇస్తారు. అయితే రెండు ఇడ్లీ, రుచిలేని నీళ్ల చట్నీ వడ్డించడంతో విద్యార్థినులు వంటమాస్టర్లపై తిరుగుబావుటా ఎగురవేశారు. దీంతో వంట మనుషులు ఆడపిల్లలపై తిట్ల పురాణం మొదలుపెట్టారు. దీంతో విద్యార్థినులు కన్నీరు పెట్టుకుంటూ వసతిగృహం నుంచి కూతవేటు దూరంలో ఉన్న సబ్‌కలెక్టర్ కార్యాలయంలో బైఠాయించారు. ఉదయం నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థినులు బైఠాయించడంపై వార్డెన్ గాని, వసతిగృహ సిబ్బంది గానీ పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జెల్లా విశ్వనాధ్ సాయంత్రం 4గంటల ప్రాంతంలో సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని జరిగిన సంఘటనపై విద్యార్థినులతో ఆరాతీశారు. మధ్యాహ్నాం భోజనం లేకుండా పస్తులతో ఆందోళన చేయడంపై వెంటనే సబ్‌కలెక్టర్ కార్యాలయ అధికారులకు ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేశారు. అందుబాటులో అధికారులు లేరని చెప్పినా.. వసతిగృహానికి వెళ్లేందుకు ససేమిరా అంటూ విద్యార్థినులు కన్నీరు పెట్టారు.
వసతిగృహం వార్డెన్, వంట మనుషులను మార్పుచేయండి
మదనపల్లె పట్టణం ఎంఎల్‌ఎల్ ఆసుపత్రి వెనుకభాగంలో గత ఆరేళ్లకితం నిర్మించిన బిసి బాలికల కళాశాల వసతిగృహం వార్డెన్, అందులో పనిచేస్తున్న ముగ్గురు వంటమనుషులను వెంటనే మార్పుచేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. వసతిగృహంలో 200మంది విద్యార్థినులు ఉండగా కేవలం 50మందికి సరిపడే కూరలు, చట్నీలు, రసం, మజ్జిగ తయారుచేసి, అందరికీ నీళ్ల చారు వడ్డిస్తున్నారని, బియ్యం శుభ్రం చేయకపోవడంతో అన్నంలో చిన్నచిన్న తెల్లపురుగులు వస్తున్నాయని, ఇదేమని అడిగితే వంట మనుషులు విద్యార్థినులను తీవ్ర అసభ్య పదజాలంతో తిట్ల పురాణం చేస్తున్నారని, మీ భారం మోయలేక తల్లిదండ్రులు ఇక్కడ పడేశారని, అసలు ఆడపిల్లలకు చదువులు అవసరమా.. అంటూ చెప్పలేని, రాయలేని మాటలతో చిత్రహింసలకు గురిచేస్తున్నారని, వసతిగృహంలో పాత్రలు కడగాలి, చెత్తలు ఊడ్చాలి, వసతిగృహం నీళ్ల ట్యాంకులు శుభ్రం చేయాలని, లేకుంటే వార్డెన్‌తో పాటు ఆ ముగ్గురు వంటమనుషులు మాపై అసభ్యంగా ప్రవర్తిసున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అసలు వార్డెన్ అందుబాటులో ఉండకపోవడంతో వంట మనుషుల ఇష్టారాజ్యంగా మారిందని, వసతిగృహం నుంచి రాత్రివేళల్లో బియ్యం, పప్పదినుసులు సైతం బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారని విద్యార్థినులు వెల్లడించి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో బైఠాయించారు. వీరికి ఎఐఎస్‌ఎఫ్ నాయకులు మద్దతు పలికి సబ్‌కలెక్టర్ కార్యాలయ డిటి మాధవరావుకు వినతిపత్రం అందజేశారు. వెంటనే డిటి మాధవరావు, ఎఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు బాలికల బిసి వసతిగృహాన్ని సందర్శించారు.