కడప

పసలేని ఫసల్ బీమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: గత ఏడాది బడ్జెట్‌నే ఈ ఏడాది ప్రీమియం చెల్లించినా పెద్దగా ప్రయోజనం లేదు. అన్నదాతను అన్ని విధాల ఆదుకోవడానికి అనేక బీమా పథకాలున్నా కేంద్రప్రభుత్వం ప్రధాని ఫసల్‌బీమా యోజన పథకం రెండేళ్లక్రితం అమలులోకి వచ్చింది. రైతులు ప్రీమియం చెల్లిస్తే ఆ పథకం రైతులను ఆదుకుంటుందని కేంద్రం ప్రకటించింది. గత ఏడాది ఇచ్చిన తరహాలోనే 30నుంచి 40శాతం నిధులు కేటాయించింది. జిల్లాలో వరుస కరవులు కారణంగా పంటల బీమా కింద ఇన్‌ఫుట్ సబ్సిడీ రూ.100కోట్లు పైబడే విడుదల చేసింది. అయితే బీమా చెల్లింపులో రైతుల్లో చైతన్యం లేని కారణంగా బ్యాంకర్లు చెప్పుకునే విధంగా సహకరించక ఈ బీమా పథకానికి ఏప్రిల్ నుంచి జూలై వరకు ప్రీమియం చెల్లించాల్సివుంటే కొంతమంది రైతులు మాత్రమే బీమా చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా మూడున్నర లక్షల మంది పైబడి రైతులు ఉండగా పసల్ బీమా కింద లక్ష పైచిలుకు మంది మాత్రమే ప్రీమియం చెల్లించారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు పంట రుణమాఫీని ప్రకటించగా 354060మంది రైతులు తమ ఖాతాలు ప్రారంభించున్నారు. వాస్తవంగా ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకం కింద ప్రకృతి వైపరీత్యాల్లో అతివృష్టి సంభవించిన అనావృష్టి కలిగిన చీడపీడలతో కానీ వాతావరణం అనుకూలించక రైతుల పంటలు కోల్పోతే ఫసల్‌బీమా యోజన కింద రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పించనున్నారు. గత ఏడాది జిల్లాలో 31 మండలాల్లో కరువు కోరల్లో రైతులు చిక్కుకున్నారు.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఆశించిన మేరకు పంటలు సాగుకు నోచుకోలేదు. వాస్తవంగా జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లోనే అధిక పంటలు సాగయ్యేవి. ఈ ఏడాది ఖరీఫ్‌లో 44388 హెక్టార్లలో వరిసాగు, 52015 హెక్టార్లలో వేరుశెనగ, కంది, ప్రొద్దుతిరుగుడు, పత్తి, ఉల్లి, కూరగాయలు ఇతర పంటలు అన్నీ కలిపి 218415 హెక్టార్లలో పంటసాగుకు నోచుకోవాల్సివుంది. అయితే అధికారుల గణాంకాల ప్రకారం ఖరీఫ్‌లో అన్ని రకాల పంటలు 132930 హెక్టార్లలో సాగుకు నోచుకోవాల్సివుండగా, 58097 హెక్టార్లలో మొక్కుబడిగా పంటలు సాగుకు నోచుకున్నాయి. ఉద్యానవన పంటలు కింద 61424 హెక్టార్లలో సాగుకు నోచుకోవాల్సివుండగా 47620 హెక్టార్లలో సాగుకునోచుకుంది. ఇప్పటికే వివిధ బీమా కంపెనీలు రెవెన్యూ గణాంక శాఖాధికారులు సర్వేలు మొదలుపెట్టారు. జిల్లా వ్యాప్తంగా జూలైలో 96.7 మి.మీ. వర్షం కురవాల్సివుండగా 46.3మి.మీ వర్షం నమోదైంది. ఆగస్టులో 113.9 మి.మీ వర్షం కురవాల్సివుండగా ఈనెల 20రోజులు గడిచినా 68మి.మీలకే వర్షం పరిమితమైంది. అయితే ఆగస్టులోనే వర్షపాతం సగానికి మించకపోవడంతో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వర్షాలు కురవకపోతే రైతులు సాగుచేసిన పంటలు దిగుబడి అనుమానమే. ఏటా ఇదే పరిస్థితి జిల్లాలో నెలకొనడంతో జిల్లా రైతాంగం తల్లిడిల్లుతున్న సమయంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా అయినా జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.