ఫోకస్

అవినీతి తగ్గితేనే సమస్య పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతి తగ్గితేనే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. యువతకు ప్రభుత్వం ఎన్నో ఉద్యోగావకశాలు కల్పిస్తోంది. కానీ, వాటిని ఏవిధంగా పొందాలన్నది యువతకు తెలియడం లేదు. చాలా మంది యువకులు మా వద్దకు వస్తుంటారు. ఎంతైనా ఖర్చు చేస్తాం. ఉద్యోగం ఇప్పించమని అభ్యర్థిస్తుంటారు. ఇది ఎంతవరకూ సమంజసం? మరి కొంతమంది యువకులు ఖాళీగా తిరుగుతుంటారు! ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా? అని ప్రశ్నిస్తే, సిఫార్స్ లేకుండా తమకు ఎవరు ఉద్యోగం ఇస్తారు? అని అంటున్నారు. దీన్నిబట్టి ఉన్న ఉద్యోగావకాశాలను యువత వినియోగించుకోలేకపోతున్నారన్నది అర్థం చేసుకోవచ్చు. డబ్బు ఖర్చు చేస్తే, ఉద్యోగం వస్తుందన్న అభిప్రాయం అందరిలోనూ మారాలి. రాష్ట్రానికి పరిశ్రమలు ఎన్ని వస్తున్నా, నిరుద్యోగ సమస్య తాండవిస్తునే ఉంది. ఎందుకంటే, ఆయా పరిశ్రమల యాజమాన్యాలు స్థానికులకు ఉపాధి కల్పించడం లేదు. ఈ పరిస్థితి మారాలి. స్థానికులకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా యాజమాన్యాలపై వత్తిడి తేవాలి. గతంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎగబడేవారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలపై చాలా మంది ఆసక్తి చూపడం లేదు. ప్రైవేటు ఉద్యోగాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కఠిన పరీక్షలు తట్టుకుని ఉద్యోగాలు సాధిస్తున్నారు. కొన్ని పరిశ్రమలు స్కిల్డ్ లేబర్ కావాలని కోరుకుంటున్నారు. వృత్తి నైపుణ్యంలేని యువత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. వీరికి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పట్టణాల్లో, నగరాల్లో శిక్షణా కేంద్రాలు పెట్టారు. కానీ, అక్కడి యువత ఏ చిన్న ఉద్యోగమైనా సంపాదించుకోగడు. కానీ గ్రామీణ యువతకు ఉద్యోగం సంపాదించుకునే మార్గాలు తెలియక ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం వీరిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

-వంగలపూడి అనిత ఎమ్మెల్యే, పాయకరావుపేట