ఫోకస్

స్పష్టత లేని నియామకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగ నియామకాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటనలో స్పష్టత లేదు. పైగా నిరుద్యోగుల్లో గందరగోళానికి దారితీసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కండ కోటలో కెసిఆర్ చేసిన తాజా ప్రకటన, వాగ్దానంలో స్పష్టత కొరవడింది. రాష్ట్రంలో ముందున్న 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చారు. నియామకాలకు ఈ మొత్తం జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుంటారా? లేక 10 జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుంటారా? అనేది తెలియక నిరుద్యోగుల్లో అయోమయం నెలకొంది. పైగా రాష్టప్రతి ఉత్తర్వులు ఇంకా అమలులోనే ఉన్నాయి. వీటికి తోడుగా రాష్ట్రంలో ఇకమీదట రెండే జోన్‌లు ఉంటాయని, అవి 1) రాష్ట్ర స్థాయి, 2) జిల్లా స్థాయిగా ఉంటాయని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. దానిపై కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ సంవత్సరం 84,876 ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు, వాటితో పాటు వచ్చే ఏడాది ఖాళీలను కూడా ఇప్పుడే భర్తీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పడం సంతోషమే. కానీ గడిచిన మూడు సంవత్సరాల్లో చేపట్టిన 27,600 నియామకాలలో ఏయే ప్రభుత్వ శాఖల్లో ఏ మేరకు నియామకాలు పూర్తి చేశారు? అసలు మూడేళ్ళలో ఎన్ని ఉద్యోగుల పదవీ విరమణ జరిగింది? ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరించాలి. ఉద్యోగుల నియామకాలలో వౌలిక సమస్యలను, చిక్కులను పరిష్కరించకుండా కేవలం పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా నోటిఫికేషన్లను జారీ చేయిస్తూ, పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించకుండా, లేదా రద్దు చేయించడం ద్వారా ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేసిన యువకుల్లో నిరాశ కలిగిస్తున్నది. కోటి ఆశలతో ఎదురు చూస్తున్న యువతకు లక్షకు పైగా నియామకాలను పూర్తి చేస్తామంటూ ఇంకా మభ్య పెట్టకుండా వారికి వాస్తవాలు చెప్పి చిత్తశుద్ధితో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. స్పష్టత లేని, పొంతన లేని ప్రకటనలు చేస్తూ నిరుద్యోగులను అయోమయానికి గురి చేయవద్దని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరుతున్నాను. ఉద్యోగ నియామకాలకోసం ఎదురుచూస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరుతున్నాను.

- కనుకుల జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ, టి.కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్, ఎఐసిసి కార్యదర్శి