Others

ప్రకృతే ప్రదాత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలమెంత మారినా మనిషి ఎన్ని విజయాలు సాధించినా ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రకృతికి మనిషికి విడదీయరాని సంబంధముంది. నిజంగా చెప్పాలంటే ప్రకృతే మనిషికి మొదటి పాఠశాల. ప్రకృతినుంచే అన్నీ అలవరుచుకొని మనిషి అడుగు ముందుకేస్తాడు. మనుగడ సాగిస్తాడు. మరీ ముఖ్యంగా పల్లె ప్రజలకు, రైతులకు ప్రకృతితో ఎంతో అనుబంధముంది. ప్రపంచంలోని పండుగలన్నీ మొదట మట్టికి, ప్రకృతికి సంబంధించినవే. ఇప్పటికీ రైతు ప్రకృతికి విధేయతను, కృతజ్ఞతాభావాన్ని తెలిపే పండుగలే ఎక్కువున్నాయి. ఇటువంటి పండుగల్లో పోలాల అమావాస్య ఒకటి. దీనిని పిల్లలులేనివారు పిల్లలు కలగాలని, పిల్లలు ఉన్నవారు కడుపు చలవ కోసం ఈ పూజలు చేస్తారు. ఈ పండుగకు కంద మొక్క లేదా బచ్చలి మొక్కకు పూజ చేస్తారు. పిల్లలు కలవారు వారి శ్రేయస్సు కోసం చేస్తారు. పిల్లలు లేనివారు పిల్లలు కలగటానికి పూజ చేస్తారు. పోలాల అమావాస్య కథను చదువుకుని అక్షింతలు జల్లుకుంటారు. అమ్మవారికి తొమ్మిది రకాల కాయగూరలతో వండిన పులుసును అన్నంతో కలిపి నైవేద్యంగా పెడతారు. ముతె్తైదువలు అత్యంత పవిత్రంగా ఈ పోలాల అమావాస్యను భావిస్తారు. చల్లని తల్లి, కోరిన కోర్కెలు నెరవేర్చే కల్పవల్లి, ఐశ్వర్యప్రదాయిని అయిన పార్వతీదేవికి ప్రతిరూపమైన పోలేరమ్మ తమ వెన్నంటి ఉంటూ ఐదోతనాన్ని, సంతానప్రాప్తిని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుతూ ఈ నోము నోచుకుంటారు. పూజించిన మొక్కకు నైవేద్యాలు సమర్పించిన అనంతరం తిరిగి తమ ఇంటి పెరట్లో నాటుతారు. పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి తోరం చేసి ఆ తోరాన్ని పూజ అయ్యాక ఆ పసుపు కొమ్మును చిన్న పిల్లలకు కడతారు. అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు. ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమంలో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడంవల్ల పిల్లలకు అకాల మృత్యుభయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.

చింత చిగురు వంటకాలు
చింతచెట్టు చిగురులు వచ్చేకాలం ఇది. ఈ చిగురులో వగరేకాదు ఎన్నో ఆరోగ్యకర లక్షణాలు ఉన్నాయి. దీన్ని పచ్చిగా తింటే పుల్లగా వుంటుంది. దీనితో టమోటా చింతచిగురు, కందిపప్పు పాఠోళీ, పెసరపప్పు కూర, పచ్చడి, పులుసు, దోశకాయ చింతచిగురు పచ్చడిగా చేసుకోవచ్చును. వడలు, పకోడీలు చేయవచ్చు.

టమోటాలతో..
దోర టమాటాలు-4, చింతచిగురు-2 కప్పులు, మీల్ మేకర్-1 కప్పు, కొబ్బరి, గసగసాలు పేస్ట్-5 చెంచాలు, నూనె-4 చెంచాలు, అల్లం మిర్చిపేస్ట్-4 చెంచాలు, ఆవాలు-1 చెంచా, జీలకర్ర-1 చెంచా, ఉప్పు-1 చెంచా, కొత్తిమీర కొంచెం
విధానం: ముందుగా బాణలిలో నూనెపోసి పోపులు వేయంచుకోవాలి. చింత చిగురు వేయించి అందులో టమోటాలు చిన్న ముక్కలు తరిగినవి వేసి కొంచెం నీరు పోసి ఉడికించాలి. ఉడికాక గసగసాల పేస్ట్, అల్లం మిర్చి పేస్ట్, కొత్తిమీర వేసి కలిపి దింపాలి.

వడలు
శనగపప్పు-1 కప్పు, పెసరపప్పు-1 కప్పు, అల్లం కోరు-4 చెంచాలు, జీలకర్ర-2 చెంచాలు, పచ్చిమిర్చి-8, నూనె-250 గ్రా, ఉప్పు-1 చెంచా, కొబ్బరి కొరు-4 చెంచాలు,
విధానం: పప్పులు నానపెట్టి రుబ్బుకోవాలి. చింత చిగురు రుబ్బి, అల్లంపేస్ట్ మిర్చి ముక్కలు వేసి కలపాలి. నూనె కాచి వడలుగా తట్టి వేయించాలి.

పెరుగుపచ్చడి
చింత చిగురు-4 కప్పులు, పెరుగు-2 కప్పులు, ఆవాలు-1 చెంచా, జీలకర్ర-1 చెంచా, ఎండుమిర్చి-2, పచ్చిమిర్చి-2, కరివేపాకు-2రెబ్బలు, ఉప్పు-1 చెంచా, జీడిపప్పు-12, నెయ్యి-2 చెంచాలు.
విధానం: ముందుగా నెయ్యి బాణలిలో వేసి పోపులు వేయంచుకోవాలి. దానిలో చింత చిగురు వేసి ఒక కప్పు నీరుపోసి ఉడకనివ్వాలి. పెరుగుకి ఉప్పు పసుపు చేర్చి బాగా కలిపి ఉడికిన చింత చిగురువేసి కలపాలి. జీడిపప్పు నానబెట్టి మిక్సీపట్టి ఈ క్రీమ్‌ను పెరుగుకి కలపాలి. ఐదు నిముషాలు మూతపెట్టి ఆ తరువాత టిఫిన్‌తోను, అన్నంతోను తినవచ్చు.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి