ఫోకస్

న్యాయం జరగడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్గీకరణ కొత్తేమీ కాదు, దేశంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమలులో ఉంది. జాతీయ స్థాయిలో ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాలలో ఇప్పటికి కూడా పూర్తిస్థాయి న్యాయం జరగడం లేదు. ఇప్పటికే అమలులో ఉన్న చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం లేదు. దీంతో ఓబీసీలు అన్యాయానికి గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుపరచాలనుకున్న ఒబిసి వర్గీకరణ కంటే ముందు..
1) ఓబీసీలకున్న రిజర్వేషన్లకు అనుగుణంగా ఉద్యోగాలు లభిస్తున్నాయా లేదా అనే కోణంలో ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో వారికి బ్యాక్‌లాగ్ పోస్టుల ద్వారానైనా ఉద్యోగాలు కల్పించాలి. 2) జాతీయ స్థాయిలో దేశం మొత్తంలో 55 నుంచి 60 శాతం వరకు ఓబీసీలు ఉన్నారని చెప్పబడుతున్నప్పటికీ, కుల గణన లేకపోవడం వల్ల వారికి దామాషా పద్ధతి ప్రకారం న్యాయం జరగడం లేదు.
కాబట్టి వర్గీకరణ చేయడంతోపాటుగా బిసి కుల గణన చేయాల్సి ఉంది. బిసిలలో ఉన్నటువంటి వందకు పైగా కులాల్లో ఒక్కో కులానికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో కొంత అంతరాలు ఉన్నాయి కాబట్టి తదనుగుణంగా అన్ని వర్గాల వారికి సమన్యాయం కలిగించాలి. ఓబీసీ వర్గీకరణ మంచిదైనప్పటికీ, దానికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో అమలుకు తగు చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా పైన చెప్పిన సూచనలనూ పరిగణలోకి తీసుకోవాలి. బిసిల అభ్యున్నతి పట్ల బిజెపికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఉద్యోగ నియామకాల్లో ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలి. 60 శాతం ఉన్న బిసిలకు ఎప్పడో పాత గణాంకాల ప్రకారం 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు కల్పించారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే 60 శాతం ఉన్న బిసిలకు పార్లమెంటు, అసెంబ్లీ, కౌన్సిల్‌లోనూ రిజర్వేషన్లు కల్పించి, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలి.

- డాక్టర్ శ్రవణ్ దాసోజు, ప్రధాన కార్యదర్శి, టి.పిసిసి