ఫోకస్

వర్గీకరణ అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అందుకు సరైన విధాన నిర్ణయాలను చేపట్టాలి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలతోపాటు బిసిలకు రిజర్వేషన్లు కల్పించారు. ఈ విధానం అన్నిచోట్ల ఒకే మాదిరిగా లేదు. కొన్ని రాష్ట్రాలు వారికి నచ్చిన విధంగా రిజర్వేషన్లను కేటాయిస్తు పాలన సాగిస్తున్నాయి. ఈ రిజర్వేషన్లలో కొన్ని లోపాల కారణంగా రిజర్వేషను పొందుతూ ఉన్నత స్థానాలకు చేరుకున్న కొన్ని కుటుంబాలు నేటికీ ఆ రిజర్వేషన్లను పొందుతున్నాయి. ఆ విధంగా వారి పిల్లలు రిజర్వేషన్లతో ముందుకు వెళ్తుండగా, ఇంకా పల్లెలు, గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీలు, బిసిలు ఇంకా వెనుకబడే ఉంటున్నారు. దీనివల్ల దేశంలో ఆర్థిక సమానత్వం సాధించలేకపోతున్నాం. వెనుకబడిన కులాలు ఇంకా వెనుకబడిపోతుండగా, కొద్దిమంది మాత్రం మంచి ఫలాలను అందుకుంటున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని నియమించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒబిసి రిజర్వేషన్ వర్గీకరణ చేస్తే బాగుంటుంది. ఆ విధంగా ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలి. దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టం చేశాయి. దానిని దృష్టిలో ఉంచుకొని ఒబిసి వర్గీకరణ జరగాలి. ప్రస్తుతం దేశంలో కులాలు, ఉప కులాలు ఉన్నాయి. వీటిని జనాభా ఆధారంగా ఆయా నిష్పత్తిలో రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటుంది. ఆ విధంగా లేకపోవడంవల్ల నేటికి జనాభాలో అనేక మందికి అవకాశాలు ఉన్నా ఉపయోగించుకోలేకపోతున్నారు. రిజర్వేషన్లు సమాన నిష్పత్తిలో లేకపోవడం వల్ల ఎక్కువ జనాభా ఉన్న కులాలకు తక్కువ సీట్లు, తక్కువ జనాభా గల కులాలకు ఎక్కువ సీట్లు లభిస్తున్నాయి. వాటిని సరిదిద్దేందుకు నిపుణుల కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి రిజర్వేషన్లను కేటాయిస్తే బాగుంటుంది. రిజర్వేషన్ల వర్గీకరణ సక్రమంగా లేకపోతే మెరిట్ అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోవాల్సి వస్తుంది. నేడు రిజర్వేషన్ విధానాల లోపంవల్ల ఆర్థికంగా బాగా సెటిల్ అయిన కుటుంబాల పిల్లలకు ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి.
వాస్తవానికి వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ యువత నేటికి గ్రామాల్లో ఉపాధి దొరక్క అవస్థలు పడుతున్నారు. అన్ని ప్రాంతాల్లోను వెనుకబడిన కులాలు, యువత సమాన అవకాశాలు పొందడానికి ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రిజర్వేషన్ల వర్గీకరణ అమల్లో కొత్త సమస్యలు ఉత్పన్నంగాకుండా చర్యలు తీసుకోవాలి.

- ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు వైస్ ఛాన్సలర్, సెంచూరియన్ వర్సిటీ