Others

సంచార సంగీత మాస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భుజాన గిటార్...చేతి సంచిలో వేణువులు (్ఫ్లట్)తో కనిపించే ఈ వ్యక్తే నడయాడే సంగీతం. ఆయనే సంచార సంగీత అధ్యాపకునిగా పేరు గడించిన సుర్రాని వెంకటేశ్వరరావు (ఎస్.వి.రావు). సంగీత కళను దైవ స్వరూపంగా భావించే ఆయన తాను నేర్చుకున్న సంగీతాన్ని నలుగురికి నేర్పించాలనే సదాశయంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇలా సంచార సంగీత అధ్యాపకుడుగా మారాడు. సంగీత శిక్షణకు వయోపరిమితి లేదని నిరూపిస్తున్నారు. పార్కులు, దేవాలయాలు, ఆడిటోరియంలు, కల్యాణ మండపాలు ఎక్కడ వీలైతే అక్కడ మెట్లమీద కూర్చుని సంగీతంలోని మెళకువలను నేర్పిస్తారు. ఎవ్వరి దగ్గర ఫీజు తీసుకోరు అంతా ఉచితంగా శిక్షణఇస్తారు. ఎవరైనా ఫోన్‌లో సంప్రదిస్తే చాలు వున్న చోటుకే వెళ్లి సంగీతం నేర్పిస్తాడు.

కేవలం ఒక్కరూపాయి గురుదక్షిణగా తీసుకుని ఫ్లూట్‌ను ఉచితంగా ఇస్తూ మరో పదిమందికి నేర్పించమని వారికి సూచిస్తారు. భుజాన గిటార్ తగిలించుకుని సంచరించే ఆయన గిటార్‌రావుగా ప్రసిద్ధి చెందారు. చిన్నతనంలో సంగీతం నేర్చుకోవడానికి అవకాశం దొరకలేదని సివిల్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తనలోని అభిలాషను, కళను బహిర్గతం చేస్తున్నానని చెబుతారు. సంగీతం నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, జ్ఞాపకశక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యంగా వుండగలరని గిటార్‌రావు అంటారు. బిపి, ఆస్తమా, గుండె జబ్బులు దగ్గరకురావని, ముఖంలో తేజస్సు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఫ్లూట్‌లో సంగీత సాధన ద్వారా ఉఛ్వాస నిస్వాసాలు సవ్యంగా జరిగి ఊపిరి తిత్తులకు బలం చేకూరుతుందని ఆయన అంటారు. తిరుపతి ఎస్‌వి కాలేజీలో సంగీతంలో నాలుగు సంవత్సరాల సర్ట్ఫికెట్ కోర్సు చేసిన ఈయన ఎంఎ (సంగీతం) పూర్తి చేసేందుకు సిద్ధవుతున్నారు. సంగీత శిక్షణకు వయోపరిమితి వుండదని నిరూపిస్తూ ఆయనవద్ద పది సంవత్సరాల వయసున్న బాలలు మొదలు డెభ్బై సంవత్సరాల వృద్ధులుకూడా సంగీతం నేర్చుకుంటారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఒంగోలులో వుంటారు. ఈయన మాత్రం సంచార సంగీత ఉపాధ్యాయునిగా తిరుగుతు అప్పుడప్పుడు భార్యా పిల్లలతో గడిపి తిరిగి నగరానికి వస్తుంటారు. సంగీతం కోసం ఒక్క రూపాయి దక్షిణ ఇస్తేఆ సంగీతం విశ్వవ్యాప్తమవుతుందని ఆయన తెలిపారు.
అలా ఎందుకంటే..
ఉచితంగా నేర్పించే విద్య మెదడుకు ఎక్కదు అనే సామెత నిజం కాకూడదని ఒక్క రూపాయి తీసుకుంటున్నానని ఆయన తెలిపారు. శ్రీనివాస సంగీత అకాడమీ పేరుతో ఒక సంస్థను స్థాపించి తద్వారా మొబైల్ మ్యూజిక్ సెంటర్‌గా ‘గిటార్ రావు యఎస్‌ఎ’ పేరుతో నగరంలో సుపరిచితుడయ్యారు.
యుఎస్‌ఎ అంటే యూనివర్సిల్ సంగీత అకాడమీ. సంగీత కళను విశ్వవ్యాప్తం చేయడానికి ఈయన ఎంచుకున్న మార్గం స్టాలిన్ సినిమా జ్ఞప్తికి తెస్తుంది. తన దగ్గర సంగీతం నేర్చుకున్న విద్యార్థులు మరో పదిమందికి చెప్తే ఆ పదిమంది మరో పదిమందికి నేర్పిస్తే తద్వారా తాను నేర్పించిన సంగీతం విశ్వవ్యాప్తం కాగలదని తద్వారా తన ఆశయం నెరవేరగలదని అంటారు. తన ఆశయ సాధనకు తనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే కళామతల్లి జ్ఞానసరస్వతికి సంగీతంతోనే గిటార్ రావు నీరాజనం పలికారు.

-మురళీధర్