Others

దోమ తెరలే తెలివైన పరిష్కారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దోమ చిన్నదే.. కాని దాని కాటుకు వచ్చే రోగాలే భయానకం. బాల్కానీలో నిల్చుంటే చాలు చుట్టుముట్టేస్తుంటాయి. తలుపులు వేసుకున్నా చాలు జొరబడి నిద్రలేకుండా చేస్తుంటాయి. సాయంత్రం ఆరు గంటలు దాటితే చాలు వీటి నివారణకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటాం. చేటు అని తెలిసినా రసాయనాలతో కూడిన మందులనే వాడుతుంటాం. వర్షాలతోపాటు వచ్చే మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలకు ఇవే ప్రధాన కారకాలు. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు నమోదయ్యే డెంగ్యూ కేసులు అధికం అవుతున్నాయి. మహారాష్టల్రో రోజుకు 8,425 డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయంటే ఈ దోమల సంత తెచ్చే తంటా అంతా ఇంతా కాదు. సీజనల్ వ్యాధులను మోసుకొచ్చే ఈ దోమల నివారణకు వాడే మందులు వాటి నివారణకేమోగానీ మనకెంతో చేటుతెస్తున్నాయని నిపుణుల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రాత్రివేళల్లో చిన్నారులకు కమ్మటి నిద్ర కరువవుతుందని తల్లులు దోమలు పారద్రోలేందుకు అందుబాటులో ఉన్న ప్రయోగాలు చేసేస్తుంటారు. ముఖ్యంగా మస్కిటో కాయిల్స్ వెలిగిస్తే దోమలు నివారణమోగానీ దీనివల్ల పిల్లలకు, పెద్దలకు అనేక సమస్యలు తెచ్చిపెడుతుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఒక్క మస్కిటో కాయిల్ వంద సిగరెట్లతో సమానమట. అంతేకాదు వీటి పొగ పీల్చటం వల్ల తలనొప్పి, వికారం, వాంతులు అవుతాయి. అలాగే రసాయనాలతో కూడిన మందులు పిల్లల్లో శ్వాసకోశ సమస్యలకు కారణమవుతున్నాయని వెల్లడైంది. ఒకవేళ రసాయనక మందులు వాటిని మీరు పడుకునే గదిలో కాకుండా వేరే గదిలో ఏర్పాటుచేసుకోమని వైద్యులు సూచిస్తున్నారు. వీటన్నింటికంటే దొమతెరలే మేలు అని సూచిస్తున్నారు. ఇపుడు సులువుగా వాష్‌చేసుకునేలా అందంగా దోమతెరలు వస్తున్నాయి. దోమలు లేని కాలంలో వీటిని జాగ్రత్తగా మడిచి భద్రంచేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్‌లో చక్కగా అల్లిన దోమతెర వల్ల దోమలేకాదు చిన్నచిన్న కీటకాలు సైతం మీ చిన్నారుల దరిచేరవు. కాబట్టి టీవీ ప్రకటనలు చూసి తాత్కాలిక మార్గాలను అనే్వషించకుండా దోమతెరలే అస్త్రంగా వాడుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. డబ్బు ఆదా అవుతుంది.