ఫోకస్

పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించేందుకే తొలుత బిజెపి, ఆపై కాంగ్రెస్ ప్రభుత్వాలు చక్కటి పెన్షన్ వ్యవస్థకు చరమగీతం పాడి సరికొత్తగా కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 46లక్షల 84వేల మంది ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులు ఈ పెన్షన్ విధానంలో ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో 94వేల మంది టీచర్లు, 76వేల మంది ఉద్యోగులు వెరశి లక్షా 70వేల మంది ఉన్నారు. రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అసలే ఉద్యోగాలు లభించని రోజుల్లో ఏదో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కదాయని ఈ విధానాన్ని వ్యతిరేకించకుండానే చేరిపోతూ వచ్చారు. గతంలో పదవీ విరమణ చేసేవారికి ఆఖరి జీతంలో బేసిక్, డిఎ కల్సి అందులో 50 శాతం వారు జీవించినంత వరకు పెన్షన్‌గా లభించేది. ముఖ్యంగా పెన్షన్‌కోసం నయాపైసా చెల్లించాల్సి వచ్చేది కాదు. జిపిఎస్ పద్దు కింద తమ ఇష్టానుసారం పొదుపు చేసుకునే అవకాశం.. ఆపై అవసరం వచ్చినప్పుడు తిరిగి రాబట్టుకునే అవకాశం ఉండేది. దీనిపై ఎలాంటి పన్నులు ఉండేవి కావు. దీంతో నిశ్చింతగా పదవీ విరమణ చేసేవారు. తాజాగా అత్యధిక మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు వచ్చే పెన్షన్ కూడా రాని స్థితి. వీరి సొమ్మును షేర్ మార్కెట్లో ఉంచడమే దీనికి కారణం. అందుకే ఈ నెల ఒకటో తేదీ మిలీనియం మార్చ్ పేరిట విజయవాడలో వేలాది మందితో తమ నిరసన తెలిపారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించని పక్షంలో తమ పోరును ఉద్ధృతం చేస్తాం.

- పి.రామాంజనేయులు యాదవ్, సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, ఏపీ