ఫోకస్

ఉద్యోగుల అభిప్రాయాన్ని మన్నించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదేళ్లు మాత్రమే పదవిలో కొనసాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు భారీగా పెన్షన్లు ఇస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 30 సంవత్సరాలకు పైగా సేవలందించే ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి మొండిచేయి చూపటం సబబుకాదు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం ఉద్యోగులు పదవీ విరమణ చేసే సమయంలో తీవ్ర అవేదన, ఆందోళన కలిగించే అంశంగా మార్చారు. ఈ విధానం అమలులోకి వచ్చి పదమూడేళ్లు గడిచినా ఉద్యోగుల వేతనాల నుంచి పెన్షన్ కింద మినహాయించిన డబ్బులు ఎక్కడికి మళ్లించారో, దాని అజమాయిషీ ఎవరు చేస్తున్నారో తెలియని పరిస్థితి. రెండుమూడేళ్ల నుంచి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి ఒక రూపు అంటు వచ్చినా, పెన్షన్ రూపేణ మినహాయించిన నిధులను షేర్ మార్కెట్‌కు, ఇతర పెట్టుబడులలోకి మళ్లిస్తుండటంతో మార్కెట్ ఆటుపోట్ల కారణంగా పెన్షన్ డబ్బుకు గ్యారంటీ లేకుండా పోతోంది. గతంలో అమలు జరిగిన పెన్షన్ విధానంలో దశాబ్దాలపాటు సేవలు అందించిన ఉద్యోగులు పదవీ విరమణ తరువాత ప్రశాంతంగా జీవితం గడిపేందుకు అవకాశం ఉండేది. కానీ సిపిఎస్ విధానంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోననే అభద్రతాభావం ఉద్యోగుల్లో ఏర్పడింది. అన్ని వర్గాలకు పెన్షన్లు మంజూరు చేస్తున్న, పెన్షన్ మొత్తాన్ని పెంచుతున్న ప్రభుత్వాలు ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి కంట్రిబ్యూటరీ పెన్షన్ పేరిట ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయం తీసుకోవటం ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగుల అభిప్రాయాన్ని మన్నించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి.

- ఎం.శివశంకర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్