Others

సమాజ సేవతో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాటి మనిషికి సహాయం చెయ్యాలనే ఆలోచన చాలా తక్కువమందిలో వుంటుంది. ఆ ఆలోచనలను ప్రోత్సహించే జీవిత భాగస్వామి సాహచర్యం, కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో సేవామార్గంలో నడుస్తున్నారు బెల్లం మాధవి. సావిత్రి భాయి ఫూలే మహిళా సంక్షేమ సంఘం స్థాపించి పది సంవత్సరాలుగా ఎంతోమంది మహిళలకు అండగా నిలిచారు. సంగీతం, చిత్రలేఖనం, యాక్టింగ్, కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకొని ప్రదర్శనలు ఇచ్చిన మాధవి, చిన్నతనం నుండి సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. గత పది సంవత్సరాలుగా దేశం నలుమూలలా పర్యటించి సుమారు రెండువేల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బిసి చైతన్య వేదిక, బిసి మైనారిటీ, సామాజిక న్యాయవేదిక, అఖిల భారత ఒబిసి మహిళా ట్రస్ట్‌ల ద్వారా ఎంతోమంది మహిళలకు చేయూతనిచ్చారు. సొంత లాభం కొంత మానుకో పొరుగువాడికి తోడ్పడవోయి అన్న మహాకవి సూక్తిని పాటిస్తూ అంగన్‌వాడి కేంద్రాలు దర్శించి అక్కడి పిల్లలకు ఆరోగ్య సూత్రాలు తెలుపుతూ కాసేపు ఆ పిల్లలతో గడపడం ఆమెకు ఎంతో ఆనందంగా వుంటుంది.
పేదవారికి, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు వివరించి బ్యాంకు రుణాలు ఇప్పించి కుటీర పరిశ్రమలతో ప్రోత్సహిస్తారు. ఎస్‌సి, బిసి, ఎస్‌టి నిరుపేదలకు జీవనోపాధి విషయంలో అవగాహన కల్పించారు. ఏ ప్రాంతం వారైనా, ఏ భాష వారైనా సహాయం కోరితే కుల మతాలకు అతీతంగా తాము ఒక బృందంగా వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాఠశాల వార్షికోత్సవాలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచెయ్యడమే కాక పిల్లలకు నృత్య నాటకాలలో శిక్షణ ఇస్తూంటారు. మాధవి బహుభాషాకోవిదురాలు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలతోపాటు మరాఠీ, కన్నడ, ఉర్దూ భాషలు కూడా మాట్లాడగలదు. సావిత్రి భాయి ఫూలేను ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నారు. మహిళలను తక్కువగా చూడకుండా అన్ని రంగాలలో మగవారితో సమానంగా మహిళలను గౌరవిస్తూ పేద, గొప్ప తారతమ్య భేదాలు చూడవద్దనేదే తన ఆశయం అని బెల్లం మాధవి అంటున్నారు.

-మురళీధర్