ఫోకస్

సిఎం సంకల్పానికి మద్దతివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిసహా సచివాలయం, అసెంబ్లీ ఇతర నిర్మాణాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు. పరిపాలనా సౌలభ్యంకోసం ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయ భవనాలను నిర్మించారు. రాజధాని నిర్మాణంలో ప్రగతి సాధించిన ముఖ్యమంత్రి తెలంగాణ సచివాలయానికి ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త సచివాలయాన్ని నిర్మించగలరన్న ధీమా ఉంది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఇందుకు ఉదాహరణ. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యమవుతుంది. ఇందుకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ముఖ్యమంత్రి ధైర్యంగా సాగుతూ ఒక్కొక్క సమస్యను అధిగమిస్తున్నారు. భవిష్యత్ తరాలకోసం అమరావతిని ప్రపంచస్థాయి నగరాల సరసన నిలిపేందుకు ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. పదేళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నుండి పాలన సాగించే అవకాశం ఉన్నా పరిపాలనలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, స్వంత గడ్డనుండే పాలన సాగాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.
స్వల్ప వ్యవధిలోనే రాష్ట్ర రాజధానిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించడం ముఖ్యమంత్రి దూరదృష్టికి నిదర్శనం. రానున్న కాలంలో తెలుగుజాతి గర్వపడేలా రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు వౌలిక సౌకర్యాల కల్పన, పరిపాలనా భవనాల నిర్మాణం, అత్యాధునిక సచివాలయ నిర్మాణాలను పూర్తిచేయడం తథ్యం. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి సంకల్పానికి అందరూ మద్దతుగా నిలవాలి.

-తోట నరసింహం ఎంపీ, కాకినాడ, టిడిపి లోక్‌సభ పక్ష నేత