చిత్తూరు

పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 23: ప్రస్తుత పరిస్థితుల్లో పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, వీటి నివారణకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, వెస్ట్‌బెంగాల్ వెటర్నరీ, అనిమల్, ఫిషరీ సైనె్సస్ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ పూర్ణేందు బిశ్వాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, ఇండియన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ వెటర్నరీ రీసెర్చ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి వ్యవసాయ కళాశాలలో నిర్వహిస్తున్న 18వ జాతీయ పశు వైద్య కాంగ్రెస్, 25వ వార్షిక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఐఏఏవీఆర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రుషేంద్రవర్మ సభ ఉద్దేశాన్ని వివరిస్తూ పశువైద్యంలో నాయకత్వ లక్షణాలను పెంపొందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనుసంధానం, బంధాలపై అవగాహన పెంచి పశువుల యొక్క ఆరోగ్యం, ఉత్పాదకత, పరిశోధన ప్రారంభించడానికి నాంది పలికేందుకు డాక్టర్లను, శాస్తవ్రేత్తలను కార్యోన్ముకులు చేయడమేనని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పూర్ణేంద్ర బిశ్వాస్ మాట్లాడుతూ పశువైద్యవృత్తి రోజురోజుకూ ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. ఇది ఒక శుభపరిణామమన్నారు. పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల సంఖ్య కూడా పెరుగుతుందని, ఇది కొంత ఆందోళన చెందాల్సిన అంశం అన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఏవీఎన్ ఇన్‌ఫ్లూయజ్, ఆంత్రాక్స్, టీబీ, రాబిస్ వ్యాధుల వలన కలిగే మరణాలు కూడా పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పశువుల్లో పొదుగు వాపు, గాలికుంటు నివారణకు చేపడుతున్న చర్యలు సఫలీకృతం కావడం లేదన్నారు. మనుషుల తరహాలోనే పశువుల్లో కూడా డయాబెటిస్, క్యాన్సర్, ఊపరి తిత్తుల జబ్బులు ఎక్కువవుతున్నాయన్నారు. వీటి నివారణకు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్వీ పశువైద్య విద్యాలయం ఉప కులపతి డాక్టర్ వై. హరిబాబు మాట్లాడుతూ ఐఏఏవీఆర్‌లో జరిగే చర్చలు, వౌకిక, పోస్టర్ ప్రెజెంటేషన్‌లు మరింత పరిశోధన జరపడానికి ఈసదస్సు పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తూ బోధన చేస్తున్న సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పశువైద్యవిద్య ధృవీకరణ పత్రం తీసుకొని పశువులు, పశు ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టడానికి బై లిటరల్ మీటింగ్స్‌ను నిర్వహించాలన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ అనిమల్ హస్బెండరీ కమిషనర్ డాక్టర్ సురేష్ హొన్నప్పగోల్ మాట్లాడుతూ ఎఫ్‌ఎఓడబ్ల్యూహెచ్‌ఓతో సంప్రదింపులు జరిపి ‘వన్ హెల్త్’ ప్రోగ్రాంను ప్రవేశపెట్టామన్నారు. పశువులు ఆరోగ్యంగా ఉంటే సమాజంలో మనుషులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. మరో విశిష్ట అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత జీసీ మిత్ర, ఐఏఏవీఆర్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌ఎన్ సింగ్ మాట్లాడుతూ ఐఏఏవీఆర్ ప్రమాణాల గురించి వివరించారు.
వీసీ డాక్టర్ హరిబాబుకు డిస్ట్రింగ్విష్డ్ వెటర్నేరియన్ అవార్డు
తిరుపతి పశువైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ వై.హరిబాబుకు ఐఏఏవీఆర్ డిస్ట్రింగ్విష్డ్ అవార్డును ఈ సదస్సులో ప్రకటించారు. అలాగే డాక్టర్ సురేష్ పొన్నప్పగల్‌కు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును డీన్ డాక్టర్ టీ ఎస్ చంద్రశేఖర్ రావుకు ఫెలోషిప్ అవార్డును ప్రదానం చేశారు. అలాగే సీలం బాల, సంగ్రామ్ రామన్, విజయపాల్ సింగ్, శోభారాణి, భానురేఖలకు ఫెలోషిప్ అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో 140 మంది ప్రతినిధులు పాల్గొనగా సభకు డీన్ డాక్టర్ టీ ఎస్ చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. కార్యనిర్వాహక కార్యదర్శిగా డాక్టర్ ఏ రవి వ్యవహరించారు. తొలిరోజు 5 లీడ్ పత్రాలు, 36 ఓరల్, 21 పోస్టర్ ప్రెజింటేషన్లు జరిగాయి.

విద్యుత్ టవరెక్కిన కాంట్రాక్టు కార్మికులు
* మదనపల్లెలో నాలుగు గంటలపాటు ఉద్రిక్తత * డిస్కం నేతల చర్చలతో దిగొచ్చిన కార్మికులు
మదనపల్లె, ఫిబ్రవరి 23: విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తు శుక్రవారం ట్రాన్స్‌కో కాంట్రాక్టు కార్మికులు ఇద్దరు విద్యుత్ టవర్ ఎక్కారు. ఈసంఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. రెండురోజుల కితం రాష్టవ్య్రాప్తంగా విద్యుత్ ఒప్పంద కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో శుక్రవారం ఉదయం 11గంటలకు మదనపల్లె ట్రాన్స్‌కో డివిజన్ పరిధిలోని ఒప్పంద కార్మికులైన లక్ష్మీనారాయణ, రెడ్డెప్పలు నీరుగట్టువారిపల్లె బైపాస్‌రోడ్డు చౌడేశ్వరీదేవి ఆలయం ఎదురుగా రోడ్డుప్రక్కనే ఉన్న విద్యుత్ టవర్‌ను ఎక్కేశారు. టవరెక్కిన ఇద్దరు కార్మికులు పైనుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్కసారిగా జనం గుడికూడి టవరెక్కిన కార్మికులను కిందకు దిగాలని కోరుతూనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ట్రాన్స్‌కో డీఇ, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు, ఒప్పందకార్మిక సంఘం నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సిఐ సురేష్‌కుమార్ మైక్ ద్వారా టవర్‌పై ఉన్న కార్మికులతో చర్చించినా ఫలితం లేకపోయింది. దీంతో తిరుపతి డిస్కం నాయకులు మదనపల్లెకు చేరుకుని టవరెక్కిన కార్మికులతో చర్చించారు. మధ్యాహ్నాం 3.45గంటలకు టవరెక్కిన కార్మికులు దిగివచ్చారు. తోటి కార్మికులు, డిస్కం నాయకులు, పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. టవరెక్కిన కార్మికులకు మద్దతుగా తోటి కాంట్రాక్టు కార్మికులు బైపాస్‌రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో బైపాస్‌రోడ్డు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పూర్తిగా స్థంబించిపోయింది.
కొనసాగుతున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల రిలేదీక్షలు:- సుప్రింకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే అమలుచేసి, సమానపనికి సమానవేతనం కల్పించాలని డిమాండ్ చేస్తు మదనపల్లె ట్రాన్స్‌కో డిఇ కార్యాలయం ఎదుట చేపట్టిన కాంట్రాక్టు కార్మికుల రిలేదీక్షలు శుక్రవారం రెండవరోజుకు చేరుకున్నాయి. ఇచ్చిన హామీలు వెంటనే అమలుచేయాలని ట్రాన్స్‌కో కాంట్రాక్టు కార్మికుల సంఘం నాయకులు శ్రీ్ధర్‌లు డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను పర్మెనెంట్ చేయాలని ఆందోళన చేపట్టిన సమయంలో నాటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి, నేడు మాటతప్పుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. సుప్రింకోర్టు తీర్పును అమలుచేస్తు. వయసు ఆధారంగా పర్మెనెంట్ చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాదంలో చనిపోయిని కార్మికుడి కుటుంబానికి రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధనపై రాష్ట్ర కమిటీ పిలుపుతో సమ్మెలోకి వెళ్లినట్లు నాయకులు మహ్మద్‌ఆలీ, శ్రీ్ధర్‌లు వెల్లడించారు. కార్యక్రమంలో సబ్‌డివిజన్ పరిధిలోని కాంట్రాక్టు విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు.