ఫోకస్

దళారీ వ్యవస్థను ఏరిపారేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూరగాయలు పండించే రైతుకు ఎక్కడైనా మిగిలేది దగానే. అలాగని వినియోగదారుడికి ఉపయోగపడుతుందా అంటే అదీ లేదు. అధిక ధరలతో వినియోగదారుడు నిత్యం తీవ్రవ్యధకు లోనవుతున్నాడు. ఇద్దరికీ మధ్యలో దళారి రోజురోజుకీ ధనవంతుడు అవుతున్నాడు. ఇదే పరిస్థితి చాలాకాలంగా కొనసాగుతున్నా పట్టించుకునే ప్రభుత్వంగానీ నాధుడుగానీ లేడు. టమోటా రైతు పరిస్థితి చూడండి.. కిలో రెండు, మూడు రూపాయలా? ఇక రైతు ఎలా బతుకుతాడు. అలాగని బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉందా... కనీసం 10కి పైగానే అమ్ముతున్నారు. ఇటీవల ప్రకటించిన జాతీయ సర్వే ఒక దానిలో రైతుకు లభించేది కేవలం 23 నుంచి 25 శాతం ధర మాత్రమేనని తేలింది. అంటే మిగిలిన 75 శాతం దళారీ ఖాతాలో జమ అవుతోందన్న మాట. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు ఏనాడూ దృష్టిసారించలేదు. టమోటా వంటి కొన్ని పంటలు ఒక్కసారిగా మార్కెట్లోకి రావడంతో ధర అమాంతంగా పడిపోవడం అంటే చాలా దారుణం. ఈ పరిస్థితి ప్రతి ఏడాది ఎదురవుతూనే ఉంటుంది. కానీ చక్కదిద్దాలన్న ఆలోచనే లేదు. కోల్డ్ స్టోరేజీ సదుపాయం కల్పించి టమోటాలను నిల్వ చేసి మార్కెట్లోకి దశల వారీగా విడుదల చేయవచ్చు. దీంతో కొంతలో కొంత ధర రైతుకు అనుకూలంగా వచ్చే వీలుంటుంది. అలాగే టమోటా పంటను సద్వినియోగం చేసుకునేందుకుగాను టమోటా జ్యూస్, ఇతర అనుబంధ ఉత్పాదనలకు మళ్లించే పనీ చేపట్టడం లేదు. దీంతో ఒక్కసారిగా వచ్చిన పంట ఏం చేయాలో అర్థంకాక పశువులకు పారబోయడం లేదా రూపాయికో, రెండుకో అమ్ముకోవాల్సి వస్తోంది. ఇది టమోటా పరిస్థితి. ఇక మిగిలిన కూరగాయల ధరలకు విపరీతంగా రెక్కలు వస్తున్నాయి. ఇలా పెరిగిన ధరలవల్ల రైతుకు ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదు. కూరగాయల రైతులకు ధర రావాలంటే కనీస మద్దతు ధర ఇంత అని ప్రకటించాలి. అప్పుడే రైతులు తాము పండించిన కూరగాయలకు తగిన ధర వస్తుందని ఆశిస్తున్నారు. రైతుకు మంచి ధర లభించే విధంగా, వినియోగదారునికి భారం పడని విధంగా ధరలు అందుబాటులోకి రావాలి. అంటే దళారీ వ్యవస్థను తొలగించాలి. దీనిపై ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో నియంత్రణ ఉండాలి. ఇలాంటి బ్యాలెన్స్‌డ్ విధానాన్ని ప్రభుత్వం అనుసరించాల్సి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ హాస్టళ్లు, కాలేజీ, ప్రభుత్వ క్యాంటీన్లు వంటి వాటికి నిత్యం అవసరమైన కూరగాయలను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తే చాలావరకు ప్రయోజనం ఉంటుంది. కొన్ని రైతు బజార్లలో రైతులస్థానే వ్యాపారులు ఉంటూ వారే హోల్‌సేల్ మార్కెట్ల నుంచి కూరగాయలు తెచ్చి రైతుల పేరు మీద విక్రయిస్తున్నారు. ప్రభుత్వం దళారీ వ్యవస్థ నియంత్రణపై దృష్టిసారించాలి.

- వై.కేశవరావు అధ్యక్షుడు, ఎపి రైతు సంఘం (సిపిఎం)