Others

అనాథ పిల్లలకు ఆపన్నహస్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతన సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు నిలయమైన భారతీయ సమాజంలో అనాథ పిల్లల పట్ల క్రమంగా ఆదరణ పెరుగుతోంది. సంతానం లేని దంపతులు ఒకప్పుడు తమ బంధువర్గంలోని పిల్లలనే దత్తత తీసుకునేవారు. ఇపుడు అనాథ పిల్లల్ని అక్కున చేర్చుకునేందుకు ఎంతోమంది దంపతులు సుముఖత చూపుతున్నారు. అనాథాశ్రమాల్లో పెరుగుతున్న పిల్లల్ని దత్తత తీసుకోవడం 2012 నుంచి క్రమంగా పెరుగుతున్నట్లు ‘కారా’ (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ)కి చెందిన ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో దేశవ్యాప్తంగా 1,368 మంది అనాథ పిల్లల్ని సంతానం లేని దంపతులు దత్తత తీసుకున్నారు. 2012-13లో మన దేశంలో 4,694 మంది, విదేశాలకు 308 మంది అనాథ పిల్లలు దత్తతకు వెళ్లారు. 2013-14లో భారతీయ దంపతులు 3,924 మంది పిల్లలను, విదేశీ దంపతులు 430 మందిని దత్తత తీసుకున్నారు. 2014- 2015 (మార్చి వరకూ) మనదేశంలో 3,988 మంది, విదేశాలకు 374 మంది పిల్లలు దత్తతకు వెళ్లారు. పిల్లల్ని దత్తత తీసుకునేందుకు సుమారు పదివేల మంది దంపతుల నుంచి దరఖాస్తులు అందగా, అందుకు తగ్గట్టుగా పిల్లలు తమ వద్ద లేరని ‘కారా’ ప్రతినిధులు చెబుతున్నారు. విదేశీయులు, ప్రవాస భారతీయులు పిల్లలను దత్తత తీసుకునేందుకు భారీ సంఖ్యలో ముందుకు వస్తున్నారు. దత్తతపై అవగాహన పెంచడం, ప్రభుత్వ పరంగా లాంఛనాలు త్వరిత గతిన పూర్తి చేయడం వల్ల ఇటీవల పిల్లల్ని దత్తత తీసుకునే దంపతుల సంఖ్య పెరుగుతోంది. దత్తతకు సిద్ధంగా ఉన్న అనాథ పిల్లల వివరాలను ఆన్‌లైన్‌లోనూ ఉంచుతున్నారు. చట్టపరంగా ఉన్న నిబంధనలను సులభతరం చేస్తే దత్తతకు వెళ్లే పిల్లల సంఖ్య మరింతగా పెరుగుతుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు.
*