కడప

సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, మే 21: రైతులు సాగు చేసే ఆయా పంటలను పెట్టుబడి లేని ప్రకృతి సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లెలో రైతు ఉత్తయ్య సాగు చేసిన ప్రకృతి సేంద్రీయ ఎరువుల వాడకంతో సాగు చేసిన అరటి పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు ఉత్తయ్యతో అరటి పంటలు సాగు చేసిన విధానం, పద్ధతి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి, సేంద్రియ ఎరువుల సాగుతో తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట దిగుబడి వస్తుందని రైతు తెలిపారు. అలాగే సేంద్రియ ఎరువులు తయారుచేసే విధానం గురించి రైతు మంత్రికి వివరించారు. ఎకరాకు రూ.75 వేల ఖర్చుతో రూ.3 లక్షల వరకు పంట దిగుబడి ఆదాయం పొందవచ్చన్నారు. తాను 4 ఎకరాలలో సేంద్రియ ఎరువులతో అరటి పంట సాగు చేసి ఖర్చులు పోగా సుమారు రూ.10 లక్షల వరకు డబ్బులు తన చేతికందాయని రైతు తెలిపారు. రైతు ఉత్తయ్య స్ఫూర్తితో ప్రతి ఒక్క రైతు సేంద్రియ ఎరువులను వాడి అధిక పంట దిగుబడి పొందాలని మంత్రి రైతులను కోరారు. అలాగే 70 శాతం మేర రసాయన ఎరువుల వాడకం తగ్గుతుందన్నారు. సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులు చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం తరపున కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం తప్పక ఏర్పాటు చేస్తుందన్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ పంట దిగుబడి సాధించినపుడే రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్‌నాయుడు, జేడీ మురళీకృష్ణ, ఏడీఏ రమణారెడ్డి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నాగరాజు, హార్టికల్చర్ ఆఫీసర్ లక్ష్మణ్, ఏవో జ్యోత్స్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్‌గాంధీ గొప్ప రాజనీతిజ్ఞుడు: తులసిరెడ్డి
వేంపల్లె, మే 21: మాజీ భారత ప్రధాని రాజీవ్‌గాంధీ గొప్ప రాజనీతిజ్ఞుడు అని రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వేంపల్లెలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్గీయ రాజీవ్‌గాంధీ 27వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల చిన్నవయస్సులోనే 1984 నుండి 1989 వరకు ఐదు సంవత్సరాల పాటు భారతదేశ ప్రధానిగా, 1985 నుండి 1991 వరకు ఆరు సంవత్సరాల పాటు భారత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా ఉన్నారని తెలిపారు. దేశ నిర్మాణంలో ఎక్కువ మంది యువతను భాగస్వామ్యులుగా చేసేటందుకు ఓటు కనిష్ట వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన ఘనత రాజీవ్‌గాంధీదేనన్నారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో 1/3వ వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేసి మహిళా సాధికారికతను రాజీవ్‌గాంధీ కృషి చేశారన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానికసంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేశాడన్నారు. అటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు భారత మాత ముద్దు బిడ్డ రాజీవ్‌గాంధీ 1991 మే 21న తమిళనాడు రాష్ట్రంలోని శ్రీ పెరంబదూర్‌లో ఉగ్రవాదుల దురాఘతానికి బలి కావడం దురదృష్టకరమన్నారు. రాజీవ్‌గాంధీ కలలు కన్న ఆధునిక భారత నిర్మాణం కోసం కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.