చిత్తూరు

న్యాయమే గెలిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మార్చి 17 : వైకాపా ఎమ్మెల్యే రోజాపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల చిత్తూరులో వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఏడాది పాటు అసెంబ్లీకి రానీయకుండా సస్పెండ్ చేస్తూ గత అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని గురువారం హైకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్‌ను తొలగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో చిత్తూరులో వైకాపా మహిళా అధ్యక్షురాలు పివి గాయత్రీదేవి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ సర్కిల్ వద్ద సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో మహిళా కార్యకర్తలు ముఖాలకు రంగులు పూసుకొని, టపాసులు పేల్చి నృత్యాలు చేశారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా గాయత్రీదేవి మాట్లాడుతూ అసెంబ్లీ నియమనిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు బహిష్కరించడం దారుణమన్నారు. టిడిపి ప్రజాప్రతినిధులు చేసిన కుట్రలు, కుతంత్రాలకు భయపడని ఎమ్మెల్యే రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించి హైకోర్టు ద్వారా తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవడం హర్షణీయమన్నారు. టిడిపి నేతలు చేసిన ఏకపక్ష నిర్ణయాల్లో చివరికి న్యాయమే గెలిచిందన్నారు. హైకోర్టు తీర్పు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెంపపెట్టువంటిదని పేర్కొన్నారు. తమ నేత జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన న్యాయం ఉందని, ఏ నాటికైనా ఆ న్యాయమే పార్టీని విజయతీరాలకు చేర్చుతుందన్నారు. రోజాపై సస్పెన్షన్ రద్దు విషయాన్ని తేలిగ్గా తీసుకుని అసెంబ్లీలో నవ్వుకుంటూ న్యాయస్థానం తీర్పును అవమానపరిచిన రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాలు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇకపై పదవిలో కొనసాగడం అర్థరహితమన్నారు. ఆయన్ను వెంటనే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి న్యాయస్థానం తీర్పును గౌరవించాలని ఆమె సూచించారు. ఇకనైనా స్వీకర్, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అసెంబ్లీ నియమ నిబంధనలను గ్రహించి వ్యవహరించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.