సబ్ ఫీచర్

రైతుకు ‘బ్యాంకింగ్’ రిక్తహస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం వ్యవసాయాధారిత దేశం. రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. పాడి పంటలకు పెట్టింది పేరు, పుట్టినిల్లు భారతదేశం. ఒకప్పుడు నూటికి నూరుశాతం వ్యవసాయం మీద ప్రజలు ఆధారపడేవారు. రానురాను జనాభా పెరుగుదల, టెక్నాలజీ డెవలప్‌మెంట్, పరిశ్రమల స్థాపన, ధరలు పెరగడం (మందుల ధరలు, కూలీ రేట్లు, నిత్యావసర ధరలు) ఇవన్నీ కూడా వ్యవసాయం క్రమక్రమంగా తగ్గిపోవడానికి గల ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. పాడి పంటలు సమృద్ధిగా ఉన్నప్పుడు జనజీవనం ఎంతో హాయిగా, సాఫీగా ఉండేది. అరెకరం, ఎకరం ఉన్న రైతే కాకుండా వందెకరాలు ఉన్న భూస్వాములు కూడా వ్యవసాయం చేసి పంటలు పండించేవారు. ఎనె్నకరాలు పంట పండించాం, భూమి ఎంత ఉంది అన్నది ముఖ్యంకాదు పంట పండించడమే ముఖ్యోద్దేశం.
ఎకరం ఉన్నా, వందెకరాలున్నా వ్యవసాయం చేసేవారిని ‘‘రైతే’’ అంటారు. ‘రైతన్న దేశానికి వెనె్నముక’ అని పెద్దలు చెప్పినట్లు రైతులు నాల్గు గింజలు పండిస్తేనే ప్రజలు బ్రతికేది, లేకుంటే లేదు. ఒక ఎకరం వరి పొలం వేసిన రైతు నారు పోసిన నాటినుండి ధాన్యం ఇల్లుచేరేవరకు ఎంతోమందికి పని కల్పిస్తాడు. రైతుకు విత్తనం గింజలనుండి మొదలు మందుల రేట్లు, కూలీల రేట్లు రోజురోజుకు పెరిగినప్పటికీ ఏ రోజునుబట్టి ఆ రోజు రేటు ప్రకారం చెల్లించాల్సిందే. చివరకు రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర రావొచ్చు, రాకపోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలవల్ల అతివృష్టి, అనావృష్టి కూడా రావొచ్చు. ఏదీ ఊహించలేం.
రైతుకు నారుపోసిన రోజునుండి వానలకొరకు ఎదురుచూడాలి. వానలు పడితే బాగానే వుంటుంది. లేకుంటే నారు ఎండిపోయి విత్తన ఖర్చు, దుక్కిదున్నిన ఖర్చు రైతు నష్టం భరించాల్సిందే. ఒకవేళ సమయానికి వానలు పడి, కూలీ రేట్లు అధికంగా వున్నప్పటికీ ఆరుగాలం కష్టపడి శ్రమకోర్చి పంట పండించినప్పటికీ ధాన్యం చేతికొచ్చే సమయానికి తుఫాన్లు, వరదలు వచ్చి పంట చేతికి రాకుండా పోయేటటువంటి, పోయినటువంటి సందర్భాలు తెల్లవారితే దినపత్రికలు, మీడియాద్వారా చూస్తూనే ఉన్నాము. ఇలా జరిగితే చివరకు ‘అంతా బూడిదలో పోసిన పన్నీరే’. రైతుకు ఆత్మహత్యలు మార్గంగా కన్పిస్తాయి. రైతు ఒక్కడు ఆత్మహత్య చేసుకుంటే, అతనితోపాటు అతని కుటుంబమంతా రోడ్డున పడుతుంది. అన్నీ అనుకూలించినప్పటికీ తీరా ధాన్యం తీసుకొని మార్కెట్‌కెళ్తే రోజుల తరబడి గిట్టుబాటు ధరకోసం పడిగాపులు గాస్తే సరయిన ధర రాక ధాన్యాన్ని అక్కడే వదిలివేసిన సందర్భాలు, కాల్చిన సందర్భాలు లేకపోలేదు. గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వానిదే తప్పు. ఎందుకంటే నిత్యావసర ధరలు పెంచేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పెంచేది ప్రభుత్వాలే. మరి వీటికి ధరలు అమాంతం పెంచేసిన ప్రభుత్వాలు మద్దతు ధర ఇవ్వకపోవడంతోనే ఇన్ని ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు జరుగుతున్నాయి.
ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ వైఫల్యాలే కాకుండా బ్యాంకింగ్ రంగం అసమర్థత, అశ్రద్ధ, చిన్నచూపు ముఖ్యమైన సంఘటనలు. వ్యవసాయ రంగానికే పెద్దపీట వేయాల్సిన బ్యాంకులు, కార్పొరేట్ దిగ్గజాలకు కొమ్ముకాస్తున్నాయి. పరిశ్రమలు పెట్టడానికి, పెద్దపెద్ద వ్యాపారాలు చేయడానికి వందల కోట్లు ప్రభుత్వ ధనాన్ని ఋణాల రూపంలో ఇస్తున్నాయి. కానీ దేశానికి అన్నంపెట్టే రైతన్నకు వ్యవసాయ రుణాలు ఇవ్వడంలో విఫలమవుతున్నాయి. వంద కోట్లు అప్పు తీసుకున్న బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు దివాలా తీస్తే అప్పులు కట్టలేక ప్రక్క దేశాలకు పారిపోతాడు. కానీ ఒక్క ఎకరా భూమి ఉన్న రైతుకు యాబది వేలు ఋణం ఇస్తే ఆ రైతు కట్టకుంటే అతనికి ఉన్నటువంటి వ్యవసాయ భూములు, స్థిర చరాస్థులు జప్తుచేస్తారు. వచ్చే ఏడాది పంట అమ్మి కడతామన్నా బ్యాంకువారు ఊరుకోరు. కానీ యాబయివేల రూపాయలు ఎగ్గొట్టి, అప్పుచేసిన రైతు ఊరువిడిచి పారిపోయే అవకాశమే లేదు. ఎందుకంటే అతని కుటుంబానికి ఊర్లో దిక్కుండదు. రైతు ఎంత నష్టపోయినా మళ్ళీ వ్యవసాయమే చేసుకొని బ్రతకాలి. భూమిని నమ్ముకున్న రైతు అందులో కలిసిపోయే వరకు మట్టిని ఆధారం చేసుకొనే బ్రతకాలి. వ్యవసాయం తగ్గిపోవడానికి ముఖ్య కారణం కూడా బ్యాంకింగ్ రంగమనే చెప్పుకోవాలి.

- శ్రీనివాస్ పర్వతాల