Others

సహస్రాధిక గీతా జ్ఞానయజ్ఞకర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంసారమనే విషవృక్షానికి రెండు మధుర ఫలాలు కాస్తాయి. ఒకటి సద్గ్రంథ పఠనం, రెండు సజ్జన సల్లాపం- అని మనకు శాస్త్రం చెబుతుంది. సంసారంలో ఉంటూ ఆధ్యాత్మిక మార్గంలో సఫలీకృతులైనవారు చాలా అరుదు. బురదలో పుట్టిన కమలంలాగా, నీళ్లలో ఉండి తడి అంటని వరి ఆకులాగా అరుదైన కొందరు మాత్రమే ‘సంసారం - సత్సంగం’ కలిపి చేస్తారు. అలాంటి మహనీయుల్లో పూజ్య లక్ష్మీకాంతరావు బాబా ఒకరు.
స్వస్తిశ్రీ దుందుభినామ సంవత్సరం (1922) బహుళ దశమినాడు శ్రీమతి నర్సమ్మ, రంగారావు దంపతుల పుణ్యఫలంగా జన్మించారు బాబా. సదాచార వైష్ణవ కుటుంబంలో పెరిగి పెద్దవాడైనాడు. దైవ నిర్ణయం ప్రకారం వారు నేటి రంగారెడ్డి జిల్లా గూడూరు వాస్తవ్యులైనా దత్తపుత్రుడిగా పరిగికి వెళ్లాల్సి వచ్చింది. పరిగి సమీపంలోని పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలోనే తెలంగాణ ప్రముఖ వాగ్గేయకారుడు రాకమచర్ల వెంకటాసు జీవించారు. ఆయన స్ఫూర్తితోనే లక్ష్మీకాంతరావు బాబాగా మారిపోయి ఆ ప్రాంతంలో గొప్ప ఆధ్యాత్మిక మార్గాన్ని సుస్థిరం చేశారు.
సంసారంలో సఫలీకృతుడిగా ఉంటూనే సత్సంగం కొస పట్టుకొని ముందుకు నడిచాడు. బాబా 18 ఏళ్ల వయసులో శ్రీమతి అనసూయమ్మను వివాహం చేసుకొని పదిమంది సంతానం పొంది పరమ పవిత్రమైన గీతామార్గం పట్టాడు. వినోభా బాబాగారి భూదానోద్యమంలో పాల్గొని భూసంతర్పణ చేసాడు. సమున్నత వ్యక్తిత్వంలో సామాజిక సేవకు ఆధ్యాత్మిక మార్గం ఎంచుకొన్నాడు.
బాబా సనాతన భారతీయ మూలాలను వినూత్నంగా అందించాలనుకొనే సంకల్పంతో కొందరు భక్తులతో కలిసి గ్రామ గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. శ్రీరాముడు ధర్మోద్ధారకుడు, ధర్మస్వరూపం అని ‘రామనామం’ రమ్యమైందని శ్రీరామ జపయజ్ఞం ఒక ఉద్యమంగా చేపట్టాడు లక్ష్మీకాంతరావు బాబా. ‘జగమంతా రామమయం’ అంటూ జనాన్ని రామనామంలో ముంచెత్తాడు. ఈ క్రమంలో రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వారి మార్గాన్ని అనుసరించేవారు ఎందరో శిష్యులు అయ్యారు. ‘స్మధర్మ’ సంస్థ ద్వారా జరుగుతున్న భజన, సత్సంగం, నామజపం అనే త్రిరత్నాలు లక్ష్మీకాంతారావును ‘భాబా’గా మార్చాయి. దీనికి సమాంతరంగా లక్ష్మీకాంతారావు బాబా గీతను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ సాధనలో మునిగిపోయాడు. శ్రీకృష్ణ్భగవానుని గీతాతత్త్వాన్ని అమృతంలా భక్తులకు అందించాలనే సంకల్పంతో గీతాయజ్ఞాలను నిర్వహించారు. భగవద్గీతను వ్యాఖ్యానించడంలో వారికివారే సాటి అన్నట్లుగా అనర్ఘళంగా ప్రసంగాలు సాగించేవారు. భోగాలను త్యజించిన బాబా నిరంతరం ఆకాశంలోని పరిపూర్ణ చంద్రునిలాగా, ప్రశాంతంగా స్థితప్రజ్ఞుడిలా గీతా ప్రబోధం చేశారు. ‘పరిప్రశే్నన సేవయా’ అన్నట్లు ఎందరో ఆయనకు శిష్యులై గీతామృతపానం చేశారు. సుందర పుష్పాలతో వికసించే మొక్కలాగా అనేకమంది శిష్యకోటిని సంపాదించి ఆధ్యాత్మిక మార్గానికి మరిన్ని రాచబాటలు వేశారు.
నగరాల్లో, పల్లెల్లో ప్రతిరోజూ నగర సంకీర్తన నిర్వహిస్తూ రాకమచర్ల వేంకటదాసు కీర్తనలు ఆలపించే ఏర్పాటు చేశారు బాబా. అలాగే రంగారెడ్డి జిల్లాలో అనేక గ్రామాల్లో దేవాలయాల పునర్నిర్మాణం చేయించి ధూపదీప నైవేద్యాలకు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమాల్లో లక్ష్మీకాంతరావు బాబా జ్ఞానస్థాయి మరింత పెరిగింది. ప్రపంచంలోని వస్తువులు ఆయనకు ఆసక్తి కలిగించలేదు. అవన్నీ తన మనస్సనే పెట్టెలోని రత్నరాసుల్లాగా భావించారు. సర్పం తన కుబుసాన్ని వదిలేసినట్లు మెల్ల మెల్లగా బాబా సంసారంలో ఉంటూనే అన్ని బంధాలను వదలించుకొన్నారు. యుద్ధంలో కవచం ధరించిన సైనికుడిని ఎంత వాడిగల బాణాలనా ఏమీ చేయలేవో, అలాగే బాబాను ఈ సంసారబంధాలు ఆధ్యాత్మిక పథాన్ని ఆపలేకపోయాయి. అందునా వారు శ్రీ కుసుమ హరనాథ గురు సంప్రదాయాన్ని బాగా అనుకరించారు.
బాబా మనస్సంతా బ్రహ్మమయం అవడంవల్ల లోకమంతా ఆయనకు బ్రహ్మతత్వంగా అనిపించేది. నిత్య సంతోషంతో వారు సత్యానే్వషణ చేశారు. నీటిలోని రవిబింబం గాలికి అటూ ఇటూ కదిలేది గాని నిజమైన సూర్యుడు అలా కదలనట్లు బాబాగారు తనకున్న అవాంతరాలను అధిగమించి భక్తిప్రచారం కొనసాగించారు. వెయ్యికిపైగా గీతాయజ్ఞాలను చేసి తన అపార పరిజ్ఞానాన్ని భక్తులకు అందించారు.
ఓసారి యువకులను ఉద్దేశించి ప్రసంగం చేస్తూ ‘‘తమ మహోన్నత వ్యక్తిత్వాలతో మన ధర్మానికి, దేశానికి వనె్నలు దిద్ది మన భారత కీర్తి పతాకలు అన్ని చోట్లా ఎగురవేసిన స్వామి వివేకానంద, సర్దార్ భగత్‌సింగ్, సుభాష్‌చంద్రబోస్, బన్ మహారాజ్ వంటి యువ కిశోరాల వారసులైన యువకులు ఎక్కడైనా దొరుకుతారని ఆశతో వెతుకుతున్నాను అని ఉద్వేగభరితులైనారు.బాబా ‘‘్ధర్మానికి ఆలంబనగా ఉండాల్సిన యువకులు నీతి నియమాలకు తిలోదకాలిస్తూ ధర్మం, దేశాన్ని నిరాదరిస్తూ, దేవునికి కూడా దూరమై స్వార్థచింతనతో జీవించడం మన జాతికి సంక్రమించిన దుర్దశగా’’ భావిస్తాను అని అన్నారు.
ప్రాపంచిక సంబంధమైన విషయాల్లో శిక్షణ పొందుతున్న మన సమాజం మనకున్న సాంస్కృతిక సంపదను విస్మరిస్తున్నదని ఈ విషయంపై మేధావులు సక్రమ మార్గాన్ని ప్రజలకు అందించాలని వారు తపించేవారు. సమాజం ఒక జలాశయంగా భావిస్తే జ్ఞానులు అందులోని చేపల్లాంటివారని లక్ష్మీకాంతరావు బాబా చెప్పేవారు. ఎందుకంటే జలాశయంలోని మురికిని ఈ చేపలు మ్రింగివేసి నీటిని నిర్మలంగా ఉంచాలని ఉద్బోధించేవారు. భగవన్నామాన్ని, భగవద్గీతను మాధ్యమంగా చేసుకుని జరుగుతున్న మన ధార్మిక, ఆధ్యాత్మిక ప్రచారం ప్రతివారూ భుజాలపై మోసుకెళ్లి స్వాధ్యా సంఘాలను, భజన మండళ్లను ఏర్పరచి భగవన్నామ ప్రచారం చేయాలని వారు చెప్పేవారు. భగవద్భక్తికి కుల, మత, వర్గ సంప్రదాయ భేదాలు పనికిరావని, ధనిక, బీద, స్ర్తి పురుష తారతమ్యాలు లేకుండా ఈ ధర్మాన్ని అనుసరించాలని బాబా ప్రచారం చేశారు.
‘శ్రీ రాకమచర్ల సత్సంగమండలి’ పేరుతో లక్ష్మీకాంతరావు బాబా చేసిన కార్యక్రమాలకు లెక్కలేదు. కర్మ, జ్ఞాన యోగాలను ఏకకాలంలో అందించి ప్రజలను ఆధ్యాత్మిక మార్గంవైపు నడిపించిన లక్ష్మీకాంతరావు బాబాగారు మన్మథ నామ ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి 26 అక్టోబర్ 2015నాడు దేహత్యాగం చేశారు. వారు భౌతికంగా శరీరం వదలినప్పటికి వారిచ్చిన స్ఫూర్తి ఎందరినో ఆ దివ్యమార్గం వైపు నడిపింది. భగవద్గీతను ప్రచారాస్త్రంగా ఎందరో శిష్యులు ఆధ్యాత్మిక ప్రబోధం చేస్తున్నారు. వారు చెప్పిన ‘శరణాగతభక్తి’ భక్తులందరికీ శిరోధార్యం. అదే మనం వారికిచ్చే శ్రద్ధాంజలి.

- డా పి.్భస్కరయోగి