చిత్తూరు

15 నుంచి జూన్ 30 వరకు 50 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఏప్రిల్ 1: వేసవి సెలవుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 15వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు రూ.50 ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టిటిడి ఇ ఒ సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ ఇ ఒ కార్యక్రమం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వేసవి సెలవుల్లో తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం టిటిడి ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో బాగంగా శుక్రవారం రోజున శ్రీవారికి నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవలు వలన సాధారణ దర్శనం మొదలయ్యేందుకు ఆలస్యం అవుతోందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ రోజున వి ఐ పటి బ్రేక్ దర్శనాలను భారీగా కుదిస్తూ కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే టికెట్లను కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే శుక్రవారం ఉదయం 10 గంటలకు వృద్దులకు వికలాంగులకు కల్పించే దర్శనాలను రద్దు చేస్తూ, మధ్యాహ్ననం పూట మాత్రమే వారికి దర్శనం కల్పించేందుకు నిర్ణయించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల టిటిడిలోకి విలీనం కల్పించేందుకు నిర్ణయించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇటీవల టిటిడిలోకి విలీనం చేసుకున్న ఒంటిమిట్టలోని రామాలయంలో ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20వ తేదీన సీతారాముల కల్యాణంను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మేనెలకు సంబందించి 55,669 ఆర్జిత సేవా టికెట్లను ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో ఉంచామని, ఇందులో 6279 సుప్రభాతం టికెట్లతోపాటు 130 తోమాల, 130 అర్చన, 1875 విశేషపూజ, 100 అష్టదళ పాదపద్మారాధన, 1500నిజపాదం, 11,625 కల్యాణోత్సవం, 3100 ఊంజల్‌సేవ, 11610 వసంతోత్సవం, 6020 ఆర్జిత బ్రహ్మోత్సవం, 13300 సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు అందుబాలు ఉంచామన్నారు. భక్తులు వీటిని ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న శ్రీవారి సేవలో పాల్గొనాలని కోరారు. ఇక డయల్ యువర్ ఇ ఒ కార్యక్రమం స్వీకరిస్తున్నామని మరింత మంది భక్తుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించేందకు వీలుగా పటిష్టమైన కాల్ సెంటర్, ఈమెయిల్, నేరుగా వారి ద్ద నుంచి ఫీడ్ బాక్ పొందేందుకు వీలుగా టిటిడి ఏర్పాట్లు చేసిందని అన్నారు. భక్తులు ఈ మార్గాలను ఉపయోగించుకుని వారి విలువైన సలహాలను, సూచనలను, ఫిర్యాదులను టిటిడికి తెలియజేయాలని ఆయన కోరారు. భక్తుల నుంచి అందుకున్న ఫిర్యాదులను, సూచనలను టిటిడి పరిశీలించి ఎటువంటి చర్యలు, మార్పులు తీసుకువచ్చాయని వారికి తెలియజేసేందుకు వీలుగా టిటిడి వెబ్‌సైట్ ద్వారా ఎస్వీబిసి ద్వారా ప్రసారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తులు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇక వేసవి సెలవుల్లో తిరుమలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఏర్పాట్లలో భాగంగా నిత్యాన్నదాన సముదాయంలో ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదం వితరణ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ఎండ తీవ్రతను తట్టుకునేందుకు చలువపందిళ్ళు, నాలుగు మాడా వీధుల్లో కూల్ పెయింట్ కోటింగ్, త్రాగునీరు, మజ్జిగ వితరణ వంటి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులు సేద తీరేందుకు వీలుగా తిరుమల బస్టాండ్ కాంప్లెక్స్‌లోని హాల్‌ల్లో తగిన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం తిరుపతి జెఇఓ పోల భాస్కర్ మాట్లాడుతూ కడపజిల్లా ఒంటిమిట్లలో ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో బాగంగా 16న సీతారామ కల్యాణం, 17న శ్రీరామ పట్ట్భాషేకం, 19 నుంచి 21వ తేదీవరకు తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.