Others

శ్రీకాళహస్తీశ్వరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడుకుల్ పుట్టరటంచు నేడు రవివేకుల్ జీవనభ్రాంతులై!
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్, వారిచే నేగతుల్
వడసెన్? పుత్రులు లేని యా శకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!

భావం:ఈశ్వరా! లోకంలోని జనులు ఎంత అవివేకులు! కొడుకులు పుట్టలేదని, తమకు ఉత్తమగతులు లేవని అజ్ఞానంతో ఏడుస్తున్నారు. కౌరవ చక్రవర్తి ధృతరాష్ట్రునకు వందమంది కొడుకులు పుట్టారు కదా! వారి వల్ల అతడు ఎంత ఉత్తమగతిని పొందాడు. బ్రహ్మచారిగా ఉండి అపుత్రకుడైన శుక మహర్షికి ఏ దుర్గతులు కలిగెను. ఇదంతా భ్రాంతి తప్ప మరొకటి కాదు. అపుత్రకుడైనవానికి మోక్షమార్గము మూసుకొని పోవునా? వట్టిది. ‘జ్ఞానేనహి నృణాం మోక్షః’.

గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కల్యాణనామంబు ప్ర
త్యహమున్ బేర్కొను నుత్తమోత్తముల బాధంబెట్టగా నోపునే?
దహనుం గప్పగఁ జాలునే శలభ సంతానంబు? నీ సేవఁచే
సి హతక్లేశులుగారుగాక మనుజుల్ ఓ శ్రీకాళహస్తీశ్వరా!

భావం:ఈశ్వరా!విషమ స్థానంలో నుండి గ్రహములు కలిగించు బాధలుగానీ, అపశకునములుగానీ, రోజూ నీ నామస్మరణం చేయు పుణ్యపుషులను కష్టపెట్టగలవా? ఏమిటో ఈ ప్రజలు అజ్ఞానంలో పడి నిన్ను సేవించక దుఃఖములను అనుభవిస్తున్నారు గానీ, మిడుతుల దండు అగ్నిని ఆవరింపలేదని గ్రహించపలేకున్నారేమి? ఇదెంత చిత్రమైన విషయము?

అడుగం బో నిక నన్యమార్గరతులం ప్రాణావనోత్సాహినై,
యడుగంబోయినఁ బోదుఁ నీదు పద పద్మారాధక శ్రేణీయు
నె్నడకున్, నిన్నుభజింపగాఁ గనియు నాకేలా పరాపేక్ష కో
రెడి దింకేమి? భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాళహస్తీశ్వరా!

భావం:ఈశ్వరా! నా జీవనయాత్ర సాగుటకై శైవులు గాక ఇతర మార్గానుసారులను యాచించను. ఒకవేళ యాచించినా, నీ చరణదాసులైన భక్తులనే యాచిస్తాను. అయినా, నిన్ను సేవించు పద్ధతులు తెలుసుకొన్న నాకు ఇతరులను యాచించు అవసరమేమి ఉన్నది? నీ అనుగ్రహము కలిగినచో ఈ అల్పములైన ప్రాపంచిన సుఖములు ఎందుకు కోరతాను? అసలు కోరుటకు వీనిలో సారం ఏమున్నది.

హితవాక్యం

సహసా విదధీత న క్రియాం అవివేకః పరమాపదాం పదం
వృణతే హి విమృశ్య కారిణం గుణలుబ్ధాః స్వయమేవ సంపదః

భవ్య కవితాభాస్కరుడైన ‘్భరవి’ మహాకవి వెలయించిన పదమాలిక యిది. ‘కిరతార్జునీయం’లోని సన్నివేశం.
పాండవులు కానల్లో కోనల్లో కటిక చీకట్లలో బాధలు పడుతూ బరువుగా కాలాన్ని గడుపుతున్నారు. రాజనీతిని అనుసరించి ధర్మరాజు ఒక వనేచరుణ్ణి హస్తినాపురం పంపాడు. రాజ్యంలోని పరిపాలనా విశేషాల్ని రహస్యంగా తెలుసుకొని రమ్మన్నాడు. కొంతకాలం తర్వాత వనేచరుడు ద్వైతవనంలో వున్న ధర్మరాజును కలుసుకున్నాడు. చాలా సమర్థవంతంగా సుయోధనుడు పరిపాలిస్తున్నాడని చెప్పి విశేషాల్ని వివరించి వెళ్లిపోయాడు. అంతా విన్న ద్రౌపది ధర్మరాజును ఎత్తిపొడుపు మాటల్తో ఉద్రేకింపజేయాలని ప్రయత్నించింది. ‘‘నువ్వు వేసిన తప్పటడుగువల్లనే మేమింత దురవస్థను అనుభవిస్తున్నాం’’ అన్నది. తర్వాత భీమసేనుడందుకొని ‘‘ప్రతీకారం తీర్చటమే పురుష లక్షణం’’ అంటూ కనె్నర్రజేశాడు. యుద్ధానికి సన్నద్ధులు కావటమే కర్తవ్యమని గర్జించాడు. ఆ మాటలన్నీ ప్రశాంతంగా విని ధర్మరాజు ప్రసన్న దృక్కులతో పాంచాలి వైపు తిరిగి యిలా అన్నాడు.
‘‘అనుకున్న వెంటనే చేయరాదు. ఆలోచన ఆచరణలోకి రావటానికి ముందు మంచి చెడుల వివేచన కావాలి. అది లేకపోవటం అవివేకం. అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. గుణవంతుల్ని వరించే శీలంగల సంపదలు వివేకశీలుణ్ణి స్వయంగా వచ్చి వరిస్తాయి. కాబట్టి ఏ పని చెయ్యాలన్నా ముందుగా దానివల్ల కలిగే లాననష్టాల్ని గురించి వివేచించాలి. అదే మన విజయానికి ఉత్తమమైన మార్గం’’.

-వ్యాఖ్యాత:డి.ఎన్.దీక్షిత్