కడప

సీమ సమస్యలు వినేందుకే సిద్ధంగా లేని కేంద్ర హోంమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 18: కేంద్రం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాక సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ నేతలను ముందస్తుగానే అరెస్టు చేశారు. రాయలసీమ సమస్యలను వినేందుకు కూడా బీజేపీ కేంద్రమంత్రులు, నాయకులు సిద్ధంగా లేరని పార్టీ నేతలు ఆరోపించారు. ప్రజాసమస్యలను వినకపోగా అరెస్టు చేయించడం హేయమని అన్నారు. శుక్రవారం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కడప నగరానికి వస్తున్న నేపధ్యంలో, గురువారం రాత్రి 10గంటలకు ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి, రాయలసీమ ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి సుంకర రవి, ఆర్‌ఎస్‌వైఎఫ్ రాష్ట్ర అద్యక్షుడు భరత్‌కుమార్‌లను తాలూకా పోలీసులు అరెస్టుచేసి సికెదినె్న పోలీసుస్టేషన్‌కు తరలించారు. అంతకుముందే, రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించాలని రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ నేతలు డీఎస్పీకి విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు. గురువారం రాత్రి ముఖ్యనేతలను అరెస్టు చేసినప్పటికీ, శుక్రవారం ఉదయం 7గంటలకు వినతిపత్రం ఇచ్చేందుకు డీఎస్పీ తమకు అనుమతి ఇచ్చారని, అయితే మళ్లీ ఉదయం 9గంటలకు కేంద్ర ఇంటలిజెన్సీ బ్యూరో, డీఎస్పీ ఇచ్చిన అనుమతిని నిరాకరించి అందర్నీ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించారని ఆపార్టీ నేతలు రవిశంకర్‌రెడ్డి, నగర కార్యదర్శి ఎస్.మగ్బుల్ బాషాలు ఆరోపించారు. రాయలసీమ సమస్యలను వినేందుకు కూడా సిద్ధంగా లేని కేంద్రమంత్రి, బీజేపీ నాయకులు రాయలసీమ డిక్లరేషన్‌ను ఎంతమాత్రం అమలుచేస్తారో అర్థవౌతోందని అన్నారు. బీజేపీ ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ కేవలం రాజకీయ ప్రకటనే కానీ, వెనుకబడిన రాయలసీమను అభివృద్ధిచేయాలనే సంకల్పం మాత్రం కాదన్నారు. విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కేంద్రం అమలు చేయలేదని వారు విమర్శించారు. కేంద్రం నుండి మంజూరు కావాల్సిన కడపకు ఉక్కుపరిశ్రమ, అనంతపురంకు సెంట్రల్ యూనివర్సిటీ, మన్నవరం ప్లాంట్, గుంతకల్లుకు రైల్వేజోన్ మొదలైన వాటిపై కేంద్రప్రభుత్వం, బీజేపీ నేతలు అసలు ఆలోచన కూడా చేయడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ ప్రతినిధులను కలిసి ప్రజాసమస్యలు తెలిపే హక్కును కూడా ఇవ్వకుండా అక్రమ అరెస్టులతో బీజేపీ ప్రభుత్వం పాలనసాగిస్తోందని విమర్శించారు.

గ్రామాల అభివృద్ధికి దాతల సహకరించాలి
* కలెక్టర్ హరికిరణ్
ఆంధ్రభూమి బ్యూరో
కడప,జనవరి 18: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే దాతల సహకారం అవసరమని కలెక్టర్ సి.హరికిరణ్ అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో శుక్రవారం ఆయన జిల్లాస్థాయి స్మార్ట్ విలేజి, స్మార్ట్ వార్డు భాగస్వాముల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్టీలకు, కులమతాలకు అతీతంగా జిల్లాలోని ప్రతిగ్రామం అభివృద్ధి చెందాలని అన్నారు. ఇందుకోసం అధికారులు, ఆయా ప్రాంతాల్లోని దాతలను, ఆ గ్రామాల నుండి ఇతర ప్రాంతాలకు, దేశాలకు వెళ్లి ఆర్జించిన వారి సహకారం తీసుకోవాలన్నారు. అభివృద్ధిలో జిల్లా అగ్రగామిగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు వేశామన్నారు. పూర్తిస్థాయిలో అన్ని వౌలిక వసతులు కల్పించి స్మార్ట్ విలేజి, స్మార్ట్‌వార్డులుగా రూపుదిద్దాలంటే దాతల సహకారం ఎంతో అవసరమన్నారు. జిల్లాలోని ప్రతి ఎంపీడీవో ఆయా మండల పరిధిలో ముగ్గురు, నలుగురు దాతలతో రిజిస్టర్ చేయించి, గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములను చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. మండలస్థాయి అధికారులు, ఎంపీడీవోలు వారి సమీప ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీల యజమానులను, ఎన్‌ఆర్‌ఐలను, ఎన్‌జివోలను సంప్రదించి వారు గ్రామాలను దత్తత తీసుకునే విధంగా మాట్లాడాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రతిగ్రామానికి తాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు, విద్యుత్ వంటి అన్ని వౌలిక వసతులు కల్పించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడు గ్రామానికి మనోహర్‌రెడ్డి అనే వ్యక్తి దత్తత తీసుకుని, ఆగ్రామంలోని నిరుద్యోగయువతకు జాబ్‌మేళా, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, పార్కుల అభివృద్ధివంటి కార్యక్రమాలు చేపట్టి ఆదర్శగ్రామంగా అభివృద్ధి చేశారన్నారు. ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కూడా ముందుకు వచ్చి అభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు. ఇదే విధంగా జిల్లాలోని ప్రతి గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు దాతలను వెతకాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దేశంలో 113వెనుకబడిన జిల్లాల్లో కడప జిల్లాను భారత ప్రభుత్వం వెనుకబడిన జిల్లాగా గుర్తించారని, దీంతోపాటు దాతలు కూడా ముందుకు వస్తే మరింత అభివృద్ధిచెందే అవకాశం ఉందన్నారు. పాఠశాలల్లో కనీస వసతులు ఏర్పాటుచేయడం, ప్రాధమిక ఆరోగ్య వైద్యకేంద్రాల్లో వసతులు ఏర్పాటుచేయడం వంటి కార్యక్రమాలు దాతలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఇవో వెంకటేష్, స్మార్ట్ ఏపీ డిప్యూటీ సీఈవో విజయకుమార్, మున్సిపల్ కమిషనర్ లవన్న, డీపీవో మోహన్‌రావు, ఉపాధిహామీ పథకం ఏపీడీ ముగిలిచెండు సురేష్ తదితర ఎంపీడీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు.

ఎందరో పుణ్యమూర్తుల బలిదానాలే నేటి బీజేపీ
* బీజేపీ అంటే అభివృద్ధికి చిరునామా
* మాజీ కేంద్రమంతి పురందేశ్వరీ
కడప సిటీ,జనవరి 18: ఎందరో పుణ్యమూర్తుల బలిదానాల ఫలితమే ఈనాటి భారతీయ జనతాపార్టీ అని మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి శుక్రవారం అభివర్ణించారు. నగరంలోని కందుల ఎస్టేట్‌లో జరిగిన బీజేపీ బూత్‌స్థాయి కమిటీల, కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. భారతీయ జనతాపార్టీ అంటేనే అభివృద్ధికి చిరునామా అన్నారు. రాయలసీమను కర్మభూమిగా తాను భావిస్తానని, తన తండ్రి ఎన్‌టి రామారావు రాయలసీమకు తనకుతాను దత్తపుత్రుడిగా వర్ణించుకున్నారన్నారు. అలాంటి రాయలసీమలో జరుగుతున్న నేటి బీజేపీ సమావేశానికి తాను హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధికోసం బీజేపీ ఎంతో కృషి చేస్తోందని , అయినప్పటికీ ఇక్కడి నాయకులు కేంద్రం ఆదుకోవడంలేదని ఆరోపించడం దారుణమన్నారు. మూడునెలల్లో ఎన్నికలు ఉన్న ఈతరుణంలో బీజేపీ కార్యకర్తలందరూ తమ పార్టీ రాష్ట్భ్రావృద్ధికోసం చేసిన అన్ని ప్రయత్నాలు, పథకాలను ప్రజలకు వివరించేలా తెలుసుకుని ఉండాలన్నారు. 2014లో 282సీట్లతో అఖంఢ విజయాన్ని భారతదేశంలో ఏకపక్షంగా బీజేపీ సాధిస్తుందని ఎవరూ ఊహించలేదని, ఇలాంటి విజయాన్ని అందుకునేలా చేసిన కార్యకర్తలకే ఆ విజయాన్ని అంకితం చేయాలన్నారు. తొలిరోజుల్లో 40లక్షల సభ్యత్వాలు చేయాలని టార్గెట్ ఇచ్చారని అంతభారీ స్థాయిలో సభ్యత్వాలు చేయడం ఎలా అంటూ భయపడ్డా, నెరవేర్చగలిగామన్నారు. ప్రతికార్యకర్త అంకితభావంతో కృషి చేస్తున్నందునే పార్టీ విజయం సాధ్యమైందన్నారు. పార్టీని స్థాపించిన మహానుభావులు, పుణ్యమూర్తులు దీనదయాల్‌చటోపాధ్యాయ, సుందర్‌సింగ్ భండారి, శ్యామ, వాజ్‌పేయి, అద్వాని లాంటి వారి త్యాగబలం భారతీయ జనతాపార్టీ అన్నారు. సుందర్‌సింగ్ భండారి ఎండిన చపాతీలు సైకిల్‌కు తగిలించుకుని నిరంతరం తిరుగుతూ కాళ్లు సొట్టలు తిరిగేలా ఇల్లిళ్లు తిరిగి పార్టీకి తగిన గుర్తింపు తెచ్చారన్నారు. వారి బలిదానాలు స్ఫూర్తిగా తీసుకుని ఏపీలో బీజేపీ సుస్థిర స్థానం సాధించేలా కష్టపడి పనిచేయాలన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో కేంద్రం ఎంతో సహకరించినా, రాజధానిని కట్టుకోలేని అసమర్థప్రభుత్వం ఇక్కడ ఉందన్నారు. ఎందరో వాగ్దానాలు ఇచ్చారని, అందులో కొన్నికూడా నెరవేరలేదన్నారు. రైతు రుణం తీర్చలేని పరిస్థితిలో కంతుల వారీగా మొత్తం ఇవ్వడంతో ఆకాస్త వడ్డీకే సరిపోయిందన్నారు. మహిళల బకాయిలు అలాగే ఉన్నాయని, నిరుద్యోగ భృతి నామమాత్రమేనని, 40లక్షల మంది నిరుద్యోగులుంటే కేవలం 10లక్షల మందికే నిరుద్యోగ భృతి అందుతోందని ఆరోపించారు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లిందని, ప్రతిపక్షనేతలు అసెంబ్లీలో ఉండి ప్రభుత్వవైఫల్యాలను ప్రజలకు చెప్పాల్సిన పార్టీ బయటకు వచ్చిందన్నారు. ఇలాంటి సందర్భంలో మనం ప్రజల్లోకి వెళ్లి కేంద్రం రాష్ట్రానికి ఏమిచేసిందో చెబితే వారికి అర్థవౌతుందన్నారు. వాజ్‌పేయి మాట ప్రకారం ప్రతి పోలింగ్‌బూత్‌లో జైభారత్ అనే ఇద్దరు కార్యకర్తలుండాలన్నారు. మీ అందరి అంకితభావంతోనే ఈనాడు బీజేపీ ఇంతపెద్దసభను జరుపుకుంటోందని ఆమె అన్నారు.

నేటి నుండి జిల్లాలో శ్రీనివాస కల్యాణోత్సవాలు
రాయచోటి, జనవరి 18: టీటీడీ శ్రీనివాస కల్యాణ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఈ నెల 19-24వ తేదీల వరకు కడప జిల్లాలో ఉచితంగా టీటీడీ వారిచే శ్రీనివాస కల్యాణోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కల్యాణ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ప్రభాకర్‌రావు, ఓఎస్డీ సుబ్బరాయుడులు తెలిపారు. లోకకల్యాణాన్ని ఆకాంక్షించి టీడీపీ కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లకు ఇప్పటి నుండే శ్రీకారం చుట్టామని వారు ఒక ప్రకటనలో తెలిపారు. కన్నులపండువగా సాగుతూ దివ్య అనుగ్రహ ఫలాలనిచ్చే దేవదేవుడి కల్యాణాలను టీటీడీ కుగ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో ప్రసిద్ధిగాంచిన సాంస్కృతిక, అధ్యాత్మిక క్షేత్రాలతో పాటు విదేశాల్లో సైతం శ్రీనివాస కల్యాణోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. ఈ నెల 19న శనివారం సిద్దవటం జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో సాయంకాలం 6 గంటలకు శ్రీనివాస కల్యాణం జరుగుతుందని వివరించారు. అలాగే 20న ఆదివారం జడ్పీ హైస్కూల్ లక్కిరెడ్డిపల్లె, 22న చిన్నమండెం మండలం మల్లూరమ్మ దేవస్థాన ప్రాంగణం, 23న సంబేపల్లె మండలం శెట్టిపల్లె గ్రామం దిగువ దళితవాడ, 24న సుండుపల్లె మండలంలోని ఆరోగ్యపురం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఈ కల్యాణోత్సవాలను కన్నుల పండువగా జరుగుతాయని వారు వివరించారు. కల్యాణోత్సవ ప్రాంగణంలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు భజన బృందాలచే భజనలు, కోలాటాలు, సాయంకాలం 4-5 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే అన్నమయ్య సంకీర్తనలు, సాయంకాలం 5-6 గంటల వరకు హరికథాగానం, 6-8 గంటల వరకు శ్రీవారి కల్యాణం జరుగుతుందన్నారు. ఈ కల్యాణోత్సవాలకు భక్తులు బంధుమిత్ర కుటుంబసభ్యులతో పెద్ద ఎత్తున తరలివచ్చి కోదండరాయుడి కల్యాన్ని కన్నులారా వీక్షించి సకల శుభాలు పొందాలని వారు కోరారు.

ఇప్పటికైనా ఉక్కు కోసం సహకరించాలి
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ
కడప సిటీ,జనవరి 18: విభజన హామీల ప్రకారం రాష్ట్భ్రావృద్ధికోసం కేంద్రం పంపే డబ్బును వెనుకబడిన జిల్లాలకు ఖర్చుపెట్టకుండా పక్కదోవలకు మళ్లిస్తున్నారని చంద్రబాబునాయుడు నిరంతరం కేంద్రాన్ని నిందిస్తూనే బ్రతకాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. నగరంలోని కందుల ఎస్టేట్‌లో నిర్వహించిన బీజేపీ బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ సహకరిస్తుందని ,కేవలం తన అనుకూల పత్రికలతో అబద్దాలు ప్రచారంచేస్తూ చంద్రబాబు కేంద్రంపై బురద చల్లుతున్నారన్నారు. ఇప్పటికైనా సహకరిస్తే కడపలో ఉక్క్ఫ్యుక్టరీ స్థాపించేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రానికి విద్యాసంస్థలు, అనంతపురం జిల్లాలో కియామోటర్స్‌లాంటివి కేంద్రం ఇచ్చినవేనని, ఓటమి భయంతోనే చంద్రబాబు దిగజారుతున్నారన్నారు. కేంద్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ మాట్లాడుతూ బీజేపీ కేడర్ పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు శక్తికేంద్రాల ద్వారా ప్రజలను కలిసి దేశంలో, రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధి పథకాలను వివరించాలన్నారు. నరేంద్రమోదీ లాంటి నాయకత్వం ఇతర పార్టీలకు లేదన్నారు. ఏపీలో భూస్థాపితమైన కాంగ్రెస్‌ను తిరిగి తన భుజాలపై మోసి, ప్రజలపై రుద్దేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాణానికి రెండవ వైపు తెలుగుదేశంపార్టీ అని, దేశాన్ని కాపాడుకోవాలంటే టీడీపీని భూస్థాపితం చేయాల్సిందేనన్నారు.

ఫలించిన మీసేవ చర్చలు
* నేటి నుండి పనిచేయనున్న మీసేవ కార్యాలయాలు
* హర్షం వ్యక్తం చేసిన మీసేవ నిర్వాహకులు
ఆంధ్రభూమి బ్యూరో
కడప,జనవరి 18: రాష్ట్రంలో గత 14సంవత్సరాల నుండి ఈసేవా, 2012న మీ సేవగా రూపాంతరం చెంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీ సేవ నిర్వాహకులు గత రెండురోజులుగా సమ్మెబాట పట్టి రాష్ట్ర యూనియన్ నాయకులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించినట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం విజయవాడలోని ఈఎస్‌డీ కార్యాలయంలో రాష్ట్ర మీసేవ అసోసియేషన్ నాయకులకు లిఖితపూర్వకంగా అధికారులు హామీ ఇవ్వడంతో సమ్మెకు ఫుల్‌స్టాప్ పెట్టారు. ముఖ్యంగా కనీస వేతనానికి అనుగుణంగా ప్రత్యేక ఏజెన్సీ ద్వారా పరిశీలించి కనీస వేతనం సమస్యకు పరిష్కారం చూపుతామని అధికారులు హామీ ఇచ్చారు. ఈనెలాఖరుకల్లా రిపోర్టు ఇవ్వనున్నారు. స్కానింగ్ చార్జిలు రూ.2లు నుండి రూ.5లు పేజీకి, కమీషన్ క్యాటగిరి ఏకి రూ.7లు, క్యాటరిగి బికి రూ.9లు పెంచడం జరిగిందన్నారు. అలాగే నిర్వాహకులకు హెల్త్‌కార్డులు, ఏ నిర్వాహకుడైనా ఆకస్మిక మరణం చెందితే రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నారు. ఇంటర్నెట్, విద్యుత్ తదితర సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయాన్ని అందిస్తామన్నారు. దీంతో శనివారం నుండి మీసేవ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా యూనియన్ నాయకులు జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావును కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఎక్స్‌గ్రేషియా, కమీషన్ పెంపు, హెల్త్‌కార్డు వర్తింపు, ఉచిత విద్యుత్, ఇంటర్నెట్, మీసేవ స్టేషనరీ వంటి 18రకాల డిమాండ్స్‌ను పరిష్కరించినందుకు పంచాయతీరాజ్, ఐటిశాఖ మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

చలనచిత్ర రంగంలో రారాజు మానాన్న
* కేంద్రమాజీ మంతి పురందరేశ్వరీ
కడప సిటీ,జనవరి 18: చలన చిత్రరంగంలో రారాజు మానాన్న అని మాజీ కేంద్రమంత్రి పురందరేశ్వరీ శుక్రవారం అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు 23వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని కడప నగరానికి వచ్చిన ఆమె నగర కూడలిలో ఉన్న ఎన్‌టి రామారావు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి చరిత్ర ఉన్నంతకాలం ఎన్‌టి రామారావు పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు. తన 60వ ఏట రాజకీయాల్లో ప్రవేశించి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏలారన్నారు. అప్పట్లో పేదలకోసం ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ప్రజలను ఆకట్టుకున్నాయన్నారు. మండల వ్యవస్థ రద్దు, కిలోరూ.2లు బియ్యం, జనతావస్త్రం, మహిళా విశ్వవిద్యాలయం లాంటివి ఎన్నో స్థాపించి తెలుగువారి అభ్యుదయం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని అభివర్ణించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే తాను పనిచేస్తానని తెలిపారు. రాయలసీమకు తనను దత్తపుత్రునిగా ఎన్‌టి రామారావు వర్ణించుకున్నారన్నారు. తెలుగుగంగ ద్వారా మద్రాసుకునీరు, గాలేరి-నగరి, హంద్రీ-నీవా లాంటివి వారి దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఆయన ఈప్రాంతానికి చేసిన సేవలు మరువలేమని, ఆయన కూతురుగా పుట్టడం నాజన్మజన్మల అదృష్టమని పొంగిపోయారు.

ఇప్పటికైనా ఉక్కు కోసం సహకరించాలి
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ
కడప సిటీ,జనవరి 18: విభజన హామీల ప్రకారం రాష్ట్భ్రావృద్ధికోసం కేంద్రం పంపే డబ్బును వెనుకబడిన జిల్లాలకు ఖర్చుపెట్టకుండా పక్కదోవలకు మళ్లిస్తున్నారని చంద్రబాబునాయుడు నిరంతరం కేంద్రాన్ని నిందిస్తూనే బ్రతకాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. నగరంలోని కందుల ఎస్టేట్‌లో నిర్వహించిన బీజేపీ బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ సహకరిస్తుందని ,కేవలం తన అనుకూల పత్రికలతో అబద్దాలు ప్రచారంచేస్తూ చంద్రబాబు కేంద్రంపై బురద చల్లుతున్నారన్నారు. ఇప్పటికైనా సహకరిస్తే కడపలో ఉక్క్ఫ్యుక్టరీ స్థాపించేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రానికి విద్యాసంస్థలు, అనంతపురం జిల్లాలో కియామోటర్స్‌లాంటివి కేంద్రం ఇచ్చినవేనని, ఓటమి భయంతోనే చంద్రబాబు దిగజారుతున్నారన్నారు. కేంద్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ మాట్లాడుతూ బీజేపీ కేడర్ పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు శక్తికేంద్రాల ద్వారా ప్రజలను కలిసి దేశంలో, రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధి పథకాలను వివరించాలన్నారు. నరేంద్రమోదీ లాంటి నాయకత్వం ఇతర పార్టీలకు లేదన్నారు. ఏపీలో భూస్థాపితమైన కాంగ్రెస్‌ను తిరిగి తన భుజాలపై మోసి, ప్రజలపై రుద్దేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాణానికి రెండవ వైపు తెలుగుదేశంపార్టీ అని, దేశాన్ని కాపాడుకోవాలంటే టీడీపీని భూస్థాపితం చేయాల్సిందేనన్నారు.

కేంద్రహోం మంత్రికి
మంత్రి ఆదినారాయణరెడ్డి స్వాగతం
కడప సిటీ,జనవరి 18: కడప నగరానికి బీజేపీ శ్రేణుల సమావేశానికి హాజరైన కేంద్రహోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు విమానాశ్రయంలో రాష్టమ్రార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. విమానాశ్రయంలో కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అభిషేక్ మహంతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర నాయకులు గోవర్దన్‌రెడ్డి, పీరయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జి అషఫ్,్ర రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మాకం అశోక్, బి.సుబ్బరాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాధరెడ్డి తదితరులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.