కడప

రేపు సిఎం సుడిగాలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 18: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 20వతేదీ రాత్రి సిఎం కడపలోనే మకాం వేయనున్నారు. 20న ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. 5.30 నుంచి 6గంటల మధ్య నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించి, అనంతరం ఒంటిమిట్టకు చేరుకుని ఒంటిమిట్ట చెరువుకు నీటి విడుదల చేస్తారు. సాలాబాదు క్రాస్ వద్ద ఏర్పాటుచేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, శ్రీకోదండరామస్వామి గృహాలను ప్రారంభించనున్నారు. రూ.100కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీరబల్లి, సుండుపల్లె మండలాల్లో నీటి సమస్య పరిష్కారం కోసం రోళ్లమడుగు వద్ద ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. ఈ పథకానికి రూ.50కోట్ల అంచనాతో పనులు చేపట్టనున్నారు. గండికోట పర్యాటకాభివృద్ధికి రూ.16కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారు. ఒంటిమిట్ట శ్రీరామ్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు. కోదండరామ నగర్ కాలనీ చెరువుకట్టపై ఏర్పాటుచేసిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. కోదండరామ కాలనీలో రూ.2.64కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 20న సాయంత్రం 6.40 నుంచి 7.15 గంటల వరకు రైతులతో సమావేశమై వారి కష్టనష్టాలను తెలుసుకుంటారు. 7.15గంటలకు ఒంటిమిట్ట హరిత హోటల్ చేరుకుని అధికార, అనధికారులతో సమావేశం అనంతరం రాత్రి 8.35 గంటలకు కోదండరామస్వామి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. 8.40 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు కుటుంబ సభ్యులతో కల్యాణోత్సవంలో కుటుంబ సమేతంగా స్వామిసేవకు హాజరవుతారు. రాత్రి కడప ఆర్‌ఆండ్‌బి బంగ్లాచేరుకుని అధికార, అనధికారులతో సమావేశం అవుతారు. అనంతరం 21వ తేదిన ఉదయం 9.15 గంటల వరకు రోడ్లు,్భవనాల శాఖ వసతి గృహంలో బసచేసి కడప విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి అనంతపురానికి బయలుదేరి వెళ్లనున్నారు.
అంబరాన్నంటుతున్న రామయ్య బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్ట, ఏప్రిల్ 18: ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణోత్సవాన్ని ఈనెల 20వతేదీన అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టిటిడి చైర్మన్ చదవలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. సోమవారం రాత్రి హనుమంత వాహనం దేవదేవుడు దర్శనమీయగా, చైర్మన్ చదలవాడ హాజరయ్యారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ ప్రస్తుత రామయ్య బ్రహ్మోత్సవాలు ఇదివరకెన్నడూ లేనివిధంగా అత్యంత వేడుకగా సాగుతున్నాయన్నారు. తిరుమలేశుని తరహాలో రామయ్య బ్రహ్మోత్సవాలను తాము మొదటి సారిగా నిర్వహిస్తున్నామని, అందుకు సహకరిస్తున్న మండల వాసులకు, భక్త బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి రోజు నిర్వహిస్తున్న స్వామివారి వాహన సేవలు వెంకటేశ్వరస్వామి తరహాలోనే నిర్వహిస్తున్నామన్నారు. భక్తబృందం సహయ, సహకారాలతో కల్యాణోత్సవం అంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తాదులకు ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా గట్టి చర్యలు తీసుకొంటున్నామన్నారు. జిల్లా అధికారులు, టిటిడి అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఇఓ బాలాజీ పాల్గొన్నారు. అంతకుముందు కల్యాణ వేదికను ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డితో కలసి చైర్మన్ పరిశీలించారు.