Others

స్వామి దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలియుగంలో శ్రీ మహావైకుంఠం నుండి భువికి దిగివచ్చిన శ్రీహరి, ఏడుకొండల మధ్య వెలసి ఏడుకొండలవాడని ప్రసిద్ధిచెందిన వెంకటేశ్వరస్వామివారు తిరుమలలోని ఆనంద నిలయంలో దివ్య దర్శనమిస్తున్నారు. స్వామిని దర్శించుకోవాలన్న సంకల్పం మనసులో కలిగితే ఆయన మార్గదర్శకత్వంతో తిరుమలకు బయలుదేరుతాం. అక్కడ ముందుగా కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి దర్శించడం, సేవించడం, స్మరించడంవలన సమస్త పాపాలు తొలగి సర్వసుఖాలు కలుగుతాయి. పుష్కరిణిలో స్నానం చేసి సంప్రదాయ దుస్తులతో వరాహ నరసింహస్వామిని దర్శించాలి. సప్తగిరుల శిఖరాలమధ్య శ్రీమహావిష్ణువు స్వయంభువుడై వెలసి వున్నదే ఆనందనిలయం. మహాద్వార గోపురం నుంచి ప్రవేశించాలి. ఈ మహాద్వారానికి రెండు వైపులా స్వామివారు నవనిధులను రక్షించే శంఖనిధి, పద్మనిధిలను దర్శించుకొని శ్రీకృష్ణదేవరాయ మండపంలోకి ప్రవేశించాలి. అక్కడ దేవేరులైన తిరుమలదేవి, చిన్నాదేవిలను చూస్తాం. ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో కొలువుమేళానికి ఉపయోగించే మంగళవాద్యాలతో నాలుగు స్తంభాల మండపం సంపంగి ప్రదక్షిణామార్గం నాలుగు మూలలా వుంటాయి. రాజాతోడరమల్లును దర్శిస్తూ ధ్వజస్తంభ మండపంలోకి ప్రవేశించి క్షేత్రపాలక శిలకు నమస్కరిస్తూ వెండి వాకిలిగుండా ఆలయ ప్రవేశం చేయాలి. ప్రవేశ ద్వారం ప్రక్క గోడలపై చెక్కిన శ్రీనివాసకల్యాణం, స్వామివారి పాచికలాట, శ్రీరామపట్ట్భాషేకం వంటి ఘట్టాలను తిలకిస్తూ గోవిందనామ స్మరణతో విమాన ప్రదర్శన మార్గంలోకి ప్రవేశించాలి. ప్రధాన గోపురమునకు ఆనంద నిలయానికి ప్రదక్షిణ మార్గమగుటచే విమాన ప్రదక్షిణ మార్గం సుప్రభాత సమయంలో అంగ ప్రదక్షిణ చేయు మార్గం కనుక అంగ ప్రదక్షిణ మార్గమంటారు. వెండి వాకిలి దాటగానే శ్రీరంగనాథునికి నమస్కరించి విమాన ప్రదక్షిణ మొదలుపెడతారు. శ్రీ వరదరాజస్వామిని దర్శించుకొని ఘంటా మండపంలోకి ప్రవేశించి స్వామి దర్శనానికి వేచి వుండాలి. గరుడ మందిరానికి ప్రక్కనే వున్న హుండీని చూచి దానికి కాపలా కాస్తున్న జయవిజయులకు నమస్కరించి గోవిందా గోవిందా అంటూ బంగారు వాకిలిలోకి ప్రవేశించాలి. తలుపలకు బంగారు రేకు తాపడం చేయడంవలన బంగారు వాకిలిగా పిలుస్తున్నారు. ఇక్కడనుండే స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. మకర కుండలాలతో శంకు చక్రాలతో ప్రకాశిస్తున్న నిలువెత్తు స్వామిని గోవింద స్మరణతో నమస్కరిస్తూ స్నపన మండంలోకి ప్రవేశించాలి. ఇక్కడ స్తంభాలపై బాలకృష్ణ యోగ నరసింహ, శ్రీకృష్ణ కాళీయమర్దన శిల్పాలు ఉన్నాయి. కానుకలు భద్రపరిచే భాండాగారపు గదులను తిలకించవచ్చు. సూర్యోదయానికి ముందే ఈ మండపంలోని స్వామివారిని బంగారు సింహాసనంపై ఉంచి కొలువు జరుపుతారు. స్వామివారికి భోగశ్రీనివాసమూర్తి, పవళింపుసేవ జరుపు మందిరాలు భోజనశాలగా, శయనశాలగా ఉపయోగించు పవిత్ర మందిరం. ఎంతటివారైనా ఈ శయన మందిరంనుండే భక్తుల కోర్కెలు దీర్చు స్వామిని ప్రార్థించి దర్శించి నమస్కరించాలి. మందిరానికి గర్భాలయానికి మధ్యనున్న గడపను కులశేఖరపడి అంటారు. మూలవిరాట్ ఉత్సవ బల స్నపన శ్రీ సుదర్శన చక్రత్తాల్, శ్రీ సీతారామలక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణుల పంచలోహ మూర్తుల ఉత్సవమూర్తులు పలు సాలగ్రామాలు ఇక్కడ వేంచేసి ఉన్నాయి. బ్రహ్మ అఖండం వెలుగుతుంటుంది. మూలవిరాట్‌కు, ప్రతిరోజూ నిత్య పెళ్లికొడుకై ఏకాంతసేవ జరిపించుకొని భోగ శ్రీనివాసమూర్తికి పంచాంగ శ్రవణం, ఆదాయ వ్యయాలు వినిపించుటకు కొలువుదీరిన శ్రీనివాసమూర్తికి పర్వదినాలైన కృష్ణాష్టమి, క్షీరాబ్ది విగ్రహాలకు నమస్కరించాలి. ఆ దివ్య మంగళ విగ్రహానే్న కనులారా తిలకిస్తూ శయనమందిరం, రాములవారి మండలం, స్నపన మండపం, బంగారు వాకిలి చేరి తెలిసో తెలియకో చేసిన తప్పులు క్షమించమని అడగాలి. మళ్లీ త్వరలోనే స్వామివారి దర్శన భాగ్యం ప్రసాదించమని వేడుకుంటూ బయటకు రావాలి. బయటికి రాగానే ఎదురుగా కనపడే బంగారు బావి, వకుళాదేవి వంటశాల (పోటు) చూస్తూ విమాన ప్రదక్షిణ మార్గంలోగల అంకురార్పణ మండపం, యాగశాల, నాణేలు, నోట్ల పరకామణులు, చందనపు అరలు, ఆనంద నిలయ విమానం, విమాన వేంకటేశ్వరస్వామి వేద పారాయణ గదులు, సంకీర్తన భాండాగారాలను తిలకించవచ్చు. తొట్టలోని తీర్థాన్ని అష్టాక్షరి మంత్రంతో స్వీకరించాలి. శ్రీరంగనాథస్వామి ముందు భక్తితో సాష్టాంగ నమస్కారం చేస్తూ స్వామివారి దివ్య మంగళ విగ్రహం చూసే భాగ్యం తొందరగా అనుగ్రహిస్తూ అందుకు తగిన బుద్ధిని ప్రసాదించవలసిందిగా కోరుతాం. బయటకు వచ్చి అంజనాద్రిలో హనుమంతులవారి కాళ్ళకు బేడీలు తగిలించి శ్రీవారికి ఎదురుగా నిలబెట్టిన బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకోవాలి. అచటనే స్వామివారికి టెంకాయ కొట్టి, ముద్దకర్పూరం వెలిగించి గోవిందనామ స్మరణ చేయాలి. తిరుగు ప్రయాణంలో అలివేలు మంగాపురంలో వేంచేసివున్న అమ్మవారిని దర్శించుకోవాలి. ఇది కలియుగదైవం వేంకటేశ్వర దివ్య దర్శనం గురించి మన మహాత్ములు చెప్పిన దివ్య కథనం. ఇది ఆచరించి పునీతులమవుదాం.

-కురువ శ్రీనివాసులు