Others
‘మనుచరిత్ర ప్రబంధ దర్శన’ దర్శనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెదడులో ఏర్పడిన భావానికి, చేతితో నిర్మించే పదానికి మధ్య పట్టే సమయంలో రెంటికీ తేడా వలుంటుంది. కనుక మనసులోనే పద్యం మొత్తం మననం చేసుకునేవారా.. లిఖిస్తూ పద్యం నిర్మించేవారా అన్నది ప్రశ్న. నన్నయ చివరి పద్యం ‘శారద రాత్రులుజ్జ్వల’ అనేది అసంపూర్ణమనీ దానిని ఎఱ్రాప్రగడ పూర్తిచేశారని విన్నాను. అది నిజమే అయితే లిఖించుతూ నిర్మించటమనే పద్ధతి ఉండొచ్చునని ఊహించవచ్చు. ఏమైనా మారన మార్కండేయ పురాణంలోని 147 పద్యాల కథ 662 పద్యాల ప్రబంధంగా పెద్దన విస్తరించాడు. కనక ఆయన కథ కన్న పద్యంలో సొగసు, సూచనలు, సంభాషణలు, చమత్కారాలు, సన్నివేశ నిర్వహణ వంటివాటిపై ఎక్కువ దృష్టి పెట్టి ఉండవచ్చు. ఈ ఆధారాలతో ఆలోచిస్తే పెద్ద గ్రంథం నిర్మించటానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఆయన సంప్రదించవలసిన గ్రంథం కూడా మారనదొక్కటే అయుండవచ్చు. జొ.రా.శ నిస్సందేహంగా అంతకన్నా చాలా ఎక్కువ సమయం వెచ్చించారు, శ్రమించారు.
* జొ.రా.శ గారు స్పృశించిన గ్రంథాలు ఎన్ని? వ్యాసకర్తలు ఎందరు?
మంచి ప్రశ్న. గంటి జోగి సోమయాజి, మారన, విన్నకోటి మాధవరావు, ఆర్.ఎస్.సుదర్శనం, వెంపరాల సూర్యనారాయణశాస్ర్తీ, శ్రీనాథుడు, గుంటూరు శేషేంద్ర శర్మ, చేమకూర వెంకటకవి, రామరాజభూషణుడు, వేటూరి ప్రభాకరశాస్ర్తీ, కెవీఆర్, అక్కిరాజు ఉమాకాంతరావు, భరతుడు, దువ్వూరి రామిరెడ్డి, పల్లా దుర్గయ్య, పువ్వాడ సూర్యనారాయణరావు, కె.వి.నారాయణరావు, తాపీ ధర్మారావు, శ్రీశ్రీ, నన్నయ్య, ఆరుద్ర, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్ర్తీ, మేడిపల్లి వేంకట రమణాచార్యులు, నార్ల వెంకటేశ్వరరావు, వంతరాం రామకృష్ణారావు, తంజనగరం తేవప్పెరుమాళ్లయ్య, శిరోమణి సన్నిధానం సూర్యనారాయణ శాస్ర్తీ, రేమెళ్ల సూర్యప్రకాశ శాస్ర్తీ, ఇంకా కొందరు ఉండవచ్చు. గ్రంథాలు వ్యాసాలు లెక్కించే ఓపిక లేదు.
* వారు చాలా శ్రమించారంటావు?
- అది అంతా యింతా శ్రమ కాదు. నేను శ్రమకు పెద్దపీట వేస్తాను. కథానిలయం స్థాపించినపుడు కాళీపట్నం రామారావుగారు నాకు నచ్చచెప్పి ఒప్పించిన అంశం శ్రమ. ‘ఎన్నో వేలమంది తమ జీవితంలో కథ రాయటానికి సమయం వెచ్చించారు. ఆ శ్రమ వృధా పోకుండా భద్రం చెయ్యాలనేది నా పూనిక. నువ్వు నాకు సహకరించాలి’ అన్నది వారి వాదన. మనసు ఫౌండేషన్ కూడా ఆ రకమైన శ్రమను భద్రం చేయజూస్తున్నదని నా అభిప్రాయం. ఈ రెండు సంస్థలలో నా ఉడతాభక్తి పాత్రకి అది ప్రధాన కారణం. కనుక జొ.రాశ.గారి శ్రమకు ముందుగా నా నమస్సులు. ఆ శ్రమను ఇలా అచ్చొత్తించిన వారి అబ్బాయి జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తికి అభినందనలు.
ఈ గ్రంథంలో జొ.రా.శ. ఖండించిన
ముఖ్యాంశాలేమిటి?
1. పెద్దనకి సమకాలీనుడైన రామ రాజభూషణుడు కుకవి నిందలో ‘‘కుకవి ప్రణీత కృతి, సామాన్యాకృతింబూని పైపై వనె్నల్ పచరింపదాని దిలకింపంబోరు ధీరోత్తముల్ ’’అని రాయటం మనుచరిత్రను గురించే అంటారు. జొ.రా. శ. అప్పటి నుంచి అనేకులు గ్రంథచౌర్య అభియోగం చేశారు.
‘‘మారన మార్కండేయపురాణం ఆధారంగా స్వారోచిష మనుసంభవం చెప్పమని, రాయలే పరిమితి విధించారు. పెద్దన కనకనే ఆ కట్టుదిట్టాలలో సర్వజన రమణీయకంగానూ, ధర్మప్రబోధకంగానూ గ్రంథ నిర్మాణం చేయగలిగారు. రాయల గౌరవానికి ప్రాతులయ్యారు.’’ అన్నది జో.రా.శ.వాదన (పుట:90)
2. అవసరానికి మించి ప్రవరుని గురించి రాసారు. ‘్భరత సంస్కృతికి ఆటపట్టు అయిన గార్హస్థ్య ధర్మరమణీయమైన జీవంపోసి అక్షర యశశ్వరీరం ప్రసాదించారు’’అంటారు జొ.రా.శ.
3. స్వరోచి పుట్టకతో మనుచరిత్రలోని మనోహరమైన కథ ముగిసింది. తర్వాత కథ అతికినట్లుంది. వస్వైక్యత చెడింది. ‘‘ప్రవరుని ధర్మకర్మ రూపాంతరం పొంది మనుధర్మశాస్త్ర కర్త పుట్టువుకు తోడ్పడింది. కనుక వస్వైక్యత చెడలేదు’’ ఇది జొ.రా.శ వివరణ.
4. వరూధిని వేశ్యా వెలయాలు అన్న అనేకమంది అభిప్రాయాన్ని జొ.రా.శ ఖండించారు. ఈ పుస్తకంలో పావువంతు స్థలం ఈ వాదనతోనే నిండింది. ఆ వాదనలో ముఖ్యాంశాలు కొన్ని.
ఎ. లజ్జా విహీన కాదు. లజ్జాపరవశురాలు.,(పుట:73)
బి. ఆమె ముగ్ధ. జాణ కాదు. నిష్కళంక ప్రణయోపాసిని (పుట80)
ఇంకాఉంది