చిత్తూరు

నీరు-చెట్టు పనులు వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 30: జిల్లాలో నీరు-చెట్టు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో నీరు-చెట్టు, పంట సంజీవిని, ఇంకుడు గుంతలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీరు-చెట్టు పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. కొన్ని మండలాల్లో ఈ పనులు ఆశాజనకంగా జరుగుతున్న కొన్ని చోట్ల నత్తనడకన కొనసాగడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసారు. దీని వలన భవిషత్తులో అనేక ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు కూడా వాస్తవాలను గుర్తించి ప్రజల్లో చైతన్యం తెచ్చి త్వరగా పనులు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గత ఏడాది చేపట్టిన నీరు-చెట్టు వల్ల ఈ ఏడాది కురిసిన వర్షంతో మంచి ఫలితాలు వచ్చాయని దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులు కూడా దీనిపై మక్కువ చూపాలన్నారు. అలాగే పంట సంజీవిని కార్యక్రమం క్రింద రైతులు ఫారంఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. కరువు పరిస్థితులను అధిగమించడానికి ఇది ఎంతో దోహదపడుతాయని తెలిపారు. ముఖ్యంగా రైతులు తమ పంట పొలాల వద్ద వీటిని ఏర్పాటు చేయడానికి నడుం బిగించాలన్నారు. వీటి వల్ల ఎంతో ప్రయోజనం ఉందన్న విషయాన్ని గుర్తించి రైతులు చైతన్య వంతులు కావాలన్నారు. అలాగే అధికారులు కూడా వీటి ప్రయోజనాలను రైతులకు వివరించి వారిలో చైతన్యం తీసుకువచ్చి వారే నేరుగా ఫారంఫండ్ నిర్మించుకోవడానికి ముందుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రతి ఇంట ఇంకుడు గుంతలు నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది కూడా భవిషత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి మండలంలో నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు అధిగమించే విధంగా తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని సప్లై చానల్ ఏర్పాటు, చెరువు కట్ట మరమ్మత్తులను కూడా యుద్దప్రాతిపధికన చేయాలని ఆదేశించారు. తదుపరి కలెక్టర్ అధికారులతో సమీక్షించి మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్‌తో పాటు వివిధ రైల్వే వంతెనెల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఇ వేణు, డ్వామా పిడి వేణుగోపాల్‌రెడ్డి, మదనపల్లె సబ్‌కలెక్టర్ కృతికాభత్ర పలు అధికారులు పాల్గొన్నారు.