కడప

జిల్లా కాపుల కట్టడికి ఎమ్మెల్సీ పదవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 2:కాపు సంఘం అధినేత ముద్రగడ పద్మనాభం శరవేగంతో చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కాపులను ఆకర్షించేందుకు తెలుగుదేశంపార్టీ అధిష్టానం జిల్లాలో వచ్చే ఏడాది మార్చిన ఖాళీ ఏర్పడుతున్న ఎమ్మెల్సీ పదవుల్లో జిల్లాలోని ఒక కాపు నేతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి 2019 ఎన్నికలకు రెండుగానీ, మూడు కానీ అసెంబ్లీ స్థానాలను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ విషయంలో రాజంపేట మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి పి.బ్రహ్మయ్యకు గానీ, పారిశ్రామికవేత్త, గతసార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేసి ఓటమి చవిచూసిన జిల్లా దుర్గాప్రసాద్‌కు కానీ ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడానికి టిడిపి అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాపులు అధికంగా ఉన్న రాయచోట, రాజంపేట, కడప నియోజకవర్గాల్లో 2019 ఎన్నికలు నాటికి పార్టీ టికెట్ ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటికే కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మోదుగుల పెంచలయ్య కాపుల్లో ఉన్న ఆలోచనలు, రాజకీయంగా వెనుకబడిన నేతల వివరాలు, వారి అభిప్రాయాలు సేకరించి పంపినట్లు తెలుస్తోంది. జిల్లాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా ఆ ఎమ్మెల్సీ స్థానాలు మార్చినాటికి కాలయ్యేవారి స్థానంలో కాపులకే పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే రాజంపేట నుంచి పి.బ్రహ్మయ్యకు కడప నుంచి ఎస్.దుర్గాప్రసాద్‌కు ప్రత్యర్థులు, తమపార్టీలో ఎదురౌతున్న వ్యవహారాలపై టిడిపి అధిష్టానానికి వివరించినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో బ్రహ్మయ్యకు కానీ దుర్గాప్రసాద్‌కు గానీ ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2019 ఎన్నికల నాటికి పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయో లేదోనని బ్రహ్మయ్య, దుర్గాప్రసాద్‌లు తమకు ఎమ్మెల్సీ స్థానాలే కావాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఇటీవల తెలుగుదేశంలో చేరిన వైకాపా ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డి, శాసన మండలి డిప్యూటీ స్పీకర్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డిలు ఉన్నారు. జమ్మలమడుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ నారాయణరెడ్డి సోదరుడు సి.ఆదినారాయణరెడ్డికి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఇస్తున్న నేపధ్యంలో సి.నారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలు అంతంతమాత్రమేనని పలువురు భావిస్తున్నారు. ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డికి ఎమ్మెల్సీలో మరో మారు అవకాశం లభిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. అలాగే కాంగ్రెస్‌పార్టీ తరపున రైల్వేకోడూరు నాయకుడు బత్యాల చెంగల్రాయులు,కాంగ్రెస్‌పార్టీ తరపున శాసన మండలి పక్షనేత సి.రామచంద్రయ్యల భవితవ్యం కాలమే నిర్ణయించాల్సి ఉంది. ఏది ఏమైనా జిల్లాలో కాపులను ఆకర్షించడంతోపాటు కాపు నేతలకు సముచిత స్థానం కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం అన్ని విధాల కసరత్తు చేస్తోంది.