కడప

అత్యున్నత ప్రమాణాలతో రాష్రాభివృద్ధి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, జూన్ 2:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2050 సంవత్సరం నాటికి ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు లక్ష్యమని విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని గాంధీ విగ్రహం దగ్గర నవ నిర్మాణ దీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ కొంత మంది స్వార్ధపరులు తమ స్వలాభం కోసం రాష్ట్రా న్ని రెండు ముక్కలుగా చీల్చారని, గత రెండేళ్ల క్రితం జూన్ 2న ఎపి రెండు రాష్ట్రాలుగా విభజించగా మన రాష్ట్రానికి రూ. 16 వేల కోట్ల లోటుబడ్జెట్, తెలంగాణకు రూ. 36 వేల కోట్లు మిగులు బడ్జెట్ ఉండేదన్నారు. నేడు తెలంగాణ ప్రజలు పండుగ చేసుకొంటుంటే, మన రాష్ట్ర ప్రజలు ధర్నాలు, దీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సిఎం రాజకీయ అనుభవం తో తమ అమోఘమైన తెలివి తేటలతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని విడదీసే నాయకులు రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయకుండా ఎపి రాజధాని కూడా లేకుండా కట్టుబట్టలతో బయటకు పంపారన్నారు. అయినా సిఎం చంద్రబాబునాయుడు ఏ మా త్రం అధైర్య పడకుండా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాడన్నారు. నేడు ఇతర రాష్ట్రాలు గర్వించే విధం గా ఆధునాతన భవనాలతో అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవ్వరికీ ఏ లోటు లేకుండా కుల, మత, పార్టీలకు అతీతంగా తనదైన శైలిలో సిఎం అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారన్నారు. మన రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉందని, రాష్ట్రంలోన 5 కోట్ల మంది ప్రజలు కలసి రాష్ట్భ్రావృద్ధి కోసం ఒక సంపదగా చంద్రబాబునాయుడును సిఎంగా గెలిపించుకున్నారన్నారు. ఈ సంపదన ప్రతి మారుమూల ప్రాంతంలో వెల్లి వికసించాలంటే మనమంతా సిఎంకు సహకరించాలని మేడా పిలుపునిచ్చారు. రాబోయే రెండేళ్లలో ప్రతి కుగ్రామానికి వంద శాతం వౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. దీక్షా కార్యక్రమంలో ప్రణాళికాబద్ధంగా ప్రతి అంశాన్ని చర్చించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ నవ నిర్మాణ దీక్షను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనతో జరిగిన నష్టాన్ని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వివరించారు. ఈ కార్యక్రమానికి ముందుగా స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహం నుండి గాంధీ విగ్రహం వరకు నవ నిర్మాణ దీక్షా ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వ విప్ మేడా ఈ సందర్భంగా నవ నిర్మాణ దీక్షా ప్రతిజ్ఞను చదివి వినిపించి అందరిచే చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్ పిళ్లై, మున్సిపల్ కమీషనర్ ఎన్‌వి రమణారెడ్డి, తహశీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బి ఇఇ ప్రతాప్‌రెడ్డి, పిఆర్ ఇఇ కృష్ణారెడ్డి, ఎంపిడిఓ హరినాధ్‌బాబు, టిడిపి నాయకులు డాక్టర్ సుధాకర్, టి.సంజీవ్‌రావ్, బాపనయ్యనాయుడు, పి.కుసుమకుమారి, బి.వెంకటేశ్వర్లు, యెద్దల సుబ్బరాయుడు, పారా సుబ్బానాయుడు, టి.లక్ష్మీనారాయణ, శవన వెంకటసుబ్బానాయుడు, షేక్ అబ్దుల్లా, ఉమామహేశ్వరరెడ్డి, వివిధ శాఖల అధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.