చిత్తూరు

రాష్ట్భ్రావృద్ధికి సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 2: రాష్ట్భ్రావృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం చిత్తూరులో గతంలో సమైక్యాంధ్ర ఉద్యమాలకు వేదికయిన పిసిఆర్ వద్ద నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన దినాన్ని ప్రభుత్వం నవనిర్మాణ దీక్షగా పరిగణించి ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విభజన నేపథ్యంలో మనం అనేక రకాలుగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. ఈనష్టాన్ని పూడ్చుకొని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందివ్వాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అభివృద్ధికి దీక్ష బూనాలని పిలుపు నిచ్చారు. గ్రామీణ ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందితే రాష్ట్రం కూడా వేగంగా పురోభివృద్ధిని సాధిస్తుందన్నారు. ఇందుకు యువత ముందుకు రావాలని కోరారు. గ్రామాల్లో వెనుకబాటుతనాన్ని పారద్రోలాలన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో కొట్టు మిట్టాడుతున్నా ముఖ్యమంత్రి ముందస్తు చర్యలు కారణంగా సంక్షేమ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. వెనుకబడిన మండలాల అభివవృద్ధిపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా వాస్తవాలను గుర్తించిక ప్రతిపక్షాలు ప్రభుత్వం పై విమర్శలు చేయడం దారుణమన్నారు. ఇలాంటి ప్రతిపక్షం ఉండటం దురదృష్టమని చెప్పారు. ప్రతిపక్ష కపట నాటకాన్ని ప్రజలు గుర్తించుకోవాలన్నారు. జడ్పీచైర్ పర్శన్ గీర్వాణి చంద్రప్రకాష్ మాట్లాడుతూ విభజనతో అనేక రకాలుగా నష్టపోయామని. ప్రస్తుతం 16 వేలకోట్ల లోటు బడ్జెట్‌తో ఉన్నా ముఖ్యమంత్రి కొరకు ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాజధానిలేక, కేంద్ర సహకారంలేక , ప్రత్యేక హోదా దక్కక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి అందరి తోడ్పాటు అవసరమన్నారు. ప్రత్యేక విజన్‌తో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రికి అందరూ సహకరించాలని కోరారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన హేతుబద్దంగా జరగలేదని,విభజనకు వ్యతిరేకంగా పార్లమెంట్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో అనేక ఉద్యమాలు చేసినా దారుణంగా విభజన చేశారన్నారు. నేడు రాజధానిలేక లోటు బడ్జెట్‌తో సమస్యల మధ్య నలిగి పోతున్నామని అయినా ముఖ్యమంత్రి దీక్షతో ముందుకు వెళ్తున్నారన్నారు. ప్రజలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రికి అందురూ సహకరించాలని కోరారు. నేడు ప్రపంచంలోనే అదర్శవంతమైన రాజధాని నిర్మాణాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి జనహిత ప్రియ నేత అయ్యారని చెప్పారు.దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి కష్టపడుతున్న సిఎంకు అందురూ చోదోడు వాదోడుగా ఉండలాన్నారు. ఎమ్మోల్సీ గౌనివారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఒకప్పుడు అతలాకుతలం అయిన జపాన్ నేడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకొందని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేడు రాష్టభ్రివృద్ధికి అందరూ భాగస్వామ్యులు కావాలన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ నేడు రాజధాని లేని రాష్ట్రంగా , ఆర్థికంగా చితికిపోయన మన రాష్ట్భ్రావృద్ధికి అందురు కృషిచేయాలన్నారు. అనంతరం నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేశారు. ఈకార్యక్రమంలో జెసి భరత్ గుప్తా, ఎస్పీ శ్రీనివాస్, డిఆర్‌ఓ విజయచందర్, రెండవ అదనపు జెసి వెంకటసుబ్బారెడ్డి, ఇన్‌చార్జ్ మేయర్ సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి కుతూహలమ్మ, జిల్లా స్థాయి అధికారులు దేశం నేతలు దొరబాబు, చంద్రప్రకాష్. షణ్ముగం, ప్రవీణ్, బద్రీనారాయణ, వైవి రాజేశ్వరి, పలువురు ఉద్యోగ సంఘ నేతలు నగర ప్రముఖులు పాల్గొన్నారు.