కడప

ముస్లింలు రంజాన్‌ను సంతోషంగా జరుపుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 2: జిల్లాలో ముస్లింలు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో, సుఖశాంతులతో జరుపుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ కెవి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం కొత్త కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో రంజాన్ పురస్కరించుకుని ఏర్పాటుచేసిన శాంతికమిటీ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముస్లింలు జరుపుకునే రంజాన్ పండుగకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. పండుగరోజు ఈద్గాలవద్ద నిర్వహించే సామూహిక ప్రార్థనలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని వసతులు కల్పించాలన్నారు. ఈద్గాలు, మసీదుల వద్ద పారిశుద్ధ్యం పనులతోపాటు అక్కడ అవసరమైన నీటి వసతిని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరంతరం విద్యుత్, మంచినీటి వసతిని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రార్థనలకు వెళ్లే దారిలో పరిశుభ్రత మెండుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి వేళల్లో జరిపే ప్రార్థనల సందర్భంగా విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా అలాగే వీది దీపాలు సజావుగా ఉండేలా చూడాలని సూచించారు. జిల్లా శాంతికి, సామరస్యానికి ప్రతీక అన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఈ సమావేశంలో హాజరైన హిందు, ముస్లిం మతపెద్దలు, శాంతి కమిటీ సభ్యులు శాం తిభద్రతల పరిరక్షణలో జిల్లా యంత్రాంగానికి తోడ్పాటు అందించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ, ఏఎస్‌పి విజయ్‌కుమార్, కడప, జమ్మలమడుగు, రాజంపేట ఆర్డీవోలు , డిఎండబ్ల్యువో ఖాదర్‌బాషా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.