చిత్తూరు

హంద్రీ-నీవా రైతులను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి.కోట, జూలై 28: మండల పరిధిలో చేపట్టిన హంద్రీ-నీవా కాలువ పనుల వల్ల భూములు, ఆస్తులు పోగొట్టుకుంటున్న రైతులకు ప్రభుత్వం సత్వరం ఆదుకోవాలని బిఎస్‌పి పార్టీ ఆధ్వర్యంలో రైతులు గురువారం జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం మండలం మీదుగా కుప్పంకు హంద్రీ-నీవా నదీ జలాలను తీసుకెళ్లేందుకు ముమ్మరంగా కాలువ పనులు చేపట్టారు. అయితే భారీగా పంట భూములు, పండ్ల తోటలు నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించకనే పనులు పూర్తిచేయడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. బాధిత రైతులకు బాసటగా పలమనేరు నియోజకవర్గ బి ఎస్‌పి పార్టీ ఇన్‌చార్జి శ్రీనివాసులు ఆధ్వర్యంలోఅంబేద్కర్ కూడలిలో జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈసందర్భంగా ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించన తరువాతనే కాలువ పనులు చేయాలని డిమాండ్ చేసారు. జిల్లా ఉప పాలన అధికారి భరత్‌నారాయణగుప్తా రైతులను ఒప్పించి పనులు పూర్తిచేసి ఇటీవల బదిలీపై వెళ్లిపోయారని నూతన అధికారికి తమ గోడు ఏ విధంగా అర్థమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించిన తరువాతనే పనులు చేపట్టాలని బిఎస్‌పి పార్టీ తరపున హెచ్చరిస్తున్నట్లు వారు తెలిపారు. ఈకార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.