కడప

వీరభద్రస్వామిని దర్శించుకున్న రమేష్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, జూలై 29: స్థానిక భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామిని తెలుగు దేశం పార్టీ రాయచోటి నియోజక వర్గ ఇన్‌చార్జి రమేష్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీ వీరభద్రస్వామి దేవాలయ కార్యనిర్వాహణ అధికారిణి మంజుల ఆధ్వర్యంలో నియోజక వర్గ ఇన్‌చార్జి రమేష్ కుమార్ రెడ్డికి ఆలయ అర్బకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామిని ఆయన దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ మర్యాదలతో ఇన్‌చార్జికి పూలమాలలతో, శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం దేవాలయంలో రమేష్ కుమార్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి మహిళా ప్రధాన కార్యదర్శి సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వనం మనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేవుని సన్నిధిలో మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ మొక్కలను రక్షించే బాధ్యత ఆలయ అధికారులు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవో మంజుల, జిల్లా టిడిపి మహిళా ప్రధాన కార్యదర్శి సుజాత, వీరభద్రస్వామి కమిటీ మెంబర్లు కారంశెట్టి గిరి, ఆలయ అర్బకులు తదితరులు పాల్గొన్నారు.
శాకాంబరీ అలంకారంలో
భద్రకాళి అమ్మవారు
స్థానిక భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి దేవస్థానంలో నెలకొని ఉన్న భద్రకాళీ అమ్మవారు శుక్రవారం శాకంబరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సందర్భంగా అమ్మవారికి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ఆలయ అర్చకులు, వేదపండితులు సర్వాంగ సుందరంగా అలంకరణ చేశారు. అమ్మవారికి ఈ అలంకారం చేయడం వల్ల వర్షాలు పడి పాడిపంటలు పుష్కలంగా ఉంటాయని ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందించారు.