కడప

ప్రైవేట్ వైద్యానికి స్వస్తి చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 29: ప్రభుత్వ వైద్యులు, వైద్యసిబ్బంది సక్రమంగా హాజరుకావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఆయన జిల్లా పర్యటన సందర్భంగా పెండ్లిమర్రిలో రూ.కోటి 18లక్షలతో నిర్మించిన ప్రాథమిక వైద్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధులకు సక్రమంగా హాజరయ్యేందుకు రాష్టవ్య్రాప్తంగా గ్రామీణ వైద్యశాలల నుంచి పట్టణాల వైద్యశాలల వరకు రాష్ట్రంలో రూ.14కోట్లు ఖర్చుచేసి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ వైద్యానికి పూర్తిగా స్వస్తిపలికి విధులకు డుమ్మాకొట్టకుండా రోగులకు అందుబాటులో ఉండాలని, నూతన సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. తాను ఏ జిల్లాలో పర్యటించినా ఆ జిల్లాల్లో రాత్రివేళల్లో పర్యటిస్తున్నానని, ఈనేపధ్యంలో జిల్లాలో శుక్రవారం రాత్రి నిద్రించి రోగుల స్థితిగతులు తెలుసుకుంటానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రులకు పేదలు వస్తుంటారని వారిని సహృదయంతో మాట్లాడించి, సకాలంలో సరైన వైద్యం అందించాలని ఆయన పేర్కొన్నారు. ఆయనతోపాటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌కుమార్‌రెడ్డి, టిడిపి కమలాపురం ఇన్‌చార్జి పుత్తానరసింహారెడ్డి, రాష్ట్ర, జిల్లా వైద్యాధికారులు డా.దశరధరామయ్య, డా.సత్యనారాయణరాజు పాల్గొన్నారు.