కడప

2న చెన్నూరులో చౌడేశ్వరీదేవి జయంతి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నూరు,జూలై 31:స్థానిక పెన్నానది తీరంలో పరమటి వీధిలో వెలసిన శ్రీరామలింగేశ్వర చౌడేశ్వరీదేవి ఆలయంలో ఈనెల 2వ తేదీ మంగళవారం అమ్మవారి జయంతి జరిపేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. 150సంవత్సరాలు కిందట చెన్నూరులో దేవాంగ పూర్వీకులు ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి అమ్మవారు పూజలందుకుంటూ వస్తోంది. ప్రతి ఏడాది చౌడేశ్వరీదేవి జయంతిరోజున ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. తెల్లవారు జామున 4.30గంటలకు సుప్రభాత సేవ, 5.30గంటలకు గణపతి పుణ్యాహవాచనం, 7.30గంటలకు ప్రత్యేక అభిషేకం, 8.30గంటలకు అమ్మవారికి కుంకుమార్చన, 9గంటలకు మంగళహారతి, 9.30గంటలకు దేవస్థానం వారిచే చౌడేశ్వరీదేవికి ప్రత్యేక పూల అలంకరణ ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక పూజకార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 7గంటల నుంచి అమ్మవారిని ప్రత్యేక అలంకరణ ఏర్పాటుచేసి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండ తగు చర్యలు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.