కడప

పిడుగుపాటుకు పసుపుపంట ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నూరు,జూలై 31: చెన్నూరు పరిధిలో భవానీనగర్ వెనుకభాగంలో వ్యవసాయ పొలాల్లోసాగుచేసిన పసుపుపంటలో పిడుగుపడటం వల్ల సెంటు విస్తీర్ణంలో పసుపుపంట పూర్తిగా ధ్వంసమైంది. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షాలకు పిడుగు పసుపుపంటలో పడటంతో అప్పటికి చుట్టుపక్కలవారు ఎవరూ గమనించలేదు. పిడుగుపాటు ఏప్రాంతంలో పడింది చుట్టుపక్కల నివాసప్రాంతాలు ఉన్నప్పటికీ ఇండ్లల్లో ఉండిపోవడం వల్ల పిడుగుపాటు శబ్దానికి కొన్ని ఇండ్లల్లో టివిలు, ఫ్యాన్లు ఖాళి పోయాయి. అయితే శనివారం పసుపుపంట యజమాని కలుపుతీసేందుకు కూలీలను తీసుకుని కలుపుతీస్తుండగా ఆ ప్రాంతాన్ని పరిశీలించగా పిడుగుపడిన ప్రాంతంగా వారు గుర్తించారు. అప్పటికే భవానీనగర్‌లో నివాసం ఉన్న వారు అక్కడికి వచ్చి తెల్లవారు జామున పిడుగుపడి పెద్దశబ్ధం వచ్చిందని తామెవ్వరు ఇళ్లల్లో నుంచి బయటకు రావడం లేదని ఆ పిడుగు పసుపుపంటలో పడటంతో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. సెంటు విస్తీర్ణంలో పసుపుపంట పూర్తిగా ధ్వంసమై నేలకొరిగిపోయింది. పలువురు అక్కడికి వచ్చిన వారు పరిశీలించగా పిడుగుపాటేనని నిర్థారించారు.