కడప

13న గండిక్షేత్రంలో సామూహిక వివాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)జూలై 31: కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేంపల్లి మండలంలోని శ్రీగండి వీరాంజనేయస్వామి సన్నిధిలో ఈనెల 13న శ్రావణ శనివారం పురస్కరించుకుని ఉదయం 8గంటల నుండి 9గంటల లోపల దశమి మిధున లగ్నంలో అన్ని కులాలకు చెందిన పేద జంటలకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు గండి శ్రీ వీరాంజనేయస్వామి స్వచ్చంధ అనాధల సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, వివాహాల నిర్వాహకులు కిరసనాయిల్ వెంకటయ్య ఆదివారం తెలిపారు. వివాహాలు చేసుకునే ప్రతి జంటకు తాళిబొట్టు, మెట్టెలు, బాసికాలు, పూలదండలు, పురోహితులు, మంగళవాయిద్యాలతో పాటు ప్రతి పెండ్లి బృందం తరపున వంద మందికి ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
వివాహాలు చేసుకోదలచిన వారు తమ పేర్లను గువ్వల గంగాధర్ , పులివెందుల, కిరసనాయిల్ వెంకటయ్య, కడప, ఎర్రముక్కపల్లి డోర్‌నెం.1/1091, చిరునామాలో సంప్రదించి నమోదుచేసుకోవాలని ఆయన కోరారు.